సబ్ ఫీచర్

అపర ధన్వంతరి రాజ్యలక్ష్మి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చతుర్వేదములకు ఉపవేదములున్నవి. అందులో ఆయుర్వేదము ఒకటి. శరీరమాధ్యం ఖలుధర్మసాధనమ్ అన్నారు. జీవేన శరదశ్శతమ్ అని మహదాశీర్వాదము. ఇది ఆయుర్వేదము వల్లనే సాధ్యము.
ప్రాచీన భారతదేశంలో చరకుడు, సుశ్రుతుడు వంటి మహర్షులు ఆయుర్వేదాన్ని ఉపాసించారు. ఆధునికంగా కూడా మనకు ఆచంట లక్ష్మీపతి, చక్రవర్తుల నరసింహాచార్యులు (విజయవాడ), శఠగోపాచారి (వరంగల్) వంటివారెందరో ఆయుర్వేదాన్ని వ్యాప్తి చేశారు. హైదరాబాద్ ముదిగొండ శంకరశాస్ర్తీ, విజయవాడలో ఇవటూరి రామకృష్ణ (రాంబాబు) ఈ తరానికి చెందినవారే. అపర పతంజలి అని పేరొందిన రాందేవ్ బాబా యోగా ద్వారా రోగాలను నయం చేస్తున్నారు. దీనినే భారతీయ ప్రాచీన విజ్ఞానం అంటారు.
హైదరాబాద్‌లోని మెట్టుగూడలో ఒక ఆతురాలయంలో క్రమం తప్పకుండా ఒక మహిళామణి సికింద్రాబాద్ నుండి వచ్చి ఆర్తులకు ఆయుర్వేద వైద్య సహాయాన్ని అందిస్తున్నది. ఆమె పేరే రాజ్యలక్ష్మి.
శ్రీమతి కావేరి రాజ్యలక్ష్మి 14 మే 1977లో సాయని రాము, భవాని దంపతులకు జన్మించారు. తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు భాషలు అభ్యసించారు. నెల్లూరు జిల్లాలో ప్రాథమిక విద్య ముగించుకొని హైదరాబాద్ ఆయుర్వేద కళాశాల నుండి కాయచికిత్సలో ఎం.డి పట్టా పొందారు. కాశీలో సర్ట్ఫికెట్ పొందారు. ఎర్రజాని వెంకట సుబ్బారావుని వివాహమాడారు. కుమారి చాతుర్య, కుమారి కౌస్త్భు సంతానం.
రాజ్యలక్ష్మి ఎన్నో ఆయుర్వేద వర్క్‌షాప్స్, ట్రైనింగ్ క్యాంప్స్ నిర్వహించారు. జైపూర్, న్యూఢిల్లీ, కేరళ (పందళం), వారణాసి వంటి అనేక ప్రసిద్ధ స్థలాలలోని సెమినార్లలో కళాశాలల్లో పాల్గొన్నారు. మన్నం ఆయుర్వేదిక్ కళాశాల కేరళలో కాయచికిత్సలో లెక్చరర్‌గా పనిచేశారు. ఎం.ఎన్.ఆర్ ఆయుర్వేద కళాశాల సంగారెడ్డి (తెలంగాణ)లో కాయచికిత్స విభాగంలో లెక్చరర్‌గా పనిచేశారు. ఎల్.జి.డి. సౌత్ సెంట్రల్ రైల్వే హాస్పిటల్, సికిందరాబాద్‌లో గౌరవ ఆయుర్వేద ఫిజీషియన్‌గా ఎందరి బాధలనో విముక్తి చేస్తున్నారు.
వివిధ సందర్భాలలో విపుల పరిశోధనతో ఆయుర్వేద సంబంధమైన పరిశోధనా పత్రాలను ఆమె ఆయా సదస్సులలో సమర్పించారు. అవి ఆయా ఆయుర్వేద పత్రికలలో ప్రచురించబడ్డాయి.
* కటుత్రికాదివటి మాత్రావస్థిపై ఒక పరిశోధన
* క్లినికల్ స్టడీ ఆఫ్ ఫిమేల్ ఇన్‌ఫెర్టిలిటీ
* జలధరు- ప్రాధాన్యం బహుళార్థ ప్రయోజనాలు
* డయాబెటిస్ మెల్లిటిస్
* జమ్మూ ఆయుర్వేద ఇన్‌స్టిట్యూట్‌లో 2005లో జరిగిన ఆయుర్వేద సమ్మేళనంలో ఇంటర్నేషనల్ సెమినార్‌లో గ్లోబల్ పర్‌స్పెక్టివ్ ఆఫ్ ఆయుర్వేదపై ప్రసంగ వ్యాసం.
* మధుమేహ మేనేజ్‌మెంట్‌పై హైదరాబాద్‌లో జరిగిన (2007) సెమినార్‌లో ప్రసంగవ్యాసం.
* గదగ్ కర్ణాటకలోని ఇంటర్నేషనల్ ఆయుర్వేద కాన్ఫరెన్స్‌లో పత్ర సమర్పణ.
ఇలా జమ్మూకాశ్మీర్, గుజరాత్, న్యూఢిల్లీ, ఎపి, కర్ణాటక, కేరళ వంటి ఎన్నో రాష్ట్రాల్లో డాక్టర్ రాజ్యలక్ష్మి కీర్తిప్రభలు వ్యాపించాయి.
సామాన్యులకు అందుబాటులో వుండే నిత్యావసర వస్తువులతో సంకటాలు తీర్చటం ఆయుర్వేద ప్రత్యేకత. పోపు సామానులు, జీలకఱ్ఱ, మెంతులు, ఆవాలు, ఇంగువ, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, వాము దివ్యౌషధాలని ఎందరికి తెలుసు?
కిడ్నీ సమస్యలకు చెరకు రసం దివ్య ఔషధమట! హృద్రోగులకు ఆవుపాలు, అర్జున వృక్షపు బెరడు అపూర్వ వైద్యం. నేత్ర రోగులకు నారికేళాంజనం చాలు. రోజూ నిమ్మరసం, తేనె తీసుకుంటే ఉదర రోగాలు రావు.
శ్రీమతి రాజ్యలక్ష్మి ఎందరెందరో విపన్నులకు ప్రాణదానం చేశారు. ఎన్నో సన్మానాలు, ప్రశంసలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పొందారు.
ఆచార్య శిప్రముని పీఠం, హైదరాబాద్ వారు 2019వ సంవత్సరానికిగాను శ్రీమతి డాక్టర్ ముదిగొండ ఉమాదేవి మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ పక్షాన శ్రీమతి కె. రాజ్యలక్ష్మికి ‘ఉమాదేవి స్మారక జాతీయ పురస్కారం’ అందిస్తున్నారు. ఈ సందర్భంగా కె. రాజ్యలక్ష్మికి 25వేల నగదు, రజతపాత్ర, పట్టుబట్టలతో సత్కరించనున్నారు. ఈ కార్యక్రమం శ్రీ త్యాగరాయ గానసభ మెయిన్ హాల్‌లో జూలై 5న వైభవోపేతంగా జరుగనుంది.

- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్