సబ్ ఫీచర్

కుహనా మేధావులు మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూ ధర్మానికి భారతదేశం పుట్టినిల్లు. అత్యంత పురాతనమైనది. అన్ని ధర్మాలకు మూలమైంది. అట్టి ధర్మాన్ని గౌరవంగా ప్రపంచంలో చాటిచెప్పినవారు ఎక్కువ శాతం బ్రాహ్మణ సామాజికులు. హిందువులకు మతభేదాలు లేవు. హిందువులు పయనిస్తున్న దారిలో ఏ దేవాలయం గాని మరి ఇతర మతస్థుల ప్రార్థనాలయాలైన మసీదు లేదా చర్చి కనిపిస్తే అన్నింటికి నమస్కారం చేస్తారు. అంటే అందరిలోను తమ దైవం వున్నాడనే అభిప్రాయం మాత్రమే. అది మన ధర్మం యొక్క విశాలత్వాన్ని తెలియజేస్తుంది. హిందు ధర్మానికి మూల పురుషులెవరో ఎవరికీ తెలియదు. వ్యాసుడు, వాల్మీకి పేర్లు అందరికీ తెలిసినవే. దేవాలయంలో పూజ చేయవలెనంటే బ్రాహ్మణ సమాజికుడు కావాలి. వివాహనిర్వహణకు బ్రాహ్మణ సామాజికుడు కావాలి. నూతనంగా గృహప్రవేశానికి పురోహితుడు అదే సమాజకుడు. సమాజంలో ఏ మంచి పనికైనా బ్రాహ్మణ సమాజీకులు కావాలి. మన నిత్య జీవన సరళిలో అంతగా ప్రాముఖ్యతను పొందినవారు వారు మాత్రమే. అలాంటి వీరు ధర్మప్రచారంలోనేకాక స్వతంత్ర పోరాటంలో ఎక్కువ శాతం త్యాగాలు చేశారు. వీరసావర్కారు, బాలగంగాధర తిలక్, మదనమోహన మాలవీయ మరెందరో.
ప్రజలకు విద్యాలయాలు కూడ వారి ద్వారానే ఎక్కువ శాతం వెలిశాయి. అన్ని కూడ ధర్మరక్షణార్థం మాత్రమే. ఇందులో వారు స్వార్థానికి తావీయలేదు. ధర్మంలో హెచ్చుతగ్గులు లోటుపాట్లువస్తే అవి కూడ సరిచేసి సమాజాన్ని సాఫీగా దారిలో వుంచారు. ఎంతోమంది సంస్కర్తలు వారినుండే వచ్చారు. అలాంటి వారిని ఎవరు దుర్విమర్శ యింతవరకూ చేసి వుండలేదు. ఎంతోమంది సంస్కర్తలు ధర్మాన్ని కాలానుగుణంగా అందరికీ అర్థమయ్యేలా విడమర్చి చెప్పి, అందరికీ అందుబాటులోకి తీసుకొని రాగలిగినారు. ధర్మం తెలియని, అర్థంచేసుకోలేని, అధిక తెలివితేటలున్న మేధావులుగా తమనుతామే వూహించుకొనే కొందరు బ్రాహ్మణ సామాజికులపై అనవసర విమర్శలకు పాల్పడుతున్నారు. ఎవరికివారు కుల విమర్శలు మాని సమాజంలో మంచిని నెలకొల్పితే మంచిది.
సమాజం కోసం సర్వం త్యాగం చేసి సర్వదా సమాజ హితాన్ని కోరు కుంటున్న బ్రాహ్మణులను కొందరు కావాలని విమర్శించడం కూడని పని. కొందరు తప్పులు చేయవచ్చు దానికి అందరినీ ఒకే గాటన కట్టడం తప్పు కదా. అనవసర విమర్శల దాడులకు దిగేవారంతా తామెంత మేర ధర్మానికి కట్టుబడి ఉంటున్నామో ఆలోచించుకోవాలి. సమాజంలో ప్రతి ఒక్కరూ కులమత ప్రసక్తి లేకుండా ధర్మబద్ధమైన జీవనం గడిపితే అస లు సమస్యలే ఉత్పన్నం కావు. నిజానికి తమను తాము మేధావులుగా చెప్పుకునేవారు, కుహనా విమర్శల వల్ల పొందే ప్రయోజనమేంటి? కేవలం చౌకబారు ప్రచారం తప్ప. నేటి బ్రాహ్మణులు ఎవరినీ విమర్శిం చడం లేదే? తమ వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నారు. ఎవరికీ కీడు లేదా హాని తలపెట్టడం లేదు. నేటి సమాజంలో చోటు చేసుకుంటున్న అస్తవ్యస్థ తలకు వారు కారణం కానే కాదు. డబ్బు, అధికారం, అహంకారంతో విర్రవీగే వారు మాత్రమే తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి అశాంతిని సృష్టిస్తున్నారు. అటువంటివారిని విమర్శించాలి. సమాజ హి తానికి పాటుపడాలి. అంతేకాని కాలం చెల్లిన వాదాలను పట్టుకొని వేలాడుతూ, ఇంకా అదే పడికట్టు పదాలతో విమర్శించడం వల్ల ఒరిగే దేమీ ఉండదు. మారుతున్న కాలాన్ని బట్టి మారాల్సింది ఇటువంటి బూజు పట్టిన మెదడు కలిగిన మేధావులు మాత్రమే.

- డి.పి.రామచంద్రరావు