సబ్ ఫీచర్

పీవీకి భారతరత్న ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశానికి ప్రధానిగా పనిచేసిన తొలి దక్షిణ భారతీయుడు పివి నరసింహారావు. మేధావి, బహుభాషా కోవిదుడు. దేశాన్ని దుర్భర స్థితి నుంచి బయటపడేసిన రాజనీతిజ్ఞుడు. అందునా మన తెలుగువాడు. అటువంటి విశిష్ట వ్యక్తికి భారతరత్న ఇవ్వడం ఆ పురస్కారానికే వనె్నతెస్తుంది. ఏవో ఒకటీ అరా లోపాలను పట్టుకొని వాటినే పట్టుకొని వేళ్లాడటం ఆయన వ్యక్తిత్వాన్ని సమగ్రంగా పరిశీలించటం ఎలా అవుతుంది? ఇంతవరకూ ‘్భరతరత్న’లు పొందిన వారికి అసలు వైఫల్యాలే లేవా? ఉదాహరణకి- ప్రప్రథమంగా భారతరత్న అందుకున్న రాజగోపాలాచారి ఆంధ్రుల చిరకాల స్వప్నం అయిన ప్రత్యేక రాష్టస్రాధనకు సైంధవుడిలా ఎలా అడ్డుపడ్డాడో.. శ్రీ ఎం.వి.ఆర్.శాస్ర్తీగారి ‘ఆంధ్రుల చరిత్ర’ చదివితే తెలుస్తుంది. భారతమాత నుదుట ఎన్నటికీ మానని రాచపుండు, తెల్లవాడు వెళ్ళిపోతూ రాజేసిన ‘రావణకాష్ఠం’ కాశ్మీర్ సమస్యకు జవహర్‌లాల్ నెహ్రూ అసమర్థత, పక్షపాత ధోరణి ఎంతవరకూ కారణమో ఆ తరం వారందరికీ తెలుసు. లేదా శాస్ర్తీగారి ‘కాశ్మీర్ కథ’ చదవవచ్చు. దేశ ప్రజాస్వామ్యపటం మీద ఎమర్జెన్సీ మరకని రుద్దిన ఇందిరాగాంధీ కూడా భారతరత్నమే. అలాగని వారు సాధించిన విజయాలు, జాతి ప్రగతికి వారిచ్చిన ‘కంట్రిబ్యూషన్’ కాదనగలమా?
బంగారం కుదువపెట్టుకుని రోజువారీ విదేశీ చెల్లింపులు చేసుకుంటున్న దుస్థితి నుంచి- దేశ ఆర్థిక వ్యవస్థని-అమెరికా, చైనాకూడా ఈర్ష్యపడేంత సుస్థిర దశకి తెచ్చి, ప్రపంచమంతా ఆర్థిక మాంద్యపు తుఫాన్‌లో కొట్టుకుపోతున్న తరుణంలో కూడా ప్రశాంతంగా వృద్ధికి అవరోధం లేకుండా నడవగలిగేటంతటి ఆర్థిక యాజమాన్య పటిమని దేశానికి అందించిన పీ.వీ. చిరస్మరణీయుడు కాదా? దేశానికి ప్రధానిగా పనిచేసిన నాయకుడికి ఆ పదవీ కాలం ముగిసిన వెంటనే వచ్చిన ఎన్నికలలో సొంత పార్టీయే కనీసం ఎం.పీ. టికెట్ ఇవ్వకుండా అవమానించినా- ఏ కొంచెం అసహనం ప్రదర్శించక ‘నేను క్రమశిక్షణగల కార్యకర్తని...’అని ఎన్నికల ప్రచారానికి వెళ్ళిపోయిన పీ.వీ. రాజకీయ పరిణతి భావితరాలకి ఆదర్శం కాదూ...? హైందవ సంస్కృతికి దర్పణం లాంటి ‘వేయిపడగలు’ నవలని ‘సహస్రఫణ్’ పేరుతో జాతీయ భాషలోకి అనువదించి, తెలుగు సాహిత్యపు ఔన్నత్యాన్ని యావత్ భారతావనికే చాటిచెప్పిన మనవాడిని మనం తక్కువ చేసుకోవటం ఎంతవరకు సబబు?
జాఫర్ షరీఫ్, లాలూప్రసాద్, మమతాబెనర్జీ లాంటి రైల్వేమంత్రులు రైల్వే ప్రాజెక్టులన్నీ వారి వారి స్వంత రాష్ట్రాలకే కేటాయించుకున్నారనీ, ‘దేవెగౌడ కేవలం కర్నాటకకే ప్రధానా’.. అని బాధపడి, విమర్శించుకున్న మనం.. పీ.వీ.కి అలాంటి మచ్చని ఏ రాష్ట్ర ప్రజలూ ఆపాదించలేరని గుర్తించవద్దా? అలాంటి స్వచ్చమైన జాతీయతా చంద్రుడికి ఖచ్చితంగా ఓ నూలుపోగు మాత్రమే ‘్భరత రత్న’.
ఇవాళ దేశం ప్రపంచంలో ఉద్గమిస్తున్న ఆర్థిక వ్యవస్థల్లో ప్రముఖ స్థానంలో ఉన్నదంటే అది నాడు పీవీ వేసిన పునాది ఫలితమే. ఆయన తదనంతరం వచ్చిన ప్రభుత్వాలు నేటి వరకు ఆయన వేసిన బాటలోనే నడుస్తున్నాయ. దేశానికి సేవచేశాం..స్వాతంత్య్రం మావల్లనే వచ్చిందని బొర్రలు విరుచుకునే కాంగ్రెస్ పార్టీ..దేశానికి ఆయన చేసిన మహోన్నత సేవను గుర్తించకపోవడం విశ్వాస రాహిత్యానికి నిదర్శనం. కేవలం కుటుంబ పాలనకు అంకితమైపోయన పార్టీ, ‘కుటుంబేతరుడు’ సాధించిన విజయాలను, గుర్తించకపోవడం సహజమేమరి! ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న భాజపా నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వమైనా పీవీ రాజనీతిజ్ఞతను గుర్తించి, ఆయనకు భారతరత్నను ప్రకటించాలి.

- బొల్లాప్రగడ వెంకట పద్మరాజు