సబ్ ఫీచర్

చింతనావృక్షానికి పతంజలి అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అటు రాచకొండ విశ్వనాథశాస్ర్తీ, ఇటు కె.ఎన్.వై.పతంజలి వారసునిగా కళింగాంధ్ర నేలలో మొలిచిన ‘చింతనా వృక్షం’ కథారచయిత. నవలాకారుడు, నాటకకర్త చింతకింది శ్రీనివాసరావు. ఈ విషయాన్ని అతని మూడు కథా సంపుటాలూ విస్పష్టం చేస్తాయి. ఆయన రచించిన ‘వికర్ణ’ నవల ఆధునికోత్తర తెలుగు సాహితీ రంగంలో సంచలనం రేపింది. ‘అదిగో ద్వారక’ పేరిట ద్వాపరయుగంనాటి ద్వంద్వ ప్రమాణాలను బయల్పరుస్తూ ఆయన చేసిన నవలా రచన వినూత్నం. గిరిజనుల వైపునుంచి మహాభారతాన్ని దర్శించాడు. 2019 సంవత్సరానికి గాను అగ్రశ్రేణి రచయిత, పాత్రికేయుడు, వ్యంగ్య భాష్యకారుడు శ్రీ కాకర్లపూడి నరసింహ యోగ పతంజలి పురస్కారం శ్రీనివాసరావుకు లభించింది. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును విజయనగరం కేంద్రంగా పనిచేస్తున్న కె.ఎన్.వై.పతంజలి సాంస్కృతిక వేదిక మార్చి 29న ఆయనకు అందజేస్తోంది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు నవలల్ని, కథల్ని పరామర్శిస్తే..
చింతకింది వెలువరించిన ‘దాలప్ప తీర్థం’ సంకలనమంతా అశ్వశైలితో నడుస్తుంది. ఒక మనిషి వ్యర్థాలను మరో మనిషి నెత్తిమీద మోసుకువెళ్లే హీన వ్యవస్థను గురించి ‘దాలప్పతీర్థం’ కథలో ఆయన వివరంగా చర్చించి చదువరులకు కంటతడి పెట్టిస్తాడు. ఈ సంపుటంలోని పధ్నాలుగు కథలూ ఆణిముత్యాలే. రచయితను మహాకథకునిగా నిలబెట్టిన కథలే. చింతకింది తొలి కథాసంకలనం దాలప్పతీర్థం తర్వాత వెలువడిన కాన్పుల దిబ్బ సంపుటం రచయిత మరింతగా సమాజంతో మమైకమైనట్టు తేటపరుస్తుంది. ఈ కథల్ని మూడుసార్లు చదివిన ప్రఖ్యాత కవి కె.శివారెడ్డి శ్రీనివాసరావు మాయచేశాడన్నారు. అది ఏం మాయ అంటే.. తనకు బాగా తెలిసిన, అనుభవించిన జీవితం, మనుషులు, వారి కష్టసుఖాలు, వారి నమ్మకాలు, ప్రేమలు, పోరాటాలు, తన బాల్య యవ్వన దశల్లో తనలో ఇంకిన భాష తదితరాలను శ్రీనివాసరావు సర్వశక్తులతో కవితాత్మకంగా తిరిగి అదే శోభతో, అదే తీవ్రతతో పలికించాడన్నారు. ఇలా అతగాడు చేయగలగడానికి కారణం గురజాడ నుండి పతంజలి దాకా అనేక మంది అఖండ కథకుల జీన్స్ చింతకిందిలో ఉన్నాయన్నారు. అతడి చుట్టూ కావలసినంత ముడిసరుకు వుంది. దాన్ని పనిముట్లుగా చేసుకుని కథలుగా మార్చే ఒక నిరంతర ప్రయత్నంలో ఉన్నాడన్నారు. అతడిలో ఒక సామాజిక శాస్తవ్రేత్త, కళాకారుడు ఉండడంవల్ల తన ఘూఆజఒఆజష ళనఔళూజళశషళ, ఘూఆజఒఆ ళనఔళఒఒజ్యశ గా పరివర్తన చేసే పనిలో ఉన్నాడన్నారు. భూగోళమంత బరువైన రావిశాస్ర్తీ, ఆకాశమంత విస్తృతిగల పతంజలి అడుగుజాడలలో నడుస్తూ, వారి అడుగుల పక్కనే కొత్త ముద్రలను వేసే ప్రయత్నాన్ని చింతకింది చేస్తున్నాడని విమర్శకులు అంటున్నది అందుకేనేమో. ‘మాండలికం ఒక ప్రత్యేక ప్రాంతంలో పూచే పువ్వు, కాసే పండు లాంటిది. ఆ ప్రత్యేక పరిమళం, మాధుర్యం దేనికదేసాటి. ఉత్తరాంధ్రలోని చోడవరం ప్రాంతంలో పుట్టి కళింగాంధ్ర యాసను ఔపోసన పట్టి, దాలప్ప తీర్థం కథలతో విమర్శకుల ప్రశంసల తీర్థం పుచ్చుకున్నాడు చింతకింది. ‘తానెరిగిన ప్రదేశం, జీవితం, మనుషులు, మనస్తత్వాలు, వారి సుఖ దుఃఖాలు, హాస్యం, వ్యంగ్యం, వెటకారం ఇవన్నీ శ్రీనివాసరావు కథలకొక ప్రత్యేక శైలి, ముద్రలను ప్రసాదించాయి. మెప్పుకోసం, ఉద్ధరింపుకోసం, నాయకత్వం కోసం, గుర్తింపు కోసం కాకుండా, రాయాలనుకున్నప్పుడు, ఆపుకోలేని కలం వేగాన్ని ఒడిసిపట్టుకుని కథాకార్యం నెరవేరుస్తాడు చింతకింది. కథనంలో ఒడుపు, విడుపు, విసురు, ఊపు, తూగు అన్ని సమపాళ్లలో రంగరించిన కుంచెతో కథా కాన్వాస్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేస్తాడు. ఈ కథన శైలిలో మునిగితేలిన పాఠకుడు, కథ ఒలికించిన నవరసాల్లో ఏదో ఒక దానితో అంటకాగక తప్పదు. ఆ రసం నవ్విస్తుంది. ఏడిపిస్తుంది. ఉసూరుమనిపిస్తుంది. The great indian magic rope trick లాగ భాషను, యాసను లొంగదీసుకుని తడిబట్టను పిండినట్టు భావాలను పిండి తీస్తాడు శ్రీనివాసరావు.
చింతకింది శ్రీనివాసరావు మూడో కథా సంపుటి ‘కప్ప స్తంభం’ విషయానికి వస్తే ఇందులో పది కథలున్నాయి. ఈ సంపుటికి సుప్రసిద్ధ రచయిత శ్రీరమణ ముందుమాట రాస్తూ చింతకిందికి లోకల్ ఫీలింగ్ ఎక్కువన్నారు. కళింగాంధ్ర రచయితలు చాలామందికి ఈ ఫీలింగ్ ఉంటుందనీ ఆయనే చెప్పారు. దీనినిబట్టి స్థానికతకు రచయిత ఇచ్చే ప్రాధాన్యత ఇట్టే బోధపడుతుంది. ఒకవైపు మాండలీకాన్ని అలవోకగా రాస్తూ ఉత్తరాంధ్ర వైభవాన్ని కథల్లో చూపుతున్న చింతకింది మరో కోణం పురాణాలను పునర్నిర్వచించడం. మహాభారతంలోని సభాపర్వంలోనూ, యుద్ధపర్వంలోనూ ప్రధానంగా కనిపించే చిన్నపాటి పాత్ర వికర్ణ. కానీ దాని పాత్రత తిరుగులేనిది. ద్రౌపదీ మానసంరక్షణ కోసం చిరుప్రాయంలోనే శక్తికిమించి పోరాడిన వికర్ణుడే నేటి భారతీయ యువతకు ఆదర్శమని చింతకింది తన ‘వికర్ణ’ నవలతో స్పష్టం చేశారు. ఉపేక్షితులైన గిరివాసుల వైపు నిలిచి ఆయన రచించిన ‘అదిగో ద్వారక’ నవల కూడా ఉన్నతమైనది.
కేంద్ర సాహిత్య అకాడమీ ‘భారతీయ సాహిత్య నిర్మాతలు’ శీర్షికన వెలువరించే జీవిత చరిత్రల పరంపరలో భాగంగా కె.ఎన్.వై.పతంజలిపై శ్రీనివాసరావు రాసిన మోనోగ్రాఫ్ అతని రచనాశక్తికి నిదర్శనం. మహారచయిత పతంజలికి లోకంపోకడ, లోకుల గుణాలు బహుబాగా తెలుసు. వారి లౌక్యం, దుర్మార్గం, మంచితనం అన్నీ తెలుసు. దురన్యాయాలకు విలాసంగా భూగోళం వర్థిల్లుతోందన్న బాధా ఆయనలో ఉండేది. అందుకే పతంజలి తప్పుడు వ్యవస్థలను తన కలంతో కడిగిపారేశారు. పతంజలి రచనకు ఒక తత్వముంటుంది. ఆ తత్వాన్నీ, పతంజలి జీవనసత్వాన్నీ కూడా మోనోగ్రాఫ్‌గా రచించి చింతకింది చదువరుల మన్ననలు పొందాడు.
చింతకింది శ్రీనివాసరావుది మేటి కళింగాంధ్ర రచయితల బాట. చాసో బిగువు, రావిశాస్ర్తీ యాస భాషలు, పతంజలి వ్యంగ్యం అతనికి పెన్నుతో పెట్టిన విద్య. అందుకే పతంజలి పేరిట ఏర్పాటయిన పురస్కారం అతనికి దక్కడం సముచితం. సరైన రచయిత పతంజలి. అతని అవార్డు చింతకిందికి రావడం సరైనది.
*
(మార్చి 29న పతంజలి పురస్కారాన్ని చింతకింది శ్రీనివాసరావుకు
ప్రదానం చేస్తున్న సందర్భంగా..)
*
చిత్రం.. కె.ఎన్.వై.పతంజలి
*

- మల్లేశ్వరరావు ఆకుల, 9440007374