సబ్ ఫీచర్

గ్రీన్ టీ వల్ల ఆరోగ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయానే్న కప్పు కాఫీ లేదా టీ గొంతులో పడందే ఇంటి పనుల్లోకి అడుగుపెట్టలేనివారు చాలామంది ఉన్నారు. పరగడుపునే టీ లేదా కాఫీ సేవించటం వల్ల ఆరోగ్యం పాడవుతుందని, దీనికి బదులు గ్రీన్ టీ తీసుకోమని సలహా ఇస్తుంటారు. కాని గ్రీన్ టీ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయని అం టున్నారు. దీనివల్ల కూడా ఆరోగ్యానికి చేటేనని అధ్యయనాలు వెల్లడిస్తున్నా యి. గ్రీన్ టీకి ఉపయోగించే ఆకులు కూడా బ్లాక్ కాఫీ లేదా నల్లని తేయాకును ఏ విధానంతో తయారో చేస్తారో వీటిని కూడా అలాగే చేస్తారు. ఫలితంగా అనేక పోషకాలు వీటి నుంచి పోతుంటాయి. గ్రీన్ టీ తాగటం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు ఏమిటో తెలుసుకుందాం.
అజీర్తి సమస్య
గ్రీన్ టీ సేవించటం వల్ల అజీర్తి సమస్యలు వస్తాయి. వీటిని మరగకాయ టం వల్ల టెన్నన్లు ఆకుల నుంచి తొలిగించబడతాయి. ఫలితంగా గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల అజీర్తి సమస్యలు సైతం ఉత్పన్నమవుతాయి. దీనికి కొద్దిగా పాలు కలిపితే గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తికాదు.
ఐరన్ లోపం
ఇది తాగటం వల్ల ఐరన్ లోపం సంభవిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు సైతం ఉత్పత్తిఅవటంతో మనకు ఆహారం ద్వారా లభించే ఐరన్‌ను కోల్పోతాం. ఐరన్ లోపం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు అన్నీఇన్నీ కావు. రక్తహీనత ఏర్పడుతోంది. ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి మందగిస్తోంది. రక్తహీనత వల్ల శరీరానికి కావల్సిన ఆక్సిజన్ అందక ఫలితంగా హిమోగ్లోబిన్ లెవల్స్ సైతం పడిపోతాయి.
నాడీ వ్యవస్థ సమస్యలు
సాధారణ కాఫీ, టీ పానియాల వలే గ్రీన్ టీలోనూ కెఫెన్ అనే పదార్థాం ఉంటుంది. కాకపోతే తక్కువ మోతాదులో ఉంటుంది. ఇది నిద్రలేమికి కారణమవుతోంది. ఫలితంగా మానసిక ఆందోళన, మూత్రవిసర్జన సాఫీగా జరగ
కపోవటం, గుండె సరిగా కొట్టుకోకపోవటం, కీళ్ల తిమ్మర్లులాంటి సమస్యలు వస్తుంటాయి.
గర్భిణులకు ఇబ్బందులు
గ్రీన్ టీ వల్ల గర్భిణులకు అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. కెఫెన్ వల్ల కాల్షియం తగ్గిపోయి ఎముకలు బలహీనంగా ఉంటాయి. దీనివల్ల తల్లికి ఇబ్బందులు తెచ్చిపెడతాయి. దీనిలో ఉండే కెఫెన్, కాటెచిన్స్, టెన్నన్లు తల్లికి నెగిటివ్ సమస్యలు తెచ్చిపెడతాయి. ఒక్కొక్కసారి గర్భస్రావానికి కూడా దారితీసే ప్రమాదం ఉంది. ఇవి తల్లిపాలలో మిళితమై ఉండటం వల్ల ప్రొటీన్స్, కొవ్వు పదార్థాలు వంటివాటిపై ప్రభావాన్ని చూపుతాయి.
మందుల ప్రతికూల ప్రభావం
గ్రీన్ టీలో ఉండే మందులు శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇందులో ఉండే పోలిఫెనోల్స్, నికోటిన్ తదితరమైనవి ప్రతికూల చర్యలకు పాల్పడతాయి. అలాగే లిథియం ఏర్పాటును నిరోధిస్తోంది. దీనివల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. అలాగే గ్లూకోమాపై కూడా దీని ప్రభావం అధికంగానే ఉంటుంది. ఫలితంగా కంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.