సబ్ ఫీచర్

శ్రీనాథుడు, పోతన బావ బావమరదులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్ర భాగవతకర్తయైన బమ్మెరపోతనకు శ్రీనాథునితో బాంధవ్యమున్నదా? అని పరిశీలిస్తే చారిత్రకంగా లేదనిపిస్తోంది. కానీ సాహితీ లోకంలో ఎన్నో కథలు, గాథలు, వారివురి చుట్టూ, అల్లుకుని ఉన్నాయి. గురజాడ శ్రీరామమూర్తిగారి ‘కవి జీవితములు’ అనే ప్రాచీన గ్రంథములో కూడా వీరిని బావ, బావమరదులుగా చూపిస్తూ అనేక కథలు మనకు గోచరిస్తున్నాయి. దీనికి ఆధారభూతమనదగిన పద్యమొకటి దగ్గుపల్లి దుగ్గన నాసికేపాఖ్యానంలో మనకు కనిపిస్తుంది. దాని ఆధారంగానే ఈ కథలు లోకంలో వ్యాపించాయేమోననిపిస్తోందని శ్రీ వేటూరి ప్రభాకరశాస్ర్తీగారు అభిప్రాయపడ్డారు. ఆ పద్యమిదే.
సీ॥ కవిసార్వభౌముడై కర్ణాటకవిభుచేత
కనకరత్నాభిషేకములుగొనిన
శ్రీనాధసుకవి కూరిమి సేయుమఱదివి
దుగ్గయ కవిరాజు దగ్గుబల్లి
తిప్పనార్యునకు సతీమణీ ఎఱ్ఱమ
కును తనూ జుడవుపోతనకు ఎఱ్ఱ
నామాత్యవరునకు అనుగు తమ్ముండవు
శాండిల్య గోతుడౌ సరసమతివి
గీ॥ చెప్పనేర్తువు కృతులు సుస్థిరముగాగ
గాన నీవిపురచియింప గడిగియున్న
నాసికేత చరిత్రంబు నాదుపేర
అంకితము సేయు కవిరాజులాదరింప॥
- ఈ పద్యం వల్ల శ్రీనాథుని అత్తమామలు ఎఱ్ఱమ, తిప్పనార్యుడనియూ, బావమఱదులు పోతన, ఎఱ్ఱన, దుగ్గన అని తేలుతోంది. అంటే సాహితీలోకం దగ్గుపల్లి పోతననే బమ్మెరపోతనగా భావించిందేమోనని వేటూరి వారు అభిప్రాయపడ్డారు. దీనికి మరో కారణం కూడా ఉంది. క్రీ.శ.1420 నుండి 1450 వరకు పాతిక ముప్ఫై ఏళ్ళపాటు ఒకే కాలంలో పోతన, శ్రీనాథులిరువురూ జీవించి ఉండడం కూడా ఈ భావనకు కారణమేమో. పోతన, శ్రీనాథులిరువురూ సర్వజ్ఞసింగ భూపాలుని దర్శించినవారే అనడం కూడా మరొక కారణం.
కానీ శ్రీనాథుడు అవసాన దశలో పడిన కష్టాలు చూచిన లేదా విన్న పోతన్నకు రాజాశ్రయమంటే వెగటు పుట్టి ఉండవచ్చు. అందుచేతనే బమ్మెరపోతన ‘కర్ణాటకిరాట కీచకులకమ్మ’ అని త్రికరణశుద్ధిగా పలికి తన గ్రంథాన్ని నరాంకితం చేయక ఆచరించి చూపించాడు. మరోచోట వేటూరి ప్రభాకరశాస్ర్తీగారు చెప్పినట్టు ‘‘వీరిర్వురును నిశ్చయముగా ఇచ్చిపుచ్చుకొన్న సంబంధమున్న బావమరుదులయినను కాకున్నను, వరుసకయినను అయి ఉందురని నమ్మదగును’’. ఏది ఏమైతేనేం! ఇరువురు మహాకవులకు బాంధవ్యం కల్పించి ఆనందించిన ఆంధ్రజాతి అదృష్టమే అదృష్టం.

- డి.వి.ఎం. సత్యనారాయణ