సబ్ ఫీచర్

భయపెట్టేది అజ్ఞానమే (ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరు ఎవరినైనా ద్వేషించినప్పుడు మీ అహానికి ఏదో సంతృప్తిలభిస్తుంది. కాబట్టి, కేవలం ద్వేషంలో మాత్రమే అహం జీవిస్తుంది. ఎందుకంటే, ద్వేషించడం ద్వారా మీరు చాలాగొప్పగా, ప్రత్యేకమైన వారుగా గుర్తింపుతెచ్చుకుంటారు. కానీ, ప్రేమలో అహం మరణించక తప్పదు. ఎందుకంటే, ప్రేమలో మీరు ఎప్పుడూ విడిగా ఉండకుండా ఇతరులలో లీనమైపోతారు. అది ఎంతో చక్కని కలయిక. అందుకు ప్రేమ మీకు చాలా సహాయపడుతుంది.
మీరు మరీ ఎక్కువగా అహానికే అతుక్కుపోయే పక్షంలో ద్వేషించడం మీకు చాలా సులభమవుతుంది. ప్రేమించడం మీకు చాలా కష్టమవుతుంది. కానీ, పూర్తి ఎరుకతో గమనిస్తే, అహం నీడే ద్వేషమని మీకు తెలుస్తుంది. ప్రేమించేందుకు చాలా ధైర్యముండాలి. ఎందుకంటే, అప్పుడు మీరు మీ అహాన్ని త్యాగంచెయ్యవలసి వస్తుంది. అందుకు సిద్ధపడేవారే ప్రేమించగలరు. ఎవరైతే ఎవరూ కాని, ఎలాంటి గుర్తింపు లేని, ఏదీ కాని, ఏదీలేని, పరమ శూన్యమయేందుకు సిద్ధపడతారో, వారే ఆవలి తీరాలనుంచి లభించే ప్రేమ బహుమతిని స్వీకరించగలుగుతారు.
***
గుంపునుంచి బయటపడండి
ధ్యానమంటేనే ‘‘్ధర్యం’’. ఎందుకంటే, మీరు ఒంటరిగా, చాలా నిశ్శబ్దంగా ఆ పని చెయ్యాలి. ధ్యానం చేస్తున్నప్పుడు మీలోని జీవం మెల్లమెల్లగా నూతన నాణ్యతతో కూడిన సౌందర్యాన్ని, తెలివితేటలను సంతరించుకుంటున్నట్లు మీకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అది మీలో ఎదుగుతున్నదే తప్ప, ఇతరులనుంచి ఎరువుతెచ్చుకున్నది కాదు, ఎందుకంటే, దాని మూలాలు మీ ఉనికిలోనే ఉన్నాయి. మీరు పిరికివారు కాకపోతే కచ్చితంగా అది మీలో పుష్పించి, ఫలిస్తుంది.
**
తమ అస్తిత్వానికి అనుగుణంగా ఎవరూ లేరు. ఎందుకంటే, సమాజము, సంస్కృతి, మతం, విద్యావిధానాలు అమాయకమైన పసిపిల్లలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాయి. పిల్లలందరిలో చాలా శక్తి ఉంటుంది. కానీ, వారు పెద్దలపై ఆధారపడినందువల్ల నిస్సహాయులయ్యారు. అందుకే పెద్దలు తమకు కావలసినది వారిచేత చేయించుకుంటున్నారు. పిల్లలు తమ సహజ గమ్యానికి చేరుకునేలా ఎదిగేందుకు పెద్దలు అంగీకరించరు. వారి ప్రయత్నాలన్నీ పిల్లలను ప్రయోజకులుగా చేసేందుకే. ఎందుకంటే, ఒకవేళ పిల్లలను వారికిష్టమైన రీతిలో ఎదిగేలా వదిలితే, తమ స్వార్థప్రయోజనాలకు వారు అనుగుణంగా ఉంటారో, ఉండరో ఎవరికి తెలుసు? అలాంటి ప్రమాదాన్ని స్వీకరించేందుకు సమాజం ఎప్పుడూ సిద్ధపడదు. అందుకే అది పిల్లలపై పెత్తనం వహిస్తూ, తన అవసరాలకు తగినట్లుగా వారిని మలిచే ప్రయత్నం ప్రారంభిస్తుంది.
ఒక రకంగా అది పసివాడి ఆత్మను చంపి, దానికి ప్రత్యామ్నాయంగా వాడికి నకిలీ గుర్తింపును కట్టబెట్టినట్లే అవుతుంది. అందుకే వాడు అందులోంచి ఏమాత్రం బయటపడలేదు. ఎందుకంటే, ప్రత్యామ్నాయ నకిలీ గుర్తింపు మీకు ఏ సమాజం, ఏ గుంపు ఇచ్చిందో, ఆ గుంపులో ఉండేందుకు మాత్రమే అది మీకు ఉపయోగపడుతుంది.
మీరు ఒంటరిగా ఉన్న మరుక్షణం మీ నకిలీ గుర్తింపు మాయమై, అణచివేయబడ్డ మీ వాస్తవం బయటపడడం ప్రారంభిస్తుంది. అందుకే మీరు ఒంటరిగా ఉండేందుకు చాలా భయపడతారు. అందువల్ల ఒంటరిగా ఉండేందుకు ఎవరూ ఇష్టపడరు. అందుకే అందరూ కేవలం ఒక గుంపులో మాత్రమే కాకుండా, ఎప్పుడూ ఆలంబనగా ఉండే అధ్యాత్మిక, రాజకీయ, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్బుల్లాంటి అనేక చిన్న, పెద్దగుంపులలో ఉండాలనుకుంటారు.
- ఇంకాఉంది
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.