సబ్ ఫీచర్

పాక్‌లో హిందువుల దుర్గతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్‌లోనూ హిందువులున్నారు. కాని వారు ఎలాంటి పరిస్థితులలో బతుకున్నారు? ముఖ్యంగా మొన్న బాలాకోట్ సంఘటన తరువాత, వారి పరిస్థితి ఎలా తయారయింది? పాక్‌లోని సింధు ప్రాంతంలోని దర్హికి వద్ద ఇద్దరు మైనరు బాలికలు అపహరణకు గురయ్యారు. వారిని ఇస్లాం మతంలోకి మార్చేసి, బలవంతంగా వివాహాలు జరిపించారు. 15 సంవత్సరాల రీనా మెఘావర్, 13 సంవత్సరాల రవీనాలు హోలీ ఆడుతుండగా అపహరింపబడ్డారు. తరువాత ఒక వీడియో ద్వారా వారికి ఒక ఇమామ్ ఎలా ‘నిఖా’ జరిపాడో చూపబడింది. ఆ తరువాత ఇంకో వీడియో ద్వారా ఆ బాలికలు తామెలా ముస్లింలయిందీ, తమను అపహరించినవారినే తాము ఎలా వివాహం చేసుకుందీ వివరంగా ఆ వీడియోలో చూపారు. ఈ సంఘటనపై మోదీ ప్రభుత్వంలోని విదేశాంగ శాఖామంత్రి సుష్మా స్వరాజ్- ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషనర్‌ను- దీనిమీద తనకో నివేదిక పంపమని కోరారు. ఈ విషయంపై పాకిస్తాన్ సమాచార శాఖామంత్రి ఫవాద్ ఖాదరీ- ‘మేడమ్.. ఇది పాకిస్తాన్ అంతరంగిక విషయం. ఇదెంత మాత్రం మోడీగారి ఇండియా కాదు సుమా, అక్కడయితే ముస్లింలెప్పుడూ అవమానింపబడుతుంటారు. ఇది ఇమ్రాన్‌ఖాన్ నయా పాకిస్తాన్. పాక్ పతాకంలోని తెలుపురంగు మాకందరికీ సమానంగా ఇష్టమైంది. మీరు కూడా ఇండియాలోని మైనారిటీల హక్కుల విషయానికొస్తే మావలె ప్రవర్తిస్తారనుకుంటాను..’ అని సమాధానం ఇచ్చాడు.
‘పాకిస్తానీ లా’ పేరిట 2015లో గోక్లానీ అనే హిందువు ‘బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా’ ఒక బిల్లు ప్రవేశపెట్టాడు. కాని అదింకా ఆమోదింపబడి చట్టం కాలేదు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పాలనలోని సింధు ప్రభుత్వం- ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టం అన్నా- అది ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందింది. అయితే, అనేకమంది సింధు మతాధికారులు దానికి వ్యతిరేకత చూపటంతో సింధు గవర్నర్ సాదుజ్‌మాన్ సిద్దిఖీ ఆ బిల్లును వీటో చేశాడు. అమెరికాలోని ‘ఉడ్రో విల్సన్ ఇంటర్ నేషనల్ సెంటర్ ఫర్ స్కాలర్స్, వాషింగ్‌టన్’కు చెందిన ఫర్‌హాజ్ ఇస్ఫహానీ ఇలా అంటోంది. ‘‘ప్రభుత్వం తరువాత మిలిటరీ, సివిలియనులు - అంతా ఉగ్రవాదులకు తలొగ్గారు. బలవంతపు మతమార్పిడుల నిరోధక చట్టాన్ని, ఏ మార్పులు లేకుండా ఆమోదింపబడాలి.’’
మరి కొన్ని సంఘటనలు...
* 2005, జనవరి 4: 18 సంవత్సరాల మార్వి, 16 సంవత్సరాల హోమీ, ఉమర్‌కోట్ జిల్లాలోని తమ గ్రామం కూన్నీ నుంచి అపహరింపబడ్డారు.
* డిసెంబరు 22, 2005: 13 ఏళ్ల మషూ అనే బాలిక ఝతారి గ్రామం నుంచి అపహరింపబడింది.
* మార్చి 3, 2005: 14 సంవత్సరాల రాజీ మీర్‌పూర్‌ఖాస్‌లోని అస్లాం పట్టణంలో అపహరింపబడింది.
* జులై 23, 2006: 15 సంవత్సరాల పూజ కరాచీ నగరంలోని ల్యారీ నుంచి అపహరింపబడింది. కేసు కోర్టుకెళితే, జడ్జిగారు ఆమెను విడుదల చేయాలని ఆర్డరు జారీచేశారు. విడుదలైన తరువాత తిరిగి అపహరింపబడింది. ఇంతవరకు ఆమె జాడ తెలియదు.
* ఆగస్టు 2, 2006: 16 సంవత్సరాల కోమల్ కరాచీలోని హాక్స్‌బే నుంచి అపహరింపబడింది.
* డిసెంబరు 31, 2006: థార్‌పర్‌కార్ జిల్లా నుంచి 17 సంవత్సరాల దీప అపహరింపబడింది.
* సెప్టెంబర్ 23, 2014: లిర్భానా నుంచి ఇంజనీరింగ్ విద్యార్థిని జ్యోతికుమారి అపహరింపబడింది.
* ఏప్రిల్ 29, 2017: 17 ఏళ్ల సిక్కు బాలిక ప్రియాకౌర్ బునర్ జిల్లా నుంచి అపహరింపబడింది.
* జూన్, 2017: సింధులో 17 సంవత్సరాల రవితా మేఘావర్ అపహరింపబడింది.
* జనవరి, 2019: 16 సంవత్సరాల అనూషా కుమారి అపహరింపబడింది. ‘ఇండియన్ హైకమిషన్’ స్వయంగా జోక్యం చేసుకున్నా ఫలితం లేదు.
పాక్ న్యాయవ్యవస్థ తీరు..
2012 ఫిబ్రవరి 24న రాకిల్‌కుమారి అపహరింపబడింది. ఆమె తండ్రికి- మియాన్ అస్లాం అనే వ్యక్తి నుంచి ఒక వార్త వచ్చింది. రాకిల్ ఇస్లాం మతం స్వీకరించిందనీ, నవీద్ షా అనే యువకుడిని వివాహం చేసుకున్నదని సమాచారం అందింది. స్థానిక హిందువులు ఈ వార్త విని, నేషనల్ హైవే మీద ప్రదర్శనలు జరిపి రాకపోకలు నిరోధించారు. పోలీసులు కాల్పులు కూడా జరిపారట. రాకిల్‌ను పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. తన తల్లితో వెళ్లనివ్వాలంటూ ఆమె కోర్టులో కోరింది. కాని న్యాయస్థానం- రాకిల్ ముస్లిం అనీ, నవీద్‌షాను వివాహం చేసుకుందని తీర్మానించింది. మార్చి 8న పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఈ కేసును రీ ఓపెన్ చేసింది. మళ్లీ రాకిల్ తనను తల్లితో వెళ్లనియ్యమని వేడుకుంది. కాని సుప్రీం కోర్టు రాకిల్‌ను షెల్టర్ హోంలో ఉంచవలసిందిగా ఆదేశం జారీ చేసింది. నవీన్‌షా, మియాన్ అస్లాం రాకిల్‌ను అనేకసార్లు కలిశారన్న ప్రచారం జరిగింది. ఆ తరువాత కొన్నాళ్లకు సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ ఆఫీసు ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం రాకిల్ తన భర్తతో వెళ్లటానికి అంగీకరించిందట! దీనిని ఏమందాం..? భారతదేశంలో ఇటువంటి న్యాయవ్యవస్థను ఎవరైనా చూశారా? కోర్టులో హాజరైన వ్యక్తి ఏం చెప్పిందో- ఆ తరువాత ఆ కోర్టు రిజిస్ట్రారు వెల్లడిస్తాడా? కోర్టులో ఆ ముద్దాయికో, సాక్షికో సంబంధించిన వ్యక్తి ఎవ్వరూ ఉండరా? ఆ దేశానికి తగిందే- ఆ న్యాయవ్యవస్థ అనుకోవాలి తప్ప.. మనమేం చేయగలుగుదుం?
చట్టాలు, న్యాయవ్యవస్థ...
పాకిస్తాన్‌లోని హిందువులలో 94 శాతం సింధు రాష్ట్రంలోనే ఉన్నారు. ప్రతి మాసం 25 కంటే ఎక్కువగా బలవంతపు అపహరణలు, బలవంతపు మతాంతీకరణలు, బలవంతపు వివాహాలు వెలుగులోకి వస్తున్నాయి. 2015లో గోక్లానీ అనే హిందువు ‘బలవంతపు మతాంతీకరణల’కు వ్యతిరేకంగా ఒక బిల్లు ప్రవేశపెట్టాడు. కాని అది ఇంతవరకు పాస్ కాలేదు. కాని సింధు గవర్నర్- సరుూడుజ్‌మాన్ సిద్దిఖీ ఆ బిల్లును వీటో చేశాడు! కారణం ఇస్లామిక్ వాదుల ఒత్తిడికి ఆయన తట్టుకోలేకపోవడమే! అంతేకాదు.. బలవంతపు మతాంతీకరణలు అనేవి అసలు బహిర్గతం కావటమే చాలా అరుదు! కరాచీ జర్నలిస్టు, మానవ హక్కుల పోరాట యోధురాలు వీన్‌గాసీ చెబుతున్న వివరాల ప్రకారం 2012-2015 మధ్య 67 మంది హిందూ బాలికలు అపహరింపబడ్డారు. ‘ఎస్‌ఎపి- పాకిస్తాన్’ (సౌత్ ఆసియా పార్టనర్ షిప్- పాకిస్తాన్ సొసైటీ) సమాచారం ప్రకారం 2015లో మైనారిటీ మతం నుంచి 1000 మంది బాలికలు బలవంతంగా మత మార్పిడికి లోనయ్యారు.
క్రైస్తవుల దుస్థితీ అదే..
సుమారు 30,000 మంది థాయ్‌లాండ్, శ్రీలంక, మలేషియా దేశాలకు వెళ్లేందుకు తగిన అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఏజన్సీ రిపోర్టుల ప్రకారం ప్రతి సంవత్సరం కనీసం 1000 మంది క్రైస్తవ స్ర్తిలు బలవంతంగా మత మార్పిడిలకులోనై ముస్లింలతో వివాహం చేయబడుతున్నారు!
ఇదంతా ఎక్కడిది?
గత మార్చి 31న ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో పాక్‌లోని హిందూ వధువుల గురించి దయనీయమైన కథనం వచ్చింది. వారంతా బలవంతంగా మత మార్పిడులకు గురై, బలవంతంగా వివాహబంధంలోకి అడుగు పెట్టినవారే. లాహోర్‌కు చెందిన వ్యాస రచయిత నైలా ఇనాయత్ తన వార్తాకథనంలో అనేక మంది హిందూ బాలికల ఫొటోలతో సహా వారి దుర్భర పరిస్థితిని వివరించారు. పాకిస్తాన్‌లోని క్రైస్తవుల పూర్వీకులంతా బ్రిటిష్ పాలనలో మత మార్పిడికి లోనైన- తక్కువ కులపు హిందువులు. చివరకు వారంతా పాకిస్తానీ మహమ్మదీయులుగా తేలుతున్నారు.

-చాణక్య