సబ్ ఫీచర్

టీకాలపై అపోహలు-వాస్తవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీకాలపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అపోహలు చాలానే ఉన్నాయి. అందుకే వాటి గురించి అపోహలు తొలగించడానికి అసలైన వాస్తవాలు..
* తమదేశంలో మళ్లీ తట్టు వ్యాధి వ్యాపించిందని ఈ సంవత్సరం ఫిబ్రవరి 7న ఫిలిప్పీన్స్ ప్రకటించింది. 2018తో పోల్చితే 74 శాతం కేసులు పెరిగాయని అక్కడి ఆరోగ్య అధికారులు తెలిపారు. అత్యంత తీవ్రమైన ఈ అంటువ్యాధి ప్రబలి 2017లో ప్రపంచవ్యాప్తంగా లక్షమందికి పైగా మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ వ్యాధిని తగ్గించే టీకాపై ఫేక్‌న్యూస్ వ్యాపించడంతో పాటు ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలడం కారణంగా తట్టువ్యాధి ప్రపంచవ్యాప్తంగా 30 శాతం పెరిగిందని గత నవంబర్‌లో విడుదల చేసిన నివేదికలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అమెరికా, యూరప్ ప్రాంతాల్లో ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలిందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.
టీకాల వల్ల ప్రయోజనాలున్నాయని శాస్ర్తియంగా ఆధారులున్నాయి. అయితే వాటిని నమ్మకుండా చాలామంది అపోహలతో పిల్లలకు టీకాలు వేయించడానికి నిరాకరిస్తున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి ప్రబలుతోంది అని ఆరోగ్యశాఖ వెల్లడించింది. టీకాలు వేయించడానికి నిరాకరిస్తున్న వారి అపోహలు పోవాలంటే వాటి వెనుక ఉన్న నిజాలేంటో తెలియాలి.
టీకాల వెనుక..
* బ్రిటన్‌కు చెందిన సర్జన్ అండ్రైవ్ వేక్‌ఫీల్డ్ తెచ్చిన ఉద్యమం మూలంగా గత దశాబ్దంలో టీకాల కార్యక్రమం కొన్ని దేశాల్లో తగ్గుముఖం పెట్టింది.
* 1997లో ప్రతిష్టాత్మక మెడికల్ జర్నల్ ది లాస్‌సెట్‌లో వేక్‌ఫీల్డ్ రాసిన వ్యాసం వైద్యరంగంలో కలకలం రేపింది. తట్టు, గవద బిల్లలు, పొంగు వ్యాధుల నివారణకు వేసే టీకాలకు, ఆటిజంకు సంబంధం ఉందని ఆయన తన వ్యాసంలో పేర్కొన్నారు. అయితే ఎం.ఎం.ఆర్.కు, ఆటిజంకు సంబంధం లేదని అనేక అధ్యయనాలు నిరూపించాయి. ది లాన్‌సెట్ జర్నల్ కూడా వేక్‌ఫీల్డ్ వ్యాసాన్ని ఉపసంహరించుకుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అతని ఆరోపణల కారణంగా యూకేలో ఎం.ఎం.ఆర్ టీకాల రేటు 1996లో 92 శాతం ఉంటే 2002 నాటికి 84 శాతానికే పడిపోయింది. తర్వాత అది మళ్లీ 91 శాతానికి పెరిగింది. కానీ ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన 95 శాతానికంటే తక్కువే.
* పిల్లల వ్యాధి నిరోధకవ్యవస్థ అనేక టీకాలను ఎదుర్కోలేదు. రెండేళ్ల చిన్నారులకు కచ్చితంగా వేయాల్సిన టీకాలు పదకొండు వరకు ఉన్నాయి. దీంతో కొంతమంది తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఇన్ని టీకాలు వేయిస్తే వారి వ్యాధినిరోధక శక్తి దీన్ని అదుపు చేయలేదని ఆందోళన చెందుతున్నారు. టీకాల వల్ల చిన్నారుల శరీరంలోకి ప్రవేశించే వైరస్, బాక్టీరియాల వల్ల వ్యాధులు వస్తాయని వారు ఆందోళన చెందుతున్నారు. అయితే శాస్తవ్రేత్తలు మాత్రం దీనిపై మరో వాదన వినిపిస్తున్నారు. ఏదైనా వ్యాధి ప్రబలినప్పుడే టీకాల ద్వారా ఇచ్చిన వైరస్‌లు వాటిపై ప్రతిదాడి చేస్తాయని, చిన్నారులను జబ్బులకు దూరంగా ఉంచుతాయని అంటున్నారు. పలురకాల టీకాలకు, నవజాత శిశువుల్లో వ్యాధి నిరోధక వ్యవస్థకు ఉన్న సంబంధంపై అమెరికాకు చెందిన డాక్టర్ పౌల్ ఆధారాలతో సహా ఒక వ్యాసం ప్రచురించారు. ఇందులో పుట్టిన కొద్దిగంటల్లోనే నవజాత శిశువులకు టీకాలను తట్టుకునే వ్యాధి నిరోధక సామర్థ్యం వస్తుంది అని తెలిపారు.
* సామాజిక, ఆర్థిక పరిస్థితులు బాగుంటే, పౌష్టికాహారం అందించగలిగితే.., అలాగే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే పిల్లలకు టీకాలు వేయించాల్సిన అవసరం ఉండదని కొందరి భావన. ఇది కొంతమేర నిజమే కావచ్చు. జీవించే పరిస్థితులు మెరుగ్గా ఉన్నచోట మరణాల రేటు తక్కువగానే ఉంటుంది. దీనివల్ల కొన్ని వ్యాధులు అంతరించిపోవచ్చు. కానీ ఇతర చోట్ల నుంచి ఈ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది.
* టీకాలు వేయించుకున్నవారే ఎక్కువ జబ్బుపడుతున్నారని టీకా మందుల వ్యతిరేక ఉద్యమకారులు వాదిస్తున్నారు. ఏ టీకా కూడా వంద శాతం ప్రభావం చూపదని వారు అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వ్యాధి నిరోధక టీకాల వల్ల 85 శాతం నుంచి 95 శాతం వరకే ప్రభావం ఉంటుందని చెబుతోంది. కానీ టీకాలు వేయించుకున్నవారే ఎక్కువ జబ్బు పడుతున్నారడానికి ఎటువంటి శాస్ర్తియ ఆధారాలు లేవు.
* డబ్ల్యూహెచ్‌ఓ ఆరోగ్య ఆర్థిక వేత్త మిలౌడ్ ప్రకారం 2013లో ప్రపంచవ్యాప్తంగా టీకా మందుల మార్కెట్ విలువ రూ. 17 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇటీవల ఈ మార్కెట్ మరింత పెరిగింది. చైనా వంటి దేవాల్లో కూడా రోగనిరోధక కార్యక్రమాలు వేగంగా పెరగడం, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ఇలాంటి కార్యక్రమాలు భారీస్థాయిలో చేపట్టడం ఇందుకు కారణంగా చెప్పొచ్చు. అయితే జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ 2016లో చేసిన అధ్యయనం ప్రకారం టీకా కార్యక్రమాలపై 94 దేశాల్లో ఒక్క డాలరు ఖర్చుపెడితే ఆరోగ్యంపై భవిష్యత్తులో పెట్టే 16 డాలర్ల ఖర్చును తగ్గించినట్లు అవుతుందని పేర్కొంది.
* కొన్నిదేశాల్లో కొన్ని రకాల వ్యాధులు పూర్తిగా అంతరించాయి కానీ ప్రపంచవ్యాప్తంగా అవి ప్రబలంగానే ఉన్నాయి. ప్రపంచీకరణ మూలంగా దేశంలో ప్రబలిన వ్యాధులు మరో దేశంలోకి చాలా తేలిగ్గా వ్యాపించే అవకాశం ఉంది.
* పిల్లలకు ఇచ్చే టీకాల్లో ఫార్మాల్డిహైడ్, పాదరసం, అల్యూమినియం అవశేషాలుంటాయని కొందరు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ మూలకాలు, రసాయనాలు ఒక స్థాయికి మించి తీసుకుంటే ప్రాణానికే ప్రమాదం. అయితే తల్లిదండ్రుల ఆందోళన చెందే స్థాయిలో ఇలాంటి మూలకాలు టీకాలలో ఉండవని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. 0.5 మిల్లీలీటర్ల మోతాదులో కేవలం 25 మైక్రోగ్రాముల పాదరసం మాత్రమే ఇందులో ఉంటుందని పేర్కొంది. 85 గ్రాములుండే టూనా చేపలోనూ ఇదే పరిమాణంలో పాదరసం ఉంటుందని తెలిపింది.
* పోలియో టీకాల వల్ల బాలికల్లో గర్భస్రావానికి బీజాలు వేసినట్లు అవుతుందని, హెచ్‌ఐవీ వ్యాపిస్తుందని ఉత్తర నైజీరియాలో నమ్మకాలు ప్రబలడంతో అక్కడ పల్స్ పోలియో కార్యక్రమం బెడిసికొట్టింది. ఆరోగ్య కార్యకర్తలపై స్థానిక ప్రజలు దాడులకు దిగారు. అఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అపోహల కారణంగా ఈ దేశాల్లో పోలియో మహమ్మారి ఇంకా ప్రబలుతోంది. అయితే కొన్ని దేశాల్లో వ్యాధినిరోధక టీకా కార్యక్రమాల వెనక వేరే ఉద్దేశాలు ఉండటం కనిపిస్తోంది.