సబ్ ఫీచర్

భయం ఉంటే..ఆమోదం రాదు ( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓషో నవజీవన మార్గదర్శకాలు
*
అందుకు మీరు కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఇచ్చే పట్టాల చీటీలను తగిలించుకున్న తెలివైనవారు కానక్కరలేదు. ఆ చీటీల కళలన్నీ కేవలం ప్రతి దానినీ వర్గీకరించేందుకు మాత్రమే.
అందరినీ కలవండి, అందరిలో కలవండి. ఎందుకంటే, అందరూ ఏదో ఒక రకమైన దివ్యత్వాన్ని ప్రతిబింబించేవారే. దేనికీ భయపడకుండా, అందరి నుంచి అన్ని విషయాలు తెలుసుకోండి.
ఈ అస్తిత్వం మీకు శత్రువు కాదు. అది తల్లిలా మీకు అన్ని రకాలుగా సహకరించేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. దానిని నమ్మండి. అప్పుడు మీలో ఏదో కొత్త శక్తి ఉప్పొంగి ప్రవహిస్తున్నట్లు మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అదే ప్రేమ శక్తి. అది లభించిన వారందరూ ఆశీర్వదించబడినవారే. ఎందుకంటే, ప్రేమ శక్తి ఎప్పుడూ అస్తిత్వాన్నంతటినీ ఆశీర్వదించాలని నిరంతరం కోరుకుంటూనే ఉంటుంది. అదే అసలైన ప్రేమ. అంతకన్నా మీకు కావలసినదేముంటుంది?
ఇప్పుడు, ఇక్కడ, ఈ క్షణంలో జీవించడం:
ప్రేమ చాలా అరుదైనది. ఒక వ్యక్తిని అతని అంతర్గత కేంద్రంలో కలవాలంటే మీరు విప్లవాత్మక మార్గంలో వెళ్ళక తప్పదు. అలా చెయ్యాలంటే ముందు మీరు విశాల దృక్పథంతో అతి సున్నితంగా తయారై, మీ కేంద్రంలోకి ప్రవేశించేందుకు ఇతరులను మీరు అనుమతించాలి. కానీ, అది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే, ఒకసారి మీ రహస్యాలన్నీ తెలుసుకున్న తరువాత వారేం చేస్తారో మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు. అందువల్ల మీరు ఎలాంటి దాపరికాలు లేకుండా ఉండేందుకు భయపడతారు.
కేవలం కాస్త ఉఫరితల పరిచయాలతోనే మీరు ప్రేమిస్తున్నారనుకుంటారు.కానీ, మీరు ఉపరితలం మాత్రమే కాదు. నిజానికి, ఉపరితలం మీ సరిహద్దు చుట్టూ ఉన్న కంచె మాత్రమే కానీ, అదే మీరు కాదు. కాబట్టి, ఉపరితలం కేవలం మీ సరిహద్దు మాత్రమే. అక్కడి నుండే మీ ప్రపంచం ప్రారంభమవుతుంది.
అనేక సంవత్సరాలు భార్యాభర్తలుగా కలిసి జీవించినవారు కూడా ఒకరిని ఒకరు తెలుసుకోలేకపోవచ్చు. అలాంటి వారి మధ్య ఉండేది కేవలం ఉపరితల బంధాలు మాత్రమే. మీరు ఎవరితోనైనా ఎక్కువగా కలిసి జీవిస్తే వారిని పూర్తిగా మర్చిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వారి కేంద్రాలు వారికి తెలియకుండా అలాగే మిగిలిపోతాయి. పరిచయాన్ని ఎప్పుడూ ప్రేమగా పరిగణించకూడదు. ఇది మీరు ముందుగా తెలుసుకోవలసిన విషయం. మీరు ప్రేమించుకుంటూ ఉండవచ్చు. అలాగే మీరు లైంగికానుబంధంలో కూడా ఉండవచ్చు. కానీ, లైంగికానుబంధం కూడా కేవలం ఉపరితల బంధమే అవుతుంది. ఎందుకంటే, అంతర్గత కేంద్రాలు కలవనంతవరకు లైంగికానుబంధం కేవలం భౌతికపరమైన రెండు శరీరాల కలయిక మాత్రమే అవుతుంది. అదికూడా కేవలం ఉపరితల పరిచయం మాత్రమే. మీరు భయపడనప్పుడు, మీలో భయంలేనప్పుడు మాత్రమే ఇతరులు మీ కేంద్రంలోకి ప్రవేశించేందుకు మీరు అంగీకరించగలరు.
జీవించడం రెండు రకాలు. ఒకటి, ఎప్పుడూ భయపడుతూ భయంలోనే జీవించడం, మరొకటి ఎప్పుడూ ప్రేమిస్తూ ప్రేమలోనే జీవించడం. ఎప్పుడూ భయపడుతూ భయంలోనే జీవించేవారు ఇతరులను కొంతవరకే తమదగ్గరకు రానిస్తారు తప్ప, ఎవరితోనూ గాఢమైన అనుబంధాలను ఎప్పటికీ ఏర్పరచుకోలేరు. ఎందుకంటే, ఎప్పుడూ భయంలోనే ఉండడంవల్ల వారిలో అనేక అనుమానాల అడ్డుగోడలు పెరిగిపోతాయి. అందువల్ల వారు ఎవరినీ తమ కేంద్రంలోకి ఎప్పుడూ వెళ్ళనివ్వరు.
- ఇంకాఉంది
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.