సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాక్షాత్కారము లేని వట్టి సూత్రావృత్తివలన నేమి ప్రయోజనము? సాక్షాత్కర మహాదశ ప్రాప్తము కాకుండునంత వరకు భగవంతునియందు సేవ్య సేవక భావము, అనగా భగవంతుని ప్రభువనియు తాను సేవకుడననియు భావించుట మేలు’’. అంతట బ్రహ్మచారి తన తప్పు గ్రహించి యా మహోపదేశమువలనను అట్టి ఇతరోపదేశములవలనను జ్ఞానంవతుడయ్యెను. ఆతడాచోటు విడిచిపోవుటకు ముందు శ్రీరామకృష్ణుడుండిన గదికీవలి గోడపై (వంగ భాషలో) నిట్లు వ్రాసెను: ‘‘స్వామి చేసిన యుపదేశము ననుసరించి రామచంద్రబ్రహ్మచారియింతటి నుండి భగవంతునియందు సేవ్యసేవక భావము కలిగియుండును.
భక్తియోగము
భక్త యెట్లు వృద్ధియగును?
748. సామాన్యమగు నద్దముపై బొమ్మలు పడవు, కాని ఛాయాగ్రహణములోవలె రసాయనములు పూయబడిన అద్దముపైబడును. అటులనే మానవ హృదయముపై భక్తి అను రసాయనము పూయబడినపక్షమున దానిపై భగవత్ప్రతిబింబు చక్కగా పడును.
749. ఈ భగవద్భక్తి కడు దుర్లభమైన వస్తువు, పతివ్రతకు మగనిపైనుండు హృదయపూర్వమగు ననురాగము భగవంతునియందు గలుగవలయును. అపుడు భక్తి లభించును. పరిశుద్ధమగు భక్తియలవడుట మహాదుర్లభము. అందు అంతఃకరణము భగవానియందు లయముగాంచును. అపుడు ‘్భవము’ (ఉత్తమ భక్తిచే తన్మయత) గలుగును. ‘్భవము’ నందు వాగ్బంధనమగును. అపుడు లక్ష్యమును భేధించు విలుకానికెట్లు వాగ్బంధనమై శ్వాసలు కట్టువడునో అట్లుకుంభకము తనంతట అదియే సిద్ధించును.
750.విషయములయందు రాగము తగ్గిన కొలది భగవద్భక్తి వృద్ధియగుచుండును.
751.నిజముగా ఈ బేరగాండ్రు (లౌకికులు) చచ్చుమినుపపప్పునకై (ఇంద్రియభోగములకై) దేవులాడుచున్నారు! సంసార కళంకితులుగాని పరిశుద్ధాత్ములకు మాత్రమే భగవద్భక్తి లభించును. వారికి ఒకటే దృష్టి, భగవత్పాదార విందములయందు మనసు నిలుపుటేవారి ఏకైక వాంఛ.
752. మచ్చికచేయబడని గుఱ్ఱములకు గంతలు కట్టిననే కాని అవి యొక్క అడుగైనను ముందునకు వేయవు. ఇంద్రియ నిగ్రహము లేనిదే భగవద్దర్శనము సాధ్యమగునా? ఒక యర్థము కాదని చెప్పవలసియున్నది. కాని యిది జ్ఞానయోగ విషయముననే వర్తించును. ‘‘ఆత్మసాక్షాత్కారము కోరువాడు నిష్కల్మషుడు గావలగును. కామక్రోధాదులను నిగ్రహింపవలయును.
ముందు ఇంద్రియ నిగ్రహము, తరువాత బ్రహ్మసాక్షాత్కారము’’ అని జ్ఞానయోగి వక్కాణించును. కాని భగవంతుని బొందు మార్గము మరియొకటి కలదు. అదియే భక్తియోగము. భగవద్భక్తి హృదయమున వెల్లివిరియ, ఆనంద పారవశ్యమున భగవన్నామ సంకీర్తనచే పులకాంకురము గలుగునేని, అట్టివాడిక ఇంద్రియ నిగ్రహమునకై ప్రయత్నింపనేల? ఇంద్రియ నిగ్రహమపుడు స్వతసిద్ధముగనే లభించును. ఘోర దుఃఖము ననుభవించువాడు కయ్యమున బ్రవేశింపగలుగునా? విందులు గడువగల్గునా? ఇంద్రియ సుఖములకై పరుగిడగలుగునా? అటులనే భగవత్ప్రేమోన్మత్తుడగువాడు విషయభోగములకై దేవులాడజాలడు.
753. శ్రీమతి (రాధాదేవి) శ్రీకృష్ణుని సమీపించిన కొలదియువాని దివ్య శరీర గంధము ఆమెకు సోకుచుండెను. భగవంతుని సమీపించినకొలదియు భక్తి వృద్ధి యగుచుండును. సముద్రమును సమీపించినకొలదియు నది యందలి పోటుపాటులు హెచ్చుచుండును గదా?

- ఇంకాఉంది
*
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి