సబ్ ఫీచర్

అరవైల్లోనూ ఆనందంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరవై ఏళ్ళు గడిచిన సమయం సంపాదించినది.. దాచుకొన్నది.. తీసి ఖర్చుపెట్టే వయసు.. తీసి ఖర్చుపెట్టి జీవితాన్ని ఎంజాయ్ చేయండి.. దాన్ని దాచి ఇంకా అలా దాచడానికి మీరు పడ్డ కష్టాన్నీ, కోల్పోయిన ఆనందాలనూ మెచ్చుకొనేవారు ఎవరూ ఉండరు అనేది గుర్తుపెట్టుకోండి.
* మీ కొడుకులు, కూతుర్లు, కోడళ్ళూ మీరు దాచిన డబ్బు కోసం ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో? ఈ వయసులో ఇంకా సంపాదించి సమస్యలనూ ఆందోళనలూ కొని తెచ్చుకోవడం అవసరమా? ప్రశాంతంగా వున్నది అనుభవిస్తూ జీవితం గడిపితే చాలదా?
* మీ పిల్లల సంపాదనలూ, వాళ్ళ పిల్లల సంపాదనల గూర్చి చింతేల మీకు? వాళ్ళ గురించి మీరు ఎంతవరకూ చెయ్యాలో అంతా చేశారుగా? వాళ్లకి చదువు, ఆహారం, నీడ మీకు తోచిన సాయమిచ్చారు. ఇపుడు వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడ్డారు. ఇంకా వాళ్ళకోసం మీ ఆలోచనలు మానుకోండి. వాళ్ళ బాధ్యతలను వాళ్ళు నిర్వర్తించుకోనీయండి.
* మీరు ఆరోగ్యవంతమైన జీవితం గడపండి. అందుకై అధిక శ్రమపడకండి. తగిన వ్యాయామం చేయండి. తృప్తిగా తినండి. హాయిగా నిద్రపోండి. అనారోగ్యం పాలుకావడం ఈ వయసులో సులభం. ఆరోగ్యం కాపాడుకోవడం కష్టం. అందుకే మీ ఆరోగ్య పరిస్థితిని గమనించుకోండి. మీ ఆరోగ్య, వైద్య అవసరాలు చూసుకొంటూ వుండండి. మీ డాక్టర్‌తో టచ్‌లో వుండండి. అవసరమైన ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ వుండండి.
* మీ భాగస్వామికోసం అవసరమైన వస్తువులు కొనండి. మీ సొమ్ము మీ భాగస్వామితో కాక ఇంకెవరితో అనుభవిస్తారు. గుర్తుంచుకోండి.. ఏదో ఒకరోజు మీలో ఒకరు రెండోవారిని వదిలిపెట్టాల్సి వస్తుంది. మీ డబ్బు అప్పుడు మీకు ఎటువంటి ఆనందాన్నివ్వదు. ఇద్దరూ కలిసి ఆనందంగా జీవితాన్ని అనుభవించండి.
* చిన్న చిన్న విషయాలకు ఆందోళన పడకండి. ఇప్పటివరకూ జీవితంలో ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొన్నారు. ఎన్నో ఆనందాలు, విషాదాలూ చవిచూశారు. అవన్నీ గతం. మీ గత అనుభవాలు మిమ్మల్ని వెనక్కు లాగేలా తల్చుకొంటూ ఉండకండి. మీ భవిష్యత్తును భయంకరంగా ఊహించుకోకండి. ఆ రెండింటివలన మీ ప్రస్తుత స్థితిని నరకం చేసుకోకండి. ఈరోజు నేను ఆనందంగా ఉంటాను అనే అభిప్రాయంతో గడపండి. చిన్న చిన్న సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి.
* మీ వయస్సు అయిపోయింది అనుకోకండి. మీ భార్యని ఈ వయస్సులో ప్రేమిస్తూనే ఉండండి. మీ జీవితాన్ని ప్రేమిస్తూనే ఉండండి. మీ కుటుంబాన్ని ప్రేమించండి.
* జీవితంలో ప్రేమ, అభిమానం, తెలివితేటలు వున్నన్నాళ్ళూ మీరు ముసలివారనుకోకండి. నేను ఏమి చేయగలనూ అని ఆలోచించండి. నేను ఏమీ చేయలేననుకోండి. వయస్సు మీకేగానీ మనస్సుకు కాదు.
* ఆత్మాభిమానంతో జీవించండి. మీకు మాత్రమే స్పెషల్ అయిన స్టైల్స్ ఏర్పర్చుకోండి. వయసుకు తగ్గ దుస్తులు ధరించండి. అందరిలో హుందాగా ఉండండి. ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా ఉండండి. ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో ఉండండి. మీ పాత స్నేహాలు మళ్లీ మీకు దొరకవచ్చు.
* యువతరం ఆలోచనలను గౌరవించండి. మీ ఆదర్శాలు వారి ఆదర్శాలు వేరు వేరు కావచ్చు. అంతమాత్రాన వారిని విమర్శించకండి. సలహాలు ఇవ్వండి. అడ్డుకోకండి. మీ అనుభవాలు వారికి ఉపయోగపడేలా మీ సూచనలిస్తే చాలు. వారికి నచ్చితే తీసుకుంటారు. లేదంటే వదిలేస్తారు.
* మా రోజుల్లో.. అంటూ అనకండి. మీ రోజులు ఇవే! మీరు బ్రతికి వున్నన్ని రోజులూ... ‘ఈ రోజు నాదే’ అనుకోండి. తోటివారితో కఠినంగా ఉండకండి. జీవితకాలం చాలా తక్కువ పాజిటివ్ దృక్పథం, సంతోషం పంచే స్నేహితులతో ఉండండి. దానివలన జీవితం సంతోషదాయకమవుతుంది. కఠిన మనస్కులతో జీవనం కఠినం అవుతుంది. అది మీకు ఆనందాన్నిఇవ్వదు.
* మీకు ఆర్థిక శక్తి వుంటే ... ఆరోగ్యం వుంటే.. మీ పిల్లలతో మనవలతో కల్సి ఉండండి. వారితో ఉండటం మంచిదే అని అన్పించవచ్చు కానీ అది వారి ప్రైవసీకి కూడా అవరోధం అవుతుంది.
* మీ హాబీలను వదలద్దు. అప్పటి తీరుని హాబీలను హాయిగా ఎంజాయ్ చేయండి. తీర్థయాత్రలు, పుస్తక పఠనం, స్నేహం చేయడం లాంటివి.
* ఇంటి బయటకు వెళ్లడం అలవాటు చేసుకోండి. కొత్త పరిచయాలు పెంచుకోండి. పార్క్‌కు వెళ్ళడం, గుడికి వెళ్లడం, సభలకు వెళ్ళడం.. ఇంటా బయటా గడపడం కూడా మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది
* వృద్ధాప్యంలో బాధలూ.. సంతోషాలూ.. కలసిమెలసి ఉంటాయి. బాధలను తవ్వి తీసుకుంటూ ఉండకండి. అన్నీ జీవితంలో ఓ భాగమేనని గ్రహించండి.
* మర్యాదగా మాట్లాడటం అలవాటు చేసుకోండి. నోరు మంచిదయితే వూరు మంచిదవుతుంది. ఫిర్యాదులు, విమర్శలు చేయకండి. లోపాలనెత్తి చూపకండి. పరిస్థితులను అర్థంచేసుకొని ప్రవర్తించండి. సున్నితంగా సమస్యలను చెప్పడం అలవాటు చేసుకోండి.
* మిమ్మల్ని బాధపెట్టినవారిని క్షమించండి. మీరు బాధపెట్టినవారి క్షమాపణలు కోరండి. ఒకరిపై పగ పెంచుకోవద్దు.
* నవ్వండి.. నవ్వించండి.. మనసారా సంతృప్తిగా జీవించండి. ఈ జన్మకు ఇదే ఆనందమని... దీర్ఘకాలం హాయిగా జీవించండి.
మీ వయసుకూ కొందరు రాలేరు అని గుర్తించండి. మీరు పూర్ణ ఆయుర్దాయం పొందినందుకు ఆనందించండి.

- కురువ శ్రీనివాసులు