సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

738. భగవంతుడు మనకు బాహ్యమున దూరముగానున్నట్లు తోచునంతవఱకు ఉండునది అజ్ఞానమే. అంతరంగమున భగవత్సాక్షాత్కారము నొందునప్పుడు ఉండునది నిజమైన జ్ఞానము.
739. హృదయమును జూపుచు శ్రీగురుదేవుడిట్లు వచించువాడు: ఇచట భగవంతుని గాంచిన వానికి (బాహ్య ప్రపంచమును జూపుచు) అచటను గోచరించును. తనలో భగవంతుని గాంచనివాడు బాహ్యమున నెన్నటికిని గాంచనేరడు. కాని యెవ్వడు తన హృదయాలయమున భగవంతుని దర్శించునో వాడు విశ్వాలయమునగూడ భగవంతుని గాంచును.
740. ఒకడు అర్ధరాత్రమున లేచి చుట్ట కాల్చుకొనగోరెను. అందులకు నిప్పు కావలసి వచ్చుటచే పొరుగుననున్న యింటికిపోయి తలుపు తట్టినాడు. ఒకడు తలుపు తీసి, ‘‘ఏమికావలయును?’’అని యడిగెను. ‘‘చుట్ట కాల్చుకొనవయును. కొంచెము అగ్గీయగలరా?’’అని యాతడడిగెను. అందులకాపొరుగువాడు, ‘‘అబ్బా! నీకేమి మతిపోయినదా? నీ చేతిలోనే దీపమున్న లాంతరుండ, నీవింత శ్రమపడి యిపుడు వచ్చి మమ్ము నిద్రలేపితివే!’’అనెను. అట్లే నరుడు అనే్వషించునది వాని హృదయముననే కలదు; ఐనను దానికొఱకై యాతడు ఎందెందో తిరుగులాడుచుండును.
741. అనులోమము, విలోమము-అని విచారము రెండు విధములు. అనులోమ విచారముచే జిజ్ఞాసువు సృష్టినాధారము చేసికొని సృష్టికర్తను, అనగా కార్యమునుండి కారణము నూహించును. అంతట విలోమ విచారము ప్రారంభమగును. ముందు బ్రహ్మమును బొంది విశ్వమునందలి ప్రతి కార్యమునందును ప్రత్యంశమునందును వాని వ్యక్తీకరణమును (లేక రూపమును)గాంచనేర్చును. ఇందు మొదటిది పృథక్కరణ పద్ధతి, రెండవది సమీకరణ పద్ధతి: మొదటిది అరటి దొప్పలను ఒలుచుచు వాని నడుమనుండు దూటను గనుగొనుట వంటిది, రెండవది (దూటపై) దొప్పలను ఒక దానిపైనొకటి పేర్చుటవంటిది.
742. జ్ఞానము ఏకత్వమునకును అజ్ఞానము భిన్నత్వమునకును దారిచూపును.
743. విశేష వేదాంత గ్రంథ పఠనము చేయుచుండిన యొక బాల శిష్యునితో శ్రీగురుదేవుడొకప్పుడిట్లు పల్కెను. ‘‘నాయనా! నీవీమధ్య వేదాంత విచారములో నిమగ్నుడవైయున్నావుకదా, మంచిది. ‘బ్రహ్మ సత్యం జగన్మిథ్యా’- ఇదియేకదా వేదాంతసారము? ఇంతకంటె మఱేమైననున్నదా?’’అదియే వేదాంతసారమని బాలశిష్యుడు అంగీకరించెను.
గురువచనములు ఆతనికి వేదాంత తత్త్వములపై నూతన తేజమును బఱపి ప్రకాశింపజేసెను. గురువచనములను దలచి యాతడు ఆశ్చర్యచకితుడయ్యెను. గురుదేవుని వచనములను చక్కగా గ్రహించి నమ్మినచో వేదాంతతత్త్వము పూర్తిగా అవగాహనమైనట్లేయని యాతనికి దట్టెను. శ్రీగురుదేవుడు మఱల నాతనికిట్లు బోధించెను. ‘‘శ్రవణము, మననము, నిది ధ్యాసనము. బ్రహ్మమే సత్యము, ప్రపంచమసత్యమని మొదట వినవలయును. పిమ్మట మననము చేయవలయును. తరువాతిది దానిని గూర్చిన ధ్యానము, అనగా మనస్సును అసత్యమగు ప్రపంచమునుండి మఱల్చి సత్యమగు బ్రహ్మముపై నిలుపవలయును. ఇదే వేదాంత విచారక్రమము. అంతేకాని తత్త్వమును విని, దానిని కేవలము ధీశక్తిచే ఇట్టిదని గ్రహించి అసత్ప్ర పంచమును విడువ యత్నింపని పక్షమున అట్టి జ్ఞానమువలననేమి లాభము? అది లౌకికుల ధోరణి. తత్త్వమును దెలిసికొనుటకది సాహాయ్యకారి కాదు. దృఢ నిశ్చయము, త్యాగము- ఇవియే వలయునవి. ఇవి లేనిదే తత్త్వమును దర్శింపజాలము. కానిచో జగత్తు మిథ్యయనియు బ్రహ్మము సత్యమనియు చిలుక పలుకులను బలుకుచు, శబ్దాది విషయములు ఎదుటబడినంతనే వానివలలో దగుల్కొనుటయేకాని మఱియొకటి కాదు.
- ఇంకాఉంది
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి