సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

730. ఒక్కొక్కప్పుడు సూర్యచంద్రుల కాంతులు సమ్మిశ్రీతమైయున్నవా యనిపించు నపూర్వమైన కాంతి గోచరించును. భక్తిజ్ఞానములకు (రెండింటికిని) పట్టుకొమ్మగడు శ్రీ చైతన్య దేవునివంటి అపూర్వావతారమూర్తులు ఇట్టివారు. వీరి ప్రతిభ సూర్యచంద్రులు మింటనేక కాలమున వెల్గొందుచున్నారా యనునట్లు ప్రకాశించును. కాని ఇది యెంతటి యపూర్వమో భక్తిజ్ఞానములు ఒకే వ్యక్తియందు వెల్గొందుటయు నంతటి యపూర్వము, అసామాన్యము.
731. తన్ను ప్రేమించు పరిశుద్ధాత్ములకోసము భగవంతుడు మానవ రూపమున నవతరించును.
732. అవతారమూర్తులతో వచ్చువారు నిత్యముక్తులై యుందురు. లేదా వారికదియే తుది జన్మమైయుండును.
పదునాఱవ ప్రకరణము
జ్ఞానయోగము
జ్ఞానయోగమనగా నెట్టిది?
733. జ్ఞానమూలమున భగవదనుసంధానమే జ్ఞానయోగము. బ్రహ్మసాక్షాత్కారమే జ్ఞానయోగి ఆశయము. అతడు ‘‘నేతి, నేతి’’ (ఇదికాదు. ఇదికాదు) అనుచు, ఒకదాని వెంబడి నొకటిగా అసత్య విషయములను విడిచివేయుచు, సదసద్విచారము నిలిచిపోవుస్థితిని బొందును. అంతట సమాధి స్థితిలో వానికి బ్రహ్మసాక్షాత్కారము లభించును.
734. దొంగ చీకటి గదిలో బ్రవేశించి యందలి వస్తువులను తడవ నారంభించును. బహుశః ఒక బల్లపై చేయివైచి, ‘‘ఇదికాదు’’అని ముందునకు బోవును; పిమ్మట మఱియొక వస్తువుమీద- చేయివేయును- అదియొక కుర్చీ కావచ్చును. ‘‘ఇది కాదు’’అని దానిని దాటిపోయి ధనపు బెట్టెను జేరగల్గువఱకు తన యనే్వషణమును సాగించును. ధనపుబెట్టె చేచిక్కినంతనే ‘‘ఇదిగో, ఇదే’’అనుకొనుచు. వాని వెదకులాట అంతటితో సరి. బ్రహ్మానే్వషణమును సరిగా నిట్టిదే.
735. అనుభవముచేనిట్లు గ్రహించినాను. ‘‘్ధ్యనముచే గలుగు జ్ఞానము ఒక విధమైనది, వివేచనచే గలుగు జ్ఞానము మఱియొక విధమైనది. మఱియు సాక్షాత్కార సంజనితమైన జ్ఞానము వేఱు.’’
736. తారతమ్యముచే నేమి, స్వభావముచే నేమి, జ్ఞానము అనేక విధములు. ఇందు మొదటిది సామాన్యులగు లౌకికుల జ్ఞానము. ఇది యంతగా నిశితమైనది కాదు; పటువైనది కాదు. ఇది గదిలోనున్న దీపమువంటిది. దాని ప్రకాశము గదిలో మాత్రమే యుండును. భక్తుని జ్ఞానము ఇంతకంటె ప్రకాశవంతమైనది. ఇది వెనె్నల వంటిది. వెనె్నలచే గదిలోపలి వస్తువులును వెలుపలి వస్తువులును గూడ కాన్పించును. కాని అవతార పురుషుని జ్ఞానమో, సూర్య తేజమువలె అఖండ ప్రకాశమానము. ఆతడు కేవలము జ్ఞాన భాస్కరుడు. వాని జ్ఞాన తేజము యుగ యుగములనుండియు జనుల నావరించియున్న అజ్ఞానాంధకారమును పటాపంచలు చేయును.
జ్ఞానయోగ విధానము
737. నిన్ను నీవు తెలిసికొంటివా, పరులను పరాత్పరుని గూడ తెలిసికొనిన వాడవగుదువు. ‘నేను’ అనగానేమి? అది నీ చేయియా, పాదమా, రక్తమా, మాంసమా, కండరములా? బాగుగా విచారింపుము. విచారించినయెడల ‘నేను’అనునదేమియు లేదని నీకే విశదమగును. నీరుల్లిపాయను ఒలిచిన కొలదియు పొరలే వచ్చుచుండునుగాని అందు పలుకేమియు గానబడదు. అట్లే ‘నేను’అనుదానియొక్క స్వరూపమేమని పరిశీలించిన పక్షమున అది యదృశ్యమైపోవును. ఇట్టి విచారముచే తుదకు మిగులునది భగవంతుడొక్కడేయని బోధపడును, అహంకారము నశించినతోడనే భగవంతుడు ప్రత్యక్షమగును.
- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి