సబ్ ఫీచర్

తృష్ణను జయంచేందుకు - అష్టాంగ మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌతముడు తన 37వ ఏట 49 రోజులపాటు తనదైన శైలిలో ‘సాధన’ చేసి ఈ లోకంలోని అజ్ఞానానికి, దుఃఖానికి, బాధకు పరిష్కార మార్గం కనుగొన్నాడని అంటారు. ఎంతో కాలం చేసిన అనే్వషణ ఫలించిందని పేర్కొంటారు. దాంతో అతను బుద్ధుడయ్యాడని చెబుతారు. ఈ లోకంలోని దుఃఖానికి-బాధకు కారణం సంసారం, రాగద్వేషం, తృష్ణ (కోర్కె) అని సిద్ధార్థుడు గుర్తించాడని ఆయన అనుయాయులు- అభిమానులు ఇప్పటికీ చెబుతూ ఉంటారు. అందుకే సిద్దార్థుడు బుద్ధ భగవానుడయ్యాడని భావిస్తారు.
ఈ దుఃఖాన్ని, తృష్ణను జయించేందుకు అష్టాంగ మార్గాన్ని ప్రబోధించారని అందులో సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వచనం, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం, సమ్యక్ వ్యాయామం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సంథి.. ఉన్నాయని చెబుతారు. వీటిని ఆచరణలో పెడితే జీవనం సుఖసంతోషాలతో కొనసాగుతుందని, సమాజం శోభాయమానంగా వెలుగొందుతుందని ఈ 21వ శతాబ్దంలోనూ చెబుతారు. ఆ చిలుక పలుకులే వినిపిస్తారు.
సంసారాన్ని, తృష్ణ (కోర్కె)ను త్యజించమని బౌద్ధం చెప్పే ప్రధాన సారాంశం. రెండున్నర వేల సంవత్సరాలుగా ఈ ‘నినాదం’తో బుద్ధుని అనుయాయులు- అభిమానులు ముందుకు కదులుతున్నారు.
రాగద్వేషాలు, అహాన్ని త్యజిస్తే మనిషికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం లభిస్తాయని కూడా అంటారు. బుద్ధుని ‘్ధ్యస’లో పూర్తిగా మునిగిపోయిన వారికి ఈ విషయాలు ఇప్పటికీ ప్రాసంగికమనిపిస్తాయి. అది వారి మానసిక స్థితి. అందులో తప్పుపట్టడానికి ఏమీలేదు. కానీ ‘వాస్తవికత’ (ఆబ్జెక్టివిటి) అనే మాట ఒకటుందని విస్మరించరాదుకదా? దాన్ని విస్మరిస్తే అంతా కంగాళీ అవుతుంది. గందరగోళం ఏర్పడుతుంది. ఈ సంగతి గమనంలోకి తీసుకోవలసిన అవసరం అందరికీ ఉంటుంది.
సంసారాన్ని, కోర్కెలను త్యజించమని బౌద్ధం బోధిస్తే, దాన్ని ఆచరించమని ఈనాటి బౌద్ధ భిక్షువులు చెబితే అందులో ఏమైన ‘అభ్యుదయం’ గానీ, అద్భుతం గానీ ఉందా? ఈ భౌతిక ప్రపంచంలో అది సానుకూలమైనదా?
మానవ సమూహాలు పెరగడానికి తోడ్పడినవే సంసారం, కోర్కెలు, ఆనాడు బౌద్ధబోధనలు మనసా-వాచా ఆచరిస్తే ఇప్పటి బౌద్ధ అనుయాయులు... అభిమానులు ఎక్కడ ఉండేవారు? బౌద్ధ వ్యాప్తి కోరిక లేకపోతే, ఎంతో శ్రమ పడకపోతే బౌద్ధం వ్యాప్తి జరిగేదా? పాటలీపుత్ర నుంచి బౌద్ధం ప్రపంచం వైపు కదిలేందుకు ఉపకరించినవి పై ‘‘రెండు అంశాలే’’ అన్న నగ్నసత్యం గ్రహించకపోతే ఎలా? ఓ వైపు సంసారాన్ని (సంసారాన్ని ఏ అర్థంతో చెప్పుకున్నా) త్యజించమని చెబుతూ, కోర్కెలకు దూరంగా ఉండమని బోధిస్తూ పిల్లల్ని పుట్టించి, ప్రపంచవ్యాప్తంగా బౌద్ధాన్ని ప్రచారం చేసేందుకు పంపడంలో ద్వంద్వం కనిపించడం లేదా? ద్వైదీభావం అగుపించడం లేదా?
గొప్ప ‘అభ్యుదయ భావాలు’ గల బౌద్ధం బోధించేది ఇదా?... ఇందులో అభ్యుదయం... అద్భుతం ఏమున్నది? అని ఆనాడు ప్రశ్నించుకోకపోయినా ఈనాడు తప్పక ప్రశ్నించుకోవాలి!
మానవ జీవితం కొనసాగడానికి, మరింత వికసించడానికి, ప్రజలు మరింత సుఖసంతోషాలతో విలసిల్లడానికి అవసరమైన ప్రాథమిక అంశాలు (సంసారం-కోర్కె-తృష్ణ) కూడదని, నిషిద్ధమని, దుఃఖకారణమని బెదరగొడితే, బెంబేలు ఎత్తిస్తే మానవుని భవిష్యత్ మంగళ ప్రదమవుతుందా? ఈ సూక్ష్మవిషయాన్ని ఎవరూ పరిగణనలోకి తీసుకోకపోవడం విడ్డూరం... విచిత్రం. ఇంత ‘అంధత్వం’తో బౌద్ధాన్ని భాగ్వంతమైనదని, ‘్ధమ్మసారం’ సుసంపన్నమైనదని ప్రపంచాన్ని నమ్మించబూనుకోవడం ఎంతటి అమాయకత్వం? తార్కికతను, హేతువును, ఆలోచనలను, చైతన్యాన్ని, మనిషిలోని అంతర్గత జ్వాలను సమాధిచేసి దానిపై బౌద్ధప్రతిమను ప్రతిష్టించడం ఎంతటి ‘అజ్ఞానం’’?
మనిషంటే ఏమిటి? అతని లక్షణాలేమిటి? వేలాది సంవత్సరాల అతని వ్యవహారాలేమిటి? అతని డి.ఎన్.ఏ. ఏమిటి? ఎంత విస్తృతికి అతను ప్రాతినిధ్యం వహిస్తున్నాడు? అతని ఆవిష్కరణలకు ఊతం ఏమిటి? అతనిలో జరిగే సంఘర్షణ (సిద్ధార్థునిలో జరిగినటువంటి సంఘర్షణే కావచ్చు) కోసం అనే్వషణ సంగతేమిటి? మరో రంగంలో జరిపే అనే్వషణకు మార్గం (సిద్దార్థునికి లభించిన మార్గం మాదిరిగా... మరో మార్గం) లభిస్తే అప్పటి పరిస్థితి ఏమిటి?
అలాంటి అనే్వషణ, పరిశోధన మార్గాలనన్నిటిని బౌద్ధం మూసేయాలని ప్రబోధిస్తున్నదా? గౌతమబుద్ధుడి అనే్వషణనే అంతిమం... ఆ తరువాత ఇంకేమి మిగలలేదు... పరిశోధనలకు, పరిశీలనలకు ఆస్కారమే లేదని బౌద్ధం చెబుతున్నదా? ప్రతిపాదిస్తున్నదా?
ఈ 21వ శతాబ్దంలో... వర్తమానంలో ఇదే ‘సూత్రం’ సమాజాలు పాటించాలా? సంసారాన్ని, కోర్కెలను త్యజించి సన్యాసులు ధరించే కాషాయ వస్త్రాలు వేసుకుని, భిక్షాపాత్ర పట్టుకుని తిరగాలా? బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం (్ధమ్మం) శరణం గచ్ఛామి (బౌద్ధ) సంఘం శరణం గచ్ఛామి అంటూ ఊరేగాలా?
ఇలా చేస్తే సుఖసంతోషాలతో జీవనం కొనసాగుతుందా? స్వేచ్ఛ- స్వాతంత్య్రాలను మనుషులు పొందుతారా? మానవుని ‘‘జ్ఞానం’’ ఉన్నత స్థాయికి చేరుకుంటుందా? వచ్చే తరాలకు (కోర్కె సంసారం త్యజిస్తే వచ్చే తరాలు ఎక్కడుంటాయి!) గొప్ప వారసత్వాన్ని అందించిన వారమవుతామా? అద్భుత జ్ఞానాన్ని బట్వాడాచేసిన వారమవుతామా? ఈ ప్రశ్నలు, ఇలాంటి సవాలక్ష ప్రశ్నలు బుద్ధుని అభిమానులు, అనుయాయులుగా చెప్పుకుంటున్నవారు ఎన్నడూ వేసుకున్న పాపాన పోలేదు. వేసుకుంటే వారి ప్రయాణానికి ‘బ్రేక్’ పడుతుంది. వారి ‘‘కాలచక్రం’’ ఆగిపోతుంది. ఊహాలోకం చెదిరిపోతుంది. అందుకే వాటి జోలికి వెళ్ళకుండా ‘‘్ధ్యనం’’లో కాలం గడిపేందుకు ఇష్టపడుతున్నారు. గంభీరమైన విషయాలకు సైతం బుద్ధుని చిరునవ్వే సమాధానమన్న ‘‘వైరాగ్య స్థితి’’లోకి వారు జారుకుంటున్నారు. వైరాగ్యస్థితి నిస్తేజానికి, నిర్వీర్యానికి సంకేతమని తెలుసుకోకపోతే ఎలా? ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా జీవనం కొనసాగే ఈ 21వ శతాబ్దంలో, జీవన విధానం ‘‘రీడిజైన్’’ అయిన సందర్భంలో, కృత్రిమ మేధ సమాజమంతటా పరివ్యాప్తమవుతున్న సమయంలో, మనుషుల బదులు రోబోలు ఉత్పత్తిలో, సేవారంగాల్లో పనిచేస్తుండగా రెండున్నర వేల సంవత్సరాల క్రితంనాటి భావజాలం, భావావేశం ఇప్పటికీ అన్వయమని చెప్పడం ‘దగా’ కాకపోతే ఏమిటి?
ఆట (గేమ్) మారింది, ఆట తీరుమారింది, పద్ధతులూ మారాయి, పరిసరాలూ మారాయి. రాచరికంపోయి ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. శాక్య వంశంపోయి శాకమూరి... తదితర వంశాలు తమ శక్తిసామర్థ్యాలను ప్రదర్శిస్తున్నాయి. ఇదంతా రహస్యం కాదు... రెండున్నర వేల ఏళ్లుగా అందరి ఎరుకలోనే కొనసాగుతోంది. దాని ‘ఉచ్ఛదశ’ వర్తమానంలో కనిపిస్తోంది. దీన్ని చూసేందుకు భేషజం అడ్డొచ్చి, ఏమీ జరగలేనట్టు, ఇప్పటికీ ‘‘మానవ చైతన్యం’’ బుద్ధుని కాలం చుట్టూనే పరిభ్రమిస్తుందని భ్రమపడుతూ ఇతరులనూ ఆ భ్రమణంలోకి లాగడం ఏ విధంగా శ్రేయస్కరమవుతుంది? ఏ విధంగా అభ్యుదయకరమవుతుంది? ఉచ్ఛ్వాస, నిశ్వాసలను లెక్కిస్తూ ‘విపాశన’ చేస్తే దేహసమస్యలు, ఇతర సమస్యలు దూరమవుతాయని విశ్వసించడం తగునా? సాంకేతిక పరిజ్ఞానం ‘‘శుద్ధి’’ అవుతుందని భావించడం సబబేనా?

- వుప్పల నరసింహం