సబ్ ఫీచర్

ప్రేమతోనే జ్ఞానావిష్కరణ (ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇతర దేశాలను, మతాలను ద్వేషించడం ద్వారా మాత్రమే మీ దేశంపై, మీ చర్చిపై మీకున్న ప్రేమను మీరు తెలుపగలరు. అలా మీరందరూ చాలా గొప్పగా భావిస్తున్న ఈ ప్రపంచంలోని మతాలన్నీ ఒకపక్క చాలా ద్వేషాన్ని రగిలిస్తూనే, ప్రేమ గురించి ఉపన్యాసాలు చెప్తున్నాయి. అందుకే మీరు చాలా గందరగోళంలో పడ్డారు. ప్రేమ గురించి మాట్లాడే క్రైస్తవులు ఊచకోతలతో యుద్ధాలను సృష్టిస్తుంటే, మహమ్మదీయులు జిహాద్‌ల పేరిట ధర్మ యుద్ధాలను సృష్టిస్తున్నారు. అలాగే హిందువుల పవిత్ర గ్రంథాలను పరిశీలిస్తే, వాటిలో ఎక్కడ చూసినా ఇతర మతాలను ద్వేషించడమే కనిపిస్తుంది. అలాంటి చెత్తనంతా మనం ఏమాత్రం వ్యతిరేకించకుండా పూర్తిగా అంగీకరిస్తున్నాం. ఎందుకంటే, ‘‘అది అంతే. అలాగే ఉండాలి’’ అని మనకు బోధించడం, ఆ చెత్తను మనం అంగీకరించేలా నిబద్ధీకరించడం జరిగింది. అందుకే మీరు మీ సహజత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు.
ప్రేమపై విషప్రయోగం మాత్రమే జరిగింది. కానీ, అది జీవాన్ని కోల్పోయి పూర్తిగా నాశనం కాలేదు. అందువల్ల ఆ విషాన్ని తొలగించి, పరిస్థితిని చక్కదిద్దే అవకాశం మీకు ఇంకా ఉంది. మీరు నిజంగా తలచుకుంటే, సమాజం మీలోకి బలవంతంగా ఎక్కించిన విషాన్ని కక్కెయ్యగలరు. అలాగే సమాజం మీపై బలవంతంగా రుద్దిన అంధవిశ్వాసాలను, నిబద్దీకరణలను త్యజించి మీరు హాయిగా స్వేచ్ఛగా ఉండగలరు. మీరు నిజంగా స్వేచ్ఛగా ఉండాలనుకుంటే సమాజం మిమ్మల్ని ఎప్పటికీ బానిసగా ఉంచలేదు.
ఇప్పుడు ఆ పాత పద్ధతులన్నింటికీ స్వస్తిచెప్పి, ఎలాంటి అణచివేతలు, పరిత్యాగాలులేని సహజమైన నూతన జీవితాన్ని పరమానందంగా ఆస్వాదించే సమయం వచ్చేసింది. అలాచేస్తే మీరు ఎప్పటికీ ఎవరినీ ఏమాత్రం ద్వేషించలేరు. ఎందుకంటే, అనారోగ్యం ఎప్పుడూ ఆరోగ్యానికి వ్యతిరేక ధృవంలో ఉన్నట్లుగానే ద్వేషం ఎప్పుడూ ప్రేమకు వ్యతిరేక ధృవంలో ఉంటుంది. కానీ, మీరు అనారోగ్యాన్ని ఎంచుకోవలసిన అవసరం ఏమాత్రం లేదు.
నిజానికి, ఆరోగ్యానికి లేని లాభాలు అనారోగ్యానికి ఉన్నట్లే ప్రేమకు లేని లాభాలు ద్వేషానికికూడా ఉన్నాయి. వాటిని మీరు చాలాజాగ్రత్తగా పరిశీలించాలి. అంతేకానీ, లాభాలుకదా అని మీరు వాటికే అతుక్కుపోతే మీ రోగం ఎప్పటికీ నయంకాదు. ఎందుకంటే, అడిగినవన్నీ వెంటనే చేసిపెడుతూ రోగిపై అందరూ ప్రత్యేకమైన శ్రద్ధ, జాలి చూపుతారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు- ఇలా అందరూవచ్చి అతనిని పలకరించిపోతూ ఉంటారు. అలా రోగి కేంద్ర బిందువై అందరికీ చాలాముఖ్యుడవుతాడు.
ఆ రకంగా రోగి అహం సంతృప్తిపడుతూ ఉంటుంది. అలా సంతృప్తిపడే వ్యక్తుల తమ రోగం నయమవాలని ఎప్పుడూ కోరుకోరని, ఆ విషయాన్ని వారు పూర్తిగా మర్చిపోతారని మనస్తత్వ శాస్తవ్రేత్తలంటారు. ఎందుకంటే, రోగం నయమై ఆరోగ్యం చిక్కితే వారిని ఎవరూ పట్టించుకోరని వారి భయం. మీరుకూడా మీ పిల్లలకు మీ ప్రవర్తన ద్వారా అదే నేర్పుతారు. ఎలాగంటే, పిల్లలకు జబ్బు చేసినప్పుడు కుటుంబ సభ్యులందరూ వారిపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. అది అవసరమే. కానీ, అతిగా శ్రద్ధచూపడం మంచిదికాదు. అది చాలాప్రమాదకరం. ఎందుకంటే, పిల్లలు మీరు అతిగా చూపించే శ్రద్ధకు ఎక్కువగా అలవాటుపడతారు. అలా వారి అహం తృప్తిపడుతూ ఉంటుంది. దానితో వారు రోగం నయమవాలని ఎప్పుడూ కోరుకోరు. అప్పుడు వారికి మందులు పనిచెయ్యవు, ఆరోగ్యం చిక్కదు. మనుషుల్లో చాలామందికి సరిగ్గా ఇలాగే జరుగుతోంది.

- ఇంకాఉంది
*
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.