సబ్ ఫీచర్

డాకర్ ర్యాలీలో రష్యా మహిళ ఘనత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాకర్ ర్యాలీ.. ఇది ఎంత క్లిష్టమైన బైక్ రేసో బైకర్స్‌కి బాగా తెలుసు. కానీ రష్యాకు చెందిన రైడర్ అనస్తాషియా నిఫొంటోవాకు మాత్రం తేలికే.. 5,600 కిలోమీటర్ల అత్యంత క్లిష్టమైన, సాహోసోపేతమైన డాకర్ ర్యాలీని విజయవంతంగా పూర్తిచేసిన తొలిమహిళ. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఈమె.. 5, 600 కిలోమీటర్ల సుదీర్ఘ రేస్‌ను పూర్తిచేసింది.

ఈమెకు పదిహేను సంవత్సరాల కూతురు, ఆరు సంవత్సరాల అబ్బాయి ఉన్నారు. అనస్తాషియా వ్యాయామానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. రోజూ వ్యాయామం చేయడంతోపాటు అప్పుడప్పుడూ సరదా కార్యక్రమాలు కూడా చేస్తుంటుంది. ఇరవై సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే ఆమె బైక్ రేసింగ్‌లను చేసేది. ఆమె భర్త కూడా రేసింగ్ ట్రాక్‌పైనే ఆమెకు పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరి మధ్యా ‘పెళ్లి’ ప్రస్తావన వచ్చినప్పుడు ‘నాకు వంట చేయడం రాదు. నేను ఎప్పుడూ వంట చేయను. నువ్వు చేస్తే తినిపెడతా’ అని చెప్పిందట అనస్తాసియా. అందుకు అతను ‘పర్లేదు డార్లింగ్.. నాకు వంట చేయడం ఇష్టం. ఆ పని నేను చూసుకుంటా..’ అని చెప్పాడట. అలా ముందే ఒప్పించడంతో తర్వాత అతను ఎప్పుడూ వంట చేయమని అనస్తాసియాను ఇబ్బంది పెట్టలేదట. అనస్తాసియా ముందు నుండీ బైక్ డ్రైవ్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టేది. ప్రాక్టీస్ చేసేది.
డాకర్ ర్యాలీని ఆమె ఒంటరిగా పూర్తి చేసింది. వెంట టెక్నీషియన్ల బృందం లేకుండా డాకర్ ర్యాలీ పూర్తిచేసిన తొలి మహిళ అనస్తాసియా. అంటే ప్రయాణంలో తన బైకు పనితీరును సరిచూసుకోవడం, బైకులో ఏమైనా చెడిపోతే బాగు చేయడం అన్నీ ఆమే చూసుకోవాలి. ఇప్పటివరకు 5,600 కిలోమీటర్ల సుదీర్ఘ ర్యాలీని 32 మంది మాత్రమే పూర్తిచేశారు. ఆ 32 మందిలో ఏకైక మహిళ అనస్తాసియానే.. ఒకరోజు.. రెండు రోజులు కాదు.. వారాలపాటు ఎడారిలో గడపాలి. ఒక అమ్మాయికి ఇంతకంటే కష్టం మరొకటి ఉండదు. కొన్నిసార్లు ఆ ఎడారుల్లో నీటి బొట్టు కూడా దొరకదు. అంతా దుమ్ము, బురద.. దానికి తోడు 180 కిలోల బైకు బరువు.. ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అయినా ఆమె దృష్టిని లక్ష్యం వైపే సారించింది. తన ప్రయాణ వివరాలను అందిస్తూ.. ‘సాధారణంగా మహిళా రైడర్లు చేతులకు పురుషుల్లా గ్రీజుతో కనిపించాలని అనుకుంటారు. కానీ నేను సాధారణ అమ్మాయిలానే కనిపించేందుకు ఇష్టపడతాను. అలాగే ప్రయత్నిస్తాను కూడా.. రేసింగ్‌కు వెళ్లేముందు నా చేతులను మాలిష్ చేయించుకుంటా.. డాకర్ ర్యాలీ విజయం నాకు అంత సులువుగా దక్కలేదు. మధ్యలో ఎన్నో ఆటంకాలు ఎదురయ్యా. నేను ఒక ఇసుకదిబ్బ మీదకు చేరుకున్నాక నా వెనకాలో.. ఒక ట్రక్కు దూసుకొచ్చింది. దాదాపు దానికింద పడిపోయాను. ఆ ట్రక్కు కిందపడి నలిగిపోతానేమో అన్నం భయం వేసింది నాకు. కానీ దాని డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ తొక్కాడు. దాని టైరు సరిగ్గా నా ముఖానికి మీటర్ దూరంలో ఆగింది. ఒక్కక్షణం అయితే నా మీదనుంచి వెళ్లిపోయేది ఆ ట్రక్. కాసేపు అలానే ఉండిపోయాను. చేతులు వణుకుతున్నాయి. కన్నీళ్లు కారుతున్నాయి. లక్ష్యాన్ని చేరుకున్నాక.. అప్పుడు నా కాళ్లపైనే నేను నిలబడ్డానా అనిపించింది. అందరిముందూ నవ్వాను కానీ గుడారంలోకి వెళ్లాక దిండులో ముఖం పెట్టేసి భోరున ఏడ్చాను. అలా నా గుండెల్లోని భారమంతా దిగిపోయాక కళ్లు తుడుచుకుని మామూలు స్థితికి వచ్చాను. తరువాత మామూలే.. మళ్లీ బైకు బోల్టులు, నట్లను బిగించేందుకు సిద్ధమయ్యా.. అలా కన్ని ఇబ్బందులు వచ్చినా నేను వెనకడుగు వేయలేదు’ అంటూ అనస్తాసియా వివరించింది. .
*