సబ్ ఫీచర్

‘బాండ్ పేపర్లు’ ఏం చేసుకొంటాం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతంత్య్ర భారతావని మరో సార్వత్రిక సమరానికి సిద్ధమైంది. ఎన్నికలప్పుడు కుల, మత, ప్రాంతాల వారీగా ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఎలాగైనా ఓట్లు రాబట్టుకుని- అధికారంలోకి వచ్చాక హా మీలకు తూట్లు పొడిచి కాలం వెళ్లదీస్తున్న రాజకీయ నాయకులు సరికొత్త ప్రతిపాదనలతో ఓటర్ల ముందుకు వస్తున్నారు. రాజకీయ నాయకులు తాము ఇచ్చే హామీలకు కట్టుబడి ఉంటామని ‘బాండ్ పేపర్’ రాసి ఇస్తామని అంటున్నారు. అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీలను నెరవేర్చకపోతే ప్రజలు తమను కోర్టుకు లాగవచ్చుననే సరికొత్త నినాదంతో ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. అయితే ఈ సరికొత్త ప్రతిపాదనలను ఓటరు ఎలా అర్థం చేసుకుంటున్నాడు. అర్థం చేసుకుని ఎంతవరకు ముం దుకు వెళుతున్నాడు. ఇటువంటి ప్రతిపాదనలు చేస్తున్న నాయకులను గెలిపిస్తున్నాడనే అంశాన్ని విశే్లషిస్తే.. ‘బాండ్ పేపర్ మీద హామీలు’ అనే నినాదానికి శ్రీకారం చుట్టిన మొట్టమొదటి వ్యక్తి విశ్రాంత ఐఎఎస్ అధికారి ఈఎఎస్ శర్మ.
2014 ఎన్నికల్లో మొదటిసారిగా జనక్షేత్రంలోకి ఈ నినాదంతో వచ్చిన మొదటి వ్యక్తి సోనీ సూరి. ఈమె ఆమ్‌ఆద్మీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి తన హామీలకు బాండ్ పేపర్ మీద నియోజకవర్గ ప్రజలకు రాసి ఇచ్చారు. ఎన్నికల్లో ఆవిడ ఓడిపోయారు. ఆ తరువాత ఆమ్‌ఆద్మీ పార్టీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన అలోక్ అగర్వాల్ తన 30 హామీలను వంద రూపాయల బాండ్ పేపర్ రాసి ఇచ్చారు. ఎన్నికల్లో ఆయన డిపాజిట్ కోల్పోయారు. 2017లో ముంబయి స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ తన హామీలను బాండ్ పేపర్ మీద ఓటర్లకు రాసి ఇచ్చింది. ఈ ఎన్నికల ఫలితాల్లో శివసేన మొదటి స్థానంలోనూ, బీజేపీ రెండవ స్థానంలో నిలవటం గమనార్హం. ఛత్తీస్‌గఢ్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి, విశ్రాంతి ఐఎఎస్ అధికారి అజీత్ జోగి తన ఎన్నికల హామీలను బాండ్ పేపర్‌పై రాసి ఇచ్చారు. కేవలం ఐదు సీట్లు మాత్రమే దక్కించుకుని ఆయనకు చావు తప్పి కన్నులొట్ట పోయినంత పనైంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు అనేకచోట్ల ప్రజలకు తమ హామీల గురించి బాండ్ పేపర్లు రాసి ఇచ్చారు. మెదక్ జిల్లా కొనపేటలో ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ అభ్యర్థిని అక్కడి యువకులు- హామీల అమలుపై బాండ్ పేపర్ రాసి ఇవ్వమని అడిగారు. తాను గెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ హామీలను నెరవేరుస్తానని ఆయన బాండ్ పేపర్‌పై రాసి సంతకం పెట్టి ఇచ్చారు.
ఇటీవల జరిగిన ఉపాధ్యాయు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నియోజకవర్గ అభ్యర్థి మామిడి సుధాకర్‌రెడ్డి బాండ్ పేపర్‌పై హామీలను రాసి పంపిణీ చేసారు. అయినప్పటికీ ఆయన ఓడిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ లోక్‌సభ నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తన హామీలను బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వటానికి, జీరో బడ్జెట్ పాలిటిక్స్ తీసుకురావటానికి సిద్ధమంటూ హామీలు ఇస్తున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం వైకాపా అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస్ నిరాశ్రయులకు వసతి గృహాలను నిర్మించేలా కృషి చేస్తానని బాండ్ పేపర్‌పై సంతకం చేసి ఇచ్చారు. ఇలా చాలామంది అభ్యర్థులు బాండ్ పేపర్లు రాసి ఇస్తున్నారు.
ఎన్నికల వేళ నాయకులు ఇచ్చేవి మితిమీరిన హామీలుగా పరిగణించాలి. బాండ్ పేపర్లు రాసి ఇచ్చిన అభ్యర్థి గెలిచిన తరువాత తమను విస్మరిస్తే ఓటర్లు ఏం చేయాలి? చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో నాయకులు తెలపకపోవటం, స్వచ్ఛందంగా రాజీనామా చేస్తామన్న విషయాన్ని ప్రస్తావించక పోవటం ఓటర్లను గందరగోళానికి గురి చేస్తుంది.
చట్టపరంగా దీనిని విశే్లషిస్తే ‘రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్-1951’లో బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చే అంశం లేకపోవటం, సుప్రీం కోర్టు ఇలాంటి హామీలను చట్టపరంగా ప్రామాణికం (అమలు పరచదగనివిగా) లేనివిగా భావించి ఒక న్యాయవాది వేసిన ‘ప్రజా ప్రయోజన వ్యాజ్యం’లో కేసును కొట్టివేసింది. హామీలను బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వటం అనే అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చింది విశ్రాంత ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ ఉద్యోగులే కావటం విశేషం. దీనికి చట్టబద్ధత రావాలంటే ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి, నాయకులు ఇచ్చే హామీలకు చట్టబద్ధత కల్పించటంతో పాటు అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులను తక్షణమే పదవిలోంచి తొలగించే విధంగా ‘రైట్ టూ రీకాల్’ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది.

-సుంకర నరేష్ 8712 234 234