సబ్ ఫీచర్

జెన్నీ.. వెరీ ఫన్నీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సజ్జ చేలో -సజ్జలే పండుతాయి. ఇది సద్దిమూటలాంటి పెద్దల మాట.

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులోని పోలాప్రగడ సుబ్బారావు, లక్ష్మీదేవమ్మల ఇంటా అదే జరిగింది. తోబుట్టువులకు నటన పట్ల ఆసక్తి ఉండటంతో వాళ్ల మధ్య పెరిగిన కుర్రాడు మాత్రం ముఖానికి రంగేసుకోవాలన్న ఆలోచనలతో పెరిగాడు. -పసి వయసునుంచే వేషాలకు ఆకర్షితుడయ్యాడు. అతనే -జనార్దనరావు. కళారంగానికి మాత్రం సింపుల్‌గా జెన్నీ.

సినిమా మొత్తాన్ని భుజాన మోసేంతటి స్టార్ ఆర్టిస్ట్ కాదు. అలాగని గుంపులో గోవిందంలాంటి ఆర్టిస్ట్ అస్సలు కాదు. స్టేజి అనుభవంతో స్క్రీన్‌కు వచ్చిన తరువాత -కొన్ని పాత్రలు అతనికి దొరికాయి. కొన్ని పాత్రలు అతని కోసమే పుట్టాయి. అలా -వచ్చిన వేషాన్ని కాదనకుండా చాలాదూరమే సిల్వర్ స్క్రీన్‌మీద సుదూరమే ప్రయాణించాడు జెన్నీ. నిజానికి ఓ మామూలు ఆర్టిస్టే. కాకపోతే -ఆయన చేసిన కొన్ని పాత్రల్ని, చాలా సినిమాల్లోని ఇంకొన్ని సన్నివేశాల్ని గుర్తు చేసుకున్నపుడు మాత్రం మనకు -జెన్నీ మాత్రమే కనిపిస్తాడు. ఆ ఒక్క సీన్‌తో కలిగే ఆనందం -సినిమాలోని కొన్ని సన్నివేశాల బోర్‌డమ్‌ని మింగేస్తాయి. అదీ -జెన్నీ స్టామినా. ఈ వారం వెనె్నలకు ముచ్చట్ల అతిథి.
ఏడుగురు అక్కచెల్లెళ్లు. ముగ్గురు అన్నదమ్ములు. అలా పెరిగిన జెన్నీకి బాల్యంనుంచే నటనపై మక్కువ కలిగింది. పనె్నండేళ్ల ప్రాయంలో తొలిసారి స్టేజి ఎక్కాడు. పల్లెపడుచు నాటకంలో బాలనటుడి అవతారమెత్తాడు. బొబ్బా నాగేశ్వరరావు గురువుగా గోపీ పాత్రను అద్భుతంగా పండించాడు. అదే నాటకాన్ని తరువాత సినిమాగా తీశారు. స్టేజిమీద జెన్నీ పాత్రను స్క్రీన్‌పై చలం వేశాడు. అది వేరే విషయం.
పనె్నండేళ్ల బాలనటుడి పెర్ఫార్మెన్స్‌కు ఊరు మురిసిపోయింది. మెచ్చుకున్న ఊరి ప్రెసిడెంట్ వెండి గ్లాసు బహుమతిచ్చాడు. ఇదీ జనార్ధనరావు ఉరఫ్ జెన్నీ ఫస్ట్ అవార్డు.
అప్పటినుంచి బహుమతులు, అంతకుమించి చప్పట్ల కోసం జెన్సీ మనసు అర్రులుచాచింది. ఆదర్శ కళాసమితి అసోసియేషన్‌లో ‘రిక్షావాడు’, ‘ఆడది’, ‘దొంగలు’లాంటి నాటకాల్లో బాలనటుడంటే జెన్నీనే. అప్పట్లో మా గోపీ, మాబాబు చిత్రాల్లోని బాలనటులే నాకు ప్రేరణ అంటారు జెన్నీ. ‘నేనూ సినిమాల్లో నటించాలన్న కోరిక అప్పుడే కలిగిందేమో’ అంటాడు జెన్నీ. ఆలోచన పుట్టింది మొదలు మనసుని ఆశ తొలుస్తూ వచ్చింది. తనకొచ్చిన కప్పులు, వెండిగ్లాసులు పట్టుకొని చెన్నై చెక్కేయ్యాలనుకున్నాడు. కానీ దేవుడు అమ్మరూపంలో ఓ మంచి సలహా ఇచ్చాడు. ‘నువ్వు ఈ జిల్లాలోని పదిమంది ఆర్టిస్టుల్లో ఒక మంచి ఆర్టిస్టువే. కానీ చెన్నపట్నంలో నీలాంటోళ్లు వేలల్లో ఉంటారు. వాళ్లందరితో పోటీపడి నటనను ప్రదర్శించే అనుభవం ఉందా?’ -ఇదీ ఆర్టిస్టుగా వాళ్లమ్మ వేసిన ప్రశ్న. మళ్లీ జెన్నీ ఆలోచనలో పడ్డాడు.
కాలినపుడే ఇనుము వొంగుతుంది. ఆలోచన మొలకెత్తినపుడే సంకల్పం మొదలవుతుంది. జెన్నీమీద వాళ్లమ్మ ఇదే ప్రయోగించింది. -‘ముందు చక్కగా చదువు. పెద్దాడివైతే మంచి, చెడు తెలుస్తాయి. నిర్ణయం తీసుకునే శక్తివస్తుంది. గొప్పవాళ్లంతా మంచి పుస్తకాలు చదివినోళ్లే. అది -సినిమా కావొచ్చు, జీవితం కావొచ్చు’. ఇదే చెప్పారామె. అందుకే -‘నా తొలి గురువు అమ్మే’ అంటారు జెన్నీ.
ఓసారి దూరదర్శన్ జెన్నీని ఓ బైట్ అడిగింది. ‘మీ భవిష్యత్తుకు పునాదివేసిన తల్లి గురించి చెప్పండి’ అని. దానికి జెన్నీ చెప్పిన సమాధానమేంటో తెలుసా? ‘ఏదోక వేషం కోసం దూరదర్శన్ చుట్టూ వందసార్లు తిరిగాను. ఇప్పుడు అమ్మ గురించి తెలుసుకోడానికి దూరదర్శనే మా ఇంటికొచ్చింది. నన్ను ఆ స్థాయికి తెచ్చింది మా అమ్మే’ అని. అదీ జెన్నీకి అమ్మమీదున్న ప్రేమ.
స్కూల్లో, కాలేజీలో ఎక్కడికెళ్లినా నటన జెన్నీకి ఓ వ్యామోహమైంది. 1963-66 మధ్య రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో బికామ్ చదివారు జెన్సీ. అక్కడ కల్చరల్, స్పోర్ట్స్ సెక్రటరీ బాధ్యతలు తీసుకున్నాడు. ఓ పత్రికలో వస్తున్న మూసీ కినారే అన్న శీర్షికపై వచ్చే కళాకారుల వ్యాసాలన్నీ ఔపోసనపట్టాడు. ఆ ప్రభావంతో మదిలోకి కొత్త నిర్ణయం వచ్చింది -అది హైదరాబాద్‌లోగాని, చెన్నైలోగాని ఉద్యోగం చేయాలని. దానివల్ల చిన్నగా కళారంగం గురించి తెలుసుకుని, ముఖ్యంగా స్క్రీన్‌మీద కనిపించాలని ఆశ. ప్రతిభను మెరుగుపర్చుకుని సినిమా అవకాశాలు సాధించాలన్న కోరిక బలంగా ఉండటంతో, 1966లో హైదరాబాద్ ఏజి ఆఫీసులో ఉద్యోగంలో చేరారు. పక్కనేవున్న రవీంద్రభారతిలో ఏఆర్ కృష్ణ ఆధ్వర్యంలో సాగే మూడేళ్ల యాక్టింగ్ డిప్లొమా కోర్సు చేశారు. 68లో ఇసిఐఎల్‌లో ఉద్యోగం. అక్కడా కల్చరల్ స్పోర్ట్స్ సెక్రటరీ బాధ్యతలు. అదే సమయంలో నాటక రంగంలోవున్న భానుప్రకాష్, జిఎల్ నరసింహారావు, సిఎస్‌ఎన్ మూర్తి వంటి దర్శకుల దగ్గర తర్ఫీదుపొందారు. ప్రస్తుతం జెన్నీ పాతికేళ్లుగా తల్లావఝుల సుందరం గ్రూప్‌లో నాటకాలు వేస్తూనే ఉన్నాడు.
ఎప్పటికైనా స్క్రీన్‌కు ఎక్కాలన్నది జెన్నీ సంకల్పం. ఇంత ప్రయాణం అందుకోసమే. జెన్నీకి ఆ టైం జంధ్యాల దగ్గరినుంచి మొదలైంది. జెన్నీ వేసిన నాటకాన్ని దర్శకుడు జంధ్యాల చూశాడు. జెన్నీలో ఏదో మెరుపుందన్న విషయాన్ని జంధ్యాల పసిగట్టాడు. అంతే ‘అహనా పెళ్లంట’ సినిమాలో సర్వర్ అవతారం ఎత్తాడు జెన్నీ. రాజేంద్రప్రసాద్‌తో కాంబినేషన్. అలా నిర్మాత రామానాయుడితో పరిచయం. జెన్నీని చూసిన తరువాత రామానాయుడిలో కొత్త ఆలోచన మొదలైంది. సపోర్టింగ్ ఆర్టిస్టుల్ని చెన్నైనుంచి తెచ్చుకునేకంటే, లోకల్ టాలెంట్‌ను ప్రోత్సహించడం మంచిదన్నదే ఆ ఆలోచన. దాంతో ప్రతి సినిమాలో జెన్నీకి అవకాశం దక్కుతూ వచ్చింది.
పరుచూరి రఘుబాబు మెమోరియల్ నాటక పోటీల్లో ఆరుగురు ఉత్తమ నటుల్లో జెన్నీ ఒకరు. ఉత్తమ నటులకు తమ సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పిన పరుచూరి బ్రదర్స్, మోహన్‌గాంధీ దర్శకత్వంలో రూపొందించిన ‘ప్రాణదాత’లో అవకాశాన్ని కల్పించారు. బ్రహ్మానందం అల్లుడిగా, జెన్నీ మామగా చేసిన కామెడీ ఆ సినిమాకు హైలెట్ అయ్యింది. ‘్ఫస్ట్ఫా అంతా అల్లుడిని నేను కాల్చుకుతింటే, సెకెండాఫ్ అంతా అల్లుడు పాత్ర నన్ను ఆడుకుంటుంది. తమాషా సీన్స్ అవి’ అంటూ నవ్వేశాడాయన. ఆ సినిమా తరువాత పరిశ్రమలో జెన్నీకి వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. కొత్త కమెడియన్ వచ్చాడని, సన్నగా, పీలగా శివరావులా నటిస్తున్నాడన్న పేరొచ్చింది. దాంతో ఆఫీసులచుట్టూ ఫొటోలు పట్టుకుని తిరగాల్సిన అవసరం లేకుండా అవకాశాలు రావడం మొదలెట్టాయి. ‘ఉద్యోగం చేసుకుంటూ ఇష్టమైన నటన కొనసాగించడానికి ఒకింత ఇబ్బంది పడినా వదిలిపెట్టలేదు. ఒకటి రెండు రోజుల్లో పూర్తయ్యే పాత్రలిమ్మంటూ దర్శకుల్ని అడిగేవాడిని. వారేమో -ఎవరైనా ఎక్కువ నిడివివుండే పాత్రలిమ్మని అడుగుతారు. మీరేంటండి పొట్టి పాత్రల్ని కోరుకుంటున్నారు అనేవారు. అందుకు కారణం వాళ్లకు చెప్పేవాడిని కాదుకానీ, నా ఆలోచన, ఇబ్బందీ వేరు. పెద్ద పాత్రలిస్తే ఔట్‌డోర్ షూటింగ్‌ల కోసం ఊళ్లు పట్టుకు తిరగాలి. ఉద్యోగానికి ఇబ్బంది. అందుకే ఒకటి రెండు రోజుల్లో పూర్తయ్యే పాత్రల్ని అడిగేవాడిని’ అంటూ గుర్తు చేసుకున్నాడు జెన్నీ. రచయిత దివాకర్‌బాబు నాటక రంగంలో స్నేహితుడు. ఎస్‌వి కృష్ణారెడ్డి ‘మాయలోడు’ సినిమా తెరకెక్కిస్తున్న టైంలో ఆయనకు పరిచయం చేశారు జెన్నీని. ఎముకల డాక్టర్‌గా నటించిన జెన్నీ మంచి హాస్యాన్ని పండించటంతో, తరువాత కృష్ణారెడ్డి పిలిచి మరీ ‘యమలీల’ చిత్రంలో పత్రిక ఎడిటర్ పాత్ర ఇచ్చారు. ‘చెల్లి పెళ్లి చెయ్యాలి మళ్లీ మళ్లీ..’ అన్న కవితతో జెన్నీ పాత్రకు పెద్ద హైప్ వచ్చింది. హలోబ్రదర్, ప్రాణదాత, ఆంటీ, యమలీల లాంటివి దాదాపు 300 చిత్రాల్లో నటించాడు జెన్నీ. ‘నాకు అమలాపురంలో పదెకరాల కొబ్బరితోట, మేడలు మిద్దెల్లాంటి ఆస్తులేమీ లేవు. ఉన్నదల్లా ఒక్క ఎంకామ్ పట్టా, దాంతో వచ్చిన ఉద్యోగం. వాటితోనే కుటుంబాన్ని నెట్టుకురావాలి. నటనపై ఆసక్తి చంపుకోలేక పాత్రల కోసం తిరిగాను తప్ప, పెద్ద పెద్ద పాత్రలు చేసేయాలన్న ఆలోచనలకు దూరంగా ఉండేవాడిని’ అంటూ గుర్తు చేసుకుంటాడు జెన్నీ.
జెన్నీలో మరో కోణం ఉంది. పారిస్‌నుండి ఆటోమెన్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆల్‌ఫ్రెడ్ ఫ్యారిన్ మూకాభినయంలో దిట్ట. ఆయన ఓసారి రవీంద్రభారతిలో మైమ్ షో నిర్వహించారు. అది చూసిన జెన్నీకి తానొక కొత్త లోకంలో ఉన్నట్టుగా అనిపించింది. తెల్లారే ఆయన దగ్గరికెళ్లి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నవ్వించే కళను నేర్పమన్నాడు. ఆయన తన శిష్యుడిగా చేసుకొని నేర్పించిన కళను దాదాపు 500లకు పైగా ప్రదర్శనలిచ్చారు జెన్నీ. ప్రపంచంలోనే తొలి మైమ్ తెలుగు కళాకారుడిగా జెన్నీకి ద గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ళ వేణుమాధవ్ కితాబునిచ్చాడు. ఉస్మానియా వర్శిటీలో పదేళ్ళపాటు పార్ట్‌టైమ్ లెక్చరర్‌గా థియేటర్ ఆర్ట్స్‌లో పనిచేశారు. రచయితగా దాదాపు 50 కథలు రాశారు. అందులో 24 కథలకు బహుమతులు లభించాయి. ఆ కథలన్నీ కలిపి తెలుగు యూనివర్సిటీ ‘అమ్మకో అక్షరం’ టైటిల్‌తో సంకలనం చేసింది. మిగతా కథలను విజయవాడ సాహితీవారు ఓ సంకలనంగా ప్రచురించారు. బహుముఖ ప్రజ్ఞ, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన అనేక సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి. అలాంటి జెన్నీ గుర్తు చేసుకున్న చిన్న విషయమేంటంటే -‘సంధ్యాఛాయ అన్న నాటకం చూడటానికి వెళ్లాను. ఓ నటుడు రానందువల్ల నన్ను నటించమని అడిగారు. పాత్ర గురించి తెలియకుండా ఎలా అన్నానే్నను. అదంతా మూకాభినయంతో సాగే పాత్ర. యజమాని చేయబోయే పనిని అడ్డుకుని ఫటాఫటా చేసి వెళ్లిపోవటమే ఆ పాత్ర తీరు. ఒక్కమాట మాట్లాడకుండా ఆ పాత్రను చేసేశాను. అందుకు అవార్డు సొంతమైంది. అది ఎప్పటికీ ఆనందం కలిగించే విషయం’ అంటాడాయన. ‘ఉద్యోగాన్ని, కుటుంబ బాధ్యతల్ని సంతోషంగా నిర్వర్తించాను. ఆ సంతృప్తితో హాయిగా కాలం వెళ్లదీస్తున్నా. నా గురించి తెలిసిన దర్శకులే పిలిచి అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరి దగ్గరికీ తిరగలేను’ అంటున్నారు జెన్నీ. తాను చేయాల్సిన పాత్ర ఏదైనా ఉందీ అంటే అది ఖచ్చితంగా తన దగ్గరికే వస్తుందన్న జెన్నీ ఆత్మబలం గొప్పది. ఓవైపు యాక్టింగ్ ఫ్యాకల్టీలో లెక్చరర్‌గా, మరోవైపు మైమ్ కళాకారుడిగా, మరోవైపు సినిమా నటుడిగా బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తున్నాడు జెన్నీ.

సరయు శేఖర్, 9676247000