సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివాదపరులలో ఒకడు అతని గాంచి యిట్లనెను. ‘‘అయ్యా! ఆ చెట్టుమీది ఊసరవిల్లి ఎఱ్ఱగానుండును కాదండీ?’’- అందులకామనుష్యుడు, ‘‘ఔనయ్యా! అనెను. అంత రెండవవాడు ఇట్లు ప్రతిఘటించెను. ‘‘ఏమి చెప్పెదరు? అదెట్లు పొసగును? అది ఎఱ్ఱనిది కాదు, నీలిది’’ అందులకా పెద్దమనుష్యుడు సవినయముగా ‘‘ఔనండీ’’ అనెను. అతనికి ఊసరవిల్లి రంగులు తరచు మారుచుండునని తెలియును. అందుచే నాతడిరువురి వాదములకును ‘ఔ’ననియెను. అట్లే సచ్చిదానందమయుడగు భగవంతుడు వివిధ రూపములతో నొప్పుచుండును. ఒక్కరూపమున మాత్రమే భగవంతుని దర్శించిన భక్తుడు ఆ రూపముదక్క మరియొక రూప మెరుగడు. కాని వివిధ రూపములందు దైవసాక్షాత్కారము నొందిన యుత్తమ భక్తుడు మాత్రమే ‘‘ఈ రూపములన్నియు ఒకే భగవంతునివి, భగవానుడనంత రూపుడుగదా!’’ యనగల్గును. సాకారుడాతడే, నిరాకారుడునాతడే. మరియు నెవ్వరెఱుంగని యాతని రూపము లనంతముగా గలవు.
472.శాఖోపశాఖలతో గూడిన పాచి ముఱుగు గుంటలలోనే కాని మంచినీరు గల పెద్ద చెరువులలో పెరుగదు. అటులనే స్వార్థపరత, కాపట్యము, స్వమత దురభిమానము మొదలగు దుర్గణములకు దాసులగువారల కూటములందే శాఖోపశాఖలు పెరుగుచుండును గాని, అకలంకులును, ఉదారభావములు కలవారును, స్వార్థరహితులు నగు సజ్జనులతో గూడిన మతములందు (శాఖోపశాఖలు) పెరుగజాలవు.
473. (మత ధర్మములందు) శాఖోపశాఖలను గల్పింపవచ్చునా? ప్రవాహమున శాఖోపశాఖలు (నాచుతీగలు) పెరుగజాలవు, ముఱుగుగుంటలందు మాత్రమే పెరుగును. ఎవ్వని మనస్సు సదా భగవానుని వైపునకు ప్రసరించుచుండునో అట్టి భక్తుడు ఇతర విషయములను గూర్చి చింతింపజాలడు. పేరు ప్రఖ్యాతుల నాశించువాడు మాత్రమే (మత ధర్మము లందు) శాఖోపశాఖలను సృష్టించుచుండును.
474. కొలకోలలతో, హద్దుగీతలతో నరులు తమ భూములను పంపకము చేసికొనవచ్చును. కాని పైనున్న ఆకాశము నెవ్వరును పంచుకొనజాలరు. అఖండమైన యా యాకాశము సర్వము నావరించుచున్నది. సర్వము (తనలో) ఇముడ్చుకొనుచున్నది. అజ్ఞుడు అవివేకముచే తన మతమొక్కటియే యథార్థమనియు, సర్వోత్కృష్టమైనదనియు వాదులాడుచుండును. కాని బ్రహ్మజ్ఞానముచే వానిహృదయము వికసించిన పిమ్మటనో, ఈ శాఖా సంప్రదాయ యుద్దములకు అతీతమై అఖండ సచ్చిదానంద బ్రహ్మము వెల్గొందుచున్నదని గ్రహించును.
మత భేదములయెడ నుండవలయు మనోభావము
475. ఏ నామరూపములచే భగవానునర్చించినను ఒకే భగవంతుడు కలడను నమ్మకముతో సాధన చేయువారెల్లరును భగవానుని ప్రాప్తించితీరుదురు.
476. ఏ విధముగా నీవు భగవానుని ధ్యానించినను, వాని నామములను కీర్తించినను, అభ్యుదయము నందగలవు. పంచదారతో జేసిన యప్పమును తినునప్పుడు దానిని నిబ్బరముగా బట్టుకొనినను, వంకరగా బట్టుకొనినను సమానముగనే మధురముగా నుండును.
477. ప్రశ్న: అన్ని మతములవారర్చించు దేవుడును ఒక్కడే యగునెడల వివిధ మతావలంబకులు దేవుని వివిధ రీతులుగా వర్ణించుటేల?
ఉ.్భగవంతుడొక్కడే, కాని వాని నామరూపములనేకములు, ఒకే గృహ యజమానుడు ఒకనికి తండ్రి, ఒకనికి తమ్ముడు, ఒకనికి అన్న, ఒకామెకు మామ, మఱియొకామెకు భర్తయుగావచ్చునుగదా? భక్తులు వారివారి భావనా విశేషములననుసరించి, అనుభవములననుసరించి, భగవంతుని వేర్వేఱు విధములుగా అభివర్ణించుచుందురు.

- ఇంకాఉంది
*
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి