సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జబ్బుపడిన తన బిడ్డలలో తల్లి యొకనికి అన్నము కూరయును, మఱియొకనికి సగ్గుజావను, వేఱొకనికి రొట్టెయు వెన్నయును బెట్టురీతిని భగవంతుడు వారి వారి స్వభావముల కనుకూలించునటుల జనులకు వేర్వేఱుమార్గముల ననుగ్రహించి యున్నాడు. (చూ.327.)
479. వేదాంతమునకు శంకరాచార్యులు చేసిన యర్థము సత్యమైనదే, రామానుజులు చెప్పునదియు- అనగా వారి విశిష్టాద్వైతమును- సత్యమే!
480. కారుణ్యమున క్రైస్తవునివలెను, బాహ్యాచారములందు పట్టుదల జూపుచో మహమ్మదీయునివలెను, సర్వభూత హితమొనర్చునెడ హిందువునిగను వర్తించుట పాడి. (చూ.482.)
481. ప్రజలలో మెలగునప్పుడు అందఱియందును నీకు ప్రేమానురాగము లుండవలయును; వారితో కలసిమెలసి వర్తింపుము, ఏకీభవింపుము, అంతియేకాని, ‘‘వీరు నిరాకార బ్రహ్మమును నమ్మక సాకారదైవమును నమ్ముదురు’’అనియో, ‘‘సాకారదైవమును నమ్మక నిరాకార బ్రహ్మమును నమ్ముదురు’’అనియో, ‘‘వీడు క్రైస్తవుడు, వీడు హిందువుడు, వీడు మహమ్మదీయుడు’’అనియో భేదములెంచుచు, పెడమొగముపెట్టి వారిని ద్వేషింపబోకుము. భగవానుడు తనె్నంతవఱకు గ్రహింపననుగ్రహించునో అంతవఱకే మానవుడు వానిని గ్రహింపగల్గుచున్నాడు.
అదిగాక, లోకులు భిన్నప్రవృత్తులు గలవారని గ్రహించి, సాధ్యమైనంతవఱకు వారితో నీవు కలసిమెలసి వర్తింపవలయును, అందఱిని ప్రేమింపవలయును. అప్పుడు నీ యింటికి (అంతరంగమునకు) మఱలి శాంతిని ఆనందముననుభవింపగలవు. అందు స్వస్వరూపము గోచరించును.
482. ప్రతివ్యక్తియు తన మత ధర్మములననుసరింపవలయును. క్రైస్తవుడు క్రైస్తవ మతమును మహమ్మదీయుడు మహమ్మదీయ మతమును అనుసరింపవలయును. హిందువుడు ఋషులు అవలంబించిన సనాతన ధర్మము నవలంబించుటయే సర్వోత్తమము. (చూ.480.)
483. నిజమైన జిజ్ఞాసువు ఇతర మతములనుగూర్చి బ్రహ్మజ్ఞానము నొందుటకు అని యనేక మార్గములని భావింపవలయును. మన మెల్లప్పుడు ఇతర మతములయెడ గౌరవభావము గలిగి యుండవలయును.
484. వాదులాడకుము. నీకు నీ మతమునందును అభిప్రాయములందును పట్టుదలయున్న పక్షమున పరులు తమ మతములందును అభిప్రాయములందును పట్టుదలగలిగి యుండుటకు సమాన స్వాతంత్య్రము గలవారని యంగీరింపుము. ఒకవేళ ఇతరులు పొరపడినను కేవలవాదముచే వారిని నీ వెన్నడును ఒప్పింపజాలవు. ఈశ్వరానుగ్రహము గలిగిననాడు ప్రతి మానవుడును తన పొరపాటును తానె తెలిసికొనగల్గును.
485. దివ్యభావ పరవశుడై శ్రీ గురుదేవుడొకనాడు జగన్మాతతో నిట్లు పలుకుచుండుట (ఒకరికి) వినవచ్చెను: ‘‘అమ్మా! ప్రతి మానవుడును తన గడియారమే సరియైనదని చెప్పుచుండును. క్రైస్తవులేమి, మహమ్మదీయులేమి, హిందువులేమి, ఎల్లరును ‘మా మతమే యథార్థమత’మనుచుందురు. కాని, తల్లీ! ఎవ్వరి గడియారమును సరియైన కాలము తెలుపదు. నీ తత్త్వము నెవ్వరు గ్రహింపగలరు? కాని పరితాపముతో నిన్ను వెదకువాడేమత మవలంబించినను, ఏ మార్గమనుసరించినను నీ కృపవలన నిన్ను జేరును.’’
రహస్య సంప్రదాయములయెడ నుండవలయు మనోభావము
486. విశేషమైన ఆత్మవికాసమును గాంచిన కొందఱు జనులు శాక్తేయుల యొక్కయు వైష్ణవుల యొక్కయు (సామాన్య నీతివిరుద్ధములుగ గాన్పించు) వామాచారములను గొన్నిటి నవలంబించుచుండిరి.

- ఇంకాఉంది
*
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి