సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అట్టివాడు నోటిమాటగా, ముండ్లులేవని చెప్పుచు, చేతికి ముల్లు గ్రుచ్చుకొనినంతనే, ‘అమ్మయ్యో!’అని యేడువనారంభించును. ఒకప్పుడు పంచవటికొక సాధువు వచ్చినాడు. ఆతడు ఇతరుల యెదుట వేదాంతమును గూర్చి విశేషముగా ప్రసంగములు సాగించువాడు. ఆతడొక స్ర్తితో వ్యభిచరించుచుండెనని నేనొకనాడు వింటిని. కొంత సేపటికి నేనావైపునకు బోవుసరికి ఆతడక్కడ కూర్చుండియుండెను.
అంత నేనాతనితో ఇట్లంటిని: ‘వేదాంతమును గూర్చి నీ వింతగా ఉపన్యసించుచుందువే! కాని నిన్ను గూర్చి నీవింతగా ఉపన్యసించుచుందువే! కాని నిన్నుగూర్చి వారు చెప్పుకొనునదంతయునేమి?’ ఆతడిట్లు బదులుచెప్పెను. ‘దానికేమి లెండు, దీనిలో నేమియు బాధలేదని నేను మీకు నిరూపింపగలను. జగత్తు అంతా అసత్యమైయుండ నాపతనము మాత్రము నిజమా? అదియు మిథ్యయే. వాని ధోరణిని జూచిన నా ‘్ఛ!్ఛ’యనిపించినది. నేనిట్లంటిని; ‘ఇట్టి వేదాంతము పైనే నుమియుదును! ఇది నిజమైన జ్ఞానము కాదు, బూటకము! సంసార మోహముచే శుద్ధలౌకికులు- పండితంమన్యులు- సాయించు మిట్టవేదాంతము!’’
జ్ఞానయోగము దుర్లభము
జ్ఞానయోగము ఈ కలియుగముననెంతయు దుర్లభము. మనము అన్నగతప్రాణులమని మొట్టమొదట గమనింపవలసియున్నది. రెండవది, కలియుగమునందలి జనుల ఆయుఃప్రమాణము అల్పము, జ్ఞానయోగ సాధనకు ఇది చాలదు. మూడవది, మనలనావేశించియున్న దేహబుద్ధిని వదల్చుకొనుట ఇంచుమించుగా అసాధ్యము. ‘‘నేనీ దేహము కాను, అఖండ బ్రహ్మమును, సచ్చిదానందమయ పరమాత్మను, దేహమను కాకుండుటచే క్షుత్పిపాసలు, జనన మరణములు మొదలగు శరీర ధర్మములేవియు నావికావు’’-అని జ్ఞానయోగికి నిశ్చితబుద్ధి కలుగవలయును. ఈ శరీర ధర్మములకు వశుడయ్యును తాను జ్ఞాని వనుకొనువాడు చేతికి ముల్లుగ్రుచ్చుకొని యఖండ బాధపడుచుండియు, ‘‘ఏల? నా చేతికి ముల్లు గ్రుచ్చుకొనలేదు, నా చేయి గీఱుకొనిపోలేదు, బాగుగనేయున్నది’’అనువాని వంటివాడు! ఇట్టి మిట్ట వేదాంతము నిష్ప్రయోజనము. జ్ఞానాగ్నిచే దేహబుద్ధియను ముల్లు మొట్టమొదట భస్మీభూతము కావలయును.
745. ఏ కొలది మందియో జ్ఞానప్రాప్తికర్హులైయుందురు. ‘‘వేలకొలది జనులలో ఒకానొకడు నన్ను బొంద యత్నించును, అట్టివారిలో ఒకానొకడు మాత్రమే నిజముగా నన్ను తెలిసికొనగల్గుచున్నాడు.’’అని గీత వక్కాణించుచున్నది. సంసారమునెడ అనగా కామినీ కాంచనములయెడ రాగము తగ్గినకొలదియు మానవుని జ్ఞానము వికసించుచుండును.
746.జ్ఞానయోగి, ‘సోహం’ (ఆత్మయే నేను) అనును. కాని నరునకు దేహాభిమాన మున్నంతవరకు ఈ యహంకారము హానికరము. దీనివలన శ్రేయస్సుకలుగదు, సరికదా, వినాశము కలుగును. అట్టివాడు తన్ను తాను వంచించుకొనుటయే కాక ఇతరులను కూడా వంచించుచున్నాడు.
747.రామచంద్రుడను బ్రహ్మచారి యొకనాడు దక్షిణేశ్వరాలయమున శ్రీరామకృష్ణుని సందర్శించెను. అతడు బైరాగివలె పొడుగాటి జడలను బెంచుకొనియుండెను. ఒక తావున గూర్చుండి యాతడప్పుడప్పుడు ‘శివోహం, శివోహం’ అనుట తప్ప అన్యధా వౌనము దాల్చి యుండెను. శ్రీరామకృష్ణుడు నెమ్మదిగా కొంతకాలము అది కనిపెట్టి వానితో నొకనాడిట్లు విమర్శించి పలికెను: ‘‘శివోహం’ అని కేవలము పాట పాడినందువలన నేమి లాభం? హృదయ దేవాలయమున పరమశివుని ధ్యానించుచు, దేహస్మృతిరహితుడై అంతరంగమున సచ్చిదానందమయుడగు అల పరమశివుని ప్రత్యక్షము చేసికొన్నవాడు మాత్రమే పరమ పవిత్రమగు నిట్టి మంత్రము నుచ్చరించుటకు అధికారి,
- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి
*