సబ్ ఫీచర్

‘ఫెడరల్ ఫ్రంట్’ ఎలా సాధ్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రంలో కాంగ్రెసేతర, భాజపాయేతర పక్షాన్ని అధికారంలోకి తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ‘ఫెడరల్ ఫ్రంట్’ ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయి? 17 ఎంపీ సీట్లు కలిగిన తెలంగాణ రాష్ట్రం జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం సాధ్యమవుతుందా? ఇంతకూ కేసీఆర్ వ్యూహమేమిటి? ప్రత్యామ్నాయం సాధించడంలో ఆయన సఫలీకృతులవుతారా? ఏం జరగబోతుందన్నది కొన్ని రోజుల్లో తేలిపోతుంది.
తన ప్రయత్నాలు విజయవంతం కావడానికి కేసీఆర్ వ్యూహాత్మకంగా కదులుతున్నారు. దేశ రాజకీయాలను, వివిధ రాష్ట్రాల్లో పరిస్థితులను, వివిధ పార్టీల స్థితిగతులను చక్కగా అంచనా వేయగలిగిన నాయకుడు కేసీఆర్. ఈమధ్య జరిగిన అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ఫలితాలపైనే జాతీయ మీడియా ఎక్కువ దృష్టి సారించింది. అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ కేసీఆర్ సాధించిన ఘన విజయం రాజకీయ విశే్లషకుల్ని మాత్రమే కాదు, తెరాస పార్టీ క్యాడర్‌ను కూడా సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఎనిమిదిసార్లు శాసనసభకు, అయిదుసార్లు లోక్‌సభకు ఎన్నికై రికార్డు సృష్టించారు. కేసీఆర్‌కు మాత్రమే ఈ విజయాలు ఎలా సాధ్యమవుతున్నాయంటే- పట్టుదల, విశ్వసనీయతతో ఆయన ఏదైనా సాధిస్తారనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది.
ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి, ఉప ప్రాంతీయ పార్టీగా తెలంగాణలో కొంత ప్రాంతానికే పరిమితమైందన్న విమర్శలు ఎదుర్కొన్న తెరాస పార్టీ నేడు ముందడుగు వేస్తూ జాతీయ పార్టీలను సైతం ఉక్కిరిబిక్కిరి చేయడం అద్భుతమే! 2001లో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ సంస్థను రాజకీయ పార్టీగా ప్రకటించిన నాటినుంచి నేటివరకు పార్టీలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని పరిణామాలు సంభవించినా, ఎన్ని రాజకీయ కుట్రలు జరిగినా అంచెలంచెలుగా ఎదుగుతూ అప్రతిహతంగా కొనసాగడం ఓ చరిత్రే! గతం పునాదులపై వర్తమానాన్ని బేరీజు వేసుకుంటూ, భవిష్యత్ గురించి ఆలోచించే వాడే ఏ రంగంలోనైనా విజయం సాధిస్తాడు. ఆకోవకు చెందిన కేసీఆర్ తెలంగాణ పట్ల నిబద్ధతతో తెరాసను ముందుకు నడిపిస్తున్నారు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని ప్రకటించి, డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసనసభ్యత్వానికి ఆనాడు చేసిన రాజీనామా ఆయనలో నిబద్ధతను చాటింది. ఎన్నికలు- రాజకీయాలు- ఉప ఎన్నికలు- ఎన్నికల మధ్య పొత్తులు ఎత్తులతో తెలంగాణ అంశాల్ని జాతీయ రాజకీయ స్రవంతిలో ప్రధానంగా ఉండే విధంగా స్థానికంగా పార్టీ ఎదిగేలా ప్రయత్నిస్తూ బలం పెంచుకుంటూ ముందుకెళ్ళారు. కేవలం ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్న పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చలనం తీసుకువచ్చి రాష్ట్రాన్ని సాధించడం, కొత్త రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తులేకుండా ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఒక సంచలనమే! సంక్షేమ పథకాల పేరిట సబ్బండ జాతులకు దగ్గరయ్యే ప్రయత్నంలో కేసీఆర్ సఫలీకృతులయ్యారు. ముందస్తు వ్యూహంతో పక్కా ప్రణాళికతో అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారం సాధించి సత్తా చాటారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో విజయం సాధించాలనుకొంటుంది, అందుకోసం ఎన్ని ఎత్తుగడలైనా వేస్తుంది. తన బలాన్ని ప్రదర్శించడమే కాకుండా ఎదుటివారి లోపాల్ని పసిగట్టి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది.
తెలంగాణ ఏర్పడిన తరువాత తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కెసిఆర్ ప్రజలకు చేరువయ్యే విధంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 2014 తరువాత జరిగిన ప్రతి ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చారు. పార్టీని విస్తరించాలనే ఆలోచనతో ఆయన చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన సాధించిన విజయాలు ఇతరులకు స్ఫూర్తిదాయకం.
ప్రతిపక్ష పార్టీలు కూటమి కట్టినా, క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉందని ఎంతో ప్రచారం చేసినా తెరాస పార్టీ సాధించిన ఓట్లలో సగం కూడా విపక్షాలు సాధించలేకపోయాయి. ‘పట్టుపట్టరాదు.. పడితే విడువరాదు..’ అన్న నైజం కెసిఆర్‌ది. తెలంగాణలో తిరుగులేని నేతగా ఎదిగిన ఆయన తనంతట తాను చెబితే ఏదైనా చేస్తారు. సాధించి చూపెడతారనే నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకొంది.
తన పార్టీకి సుస్థిరతను సాధించడం, ప్రధాన రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీని రాష్టస్థ్రాయిలోనే కాదు జాతీయ స్థాయిలో అధికారంలోకి రాకుండా నిలువరించడం ఆయన ప్రధాన వ్యూహంగా కనిపిస్తుంది. రాజకీయ నాయకుడు అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే గతం, వర్తమాన పరిస్థితులే కాదు భవిష్యత్ పరిణామాలను పసిగట్టి అందుకు అనుగుణంగా వ్యూహాల్ని రచించాలి. ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టే వరస విజయాలు కెసిఆర్ సొంతమవుతున్నాయి.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెరాస ఎన్ని సీట్లు సాధిస్తుందో ఇప్పుడే చెప్పలేం. కాని కేంద్రంలో అధికారం చేపట్టబోయే ప్రభుత్వంలో కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారన్న అంచనాలు పెరుగుతున్నాయి.

-స్నేహిత గుణ