సబ్ ఫీచర్

‘సర్వోన్నత’ న్యాయమూర్తులపైనే అనుమానాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల సమయంలో అనేక మంది రాజకీయ నాయకులు చౌకబారు విమర్శలు, స్థాయికి తగని ఆరోపణలు, క్షమాపణలతో మనకు దర్శనమిచ్చారు. సరే.. వీరి విషయంలో ఎన్నికల తదనంతరం- ఈ ప్రదర్శనలు- ఈ ప్రకరణం ముగుస్తుందని మనం సంతోష పడవచ్చు.
కానీ.. ఈమధ్య ఇంకో ప్రమాదం మనముందుకొచ్చింది. దేశంలో ఏది జరిగినా అంతిమంగా ఎవరో ఒకరు- న్యాయస్థానాల ముందుకు పోవటం, న్యాయమూర్తులు సక్రమంగా విచారణ జరిపి తీర్పివ్వటం జరుగుతున్నది. దాదాపుగా అది ఆ తీర్పుతో ముగుస్తుంది.
కానీ.. ఆ న్యాయవ్యవస్థ పాలన మీదే సందేహాలకు ఆస్కారమేర్పడితే, ఇక ఈ దేశం భవిష్యత్ ఏమిటి? మన గతి ఏమిటి?
ఈమధ్య జరిగిన సంఘటన ఈ అనుమానానికి పూర్తి ఆస్కారమిచ్చింది. ఆ వివరాలు...
గత నెల- ఏప్రిల్ 18న సుప్రీం కోర్టు మాజీ ఉద్యోగిని ఒకరు- సాక్షాత్తూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తనను లైంగిక వేధింపులకు గురిచేశారని- 24 పేజీల ప్రమాణ పత్రాన్ని 22 మంది సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు పంపింది! ఇది సహజంగా యావద్దేశాన్ని దిగ్భ్రాంత పరిచింది. ఆ తరువాతిదీ ఓ తతంగంగానే ముగిసింది.
ఆ ప్రమాణ పత్రం బహిరంగం కావటంతోనే తనంతటతానుగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గొగోయ్, తాను ఇంకా ఇద్దరు న్యాయమూర్తులు- అంటే ముగ్గురితో కూడిన ధర్మాసనం ఆ మహిళ ఫిర్యాదుపై విచారించింది. అయితే దీనిమీద విమర్శలు చెలరేగటంతో- ముగ్గురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో కూడిన ‘ఇన్-హౌస్ కమిటీ’ని నియమించింది. అది విచారించింది.
అయితే ఈ విచారణ ఎక్స్‌పార్టీగా, అంటే ఆరోపణ చేసిన మహిళ లేకుండానే జరిగింది! దీనికి కారణం.. ఆమెకు న్యాయవాది సహాయం లేకుండా విచారణ జరపబడింది!
అంతేకాకుండా ఆ కమిటీ విచారణ పూర్తిచేసి, తన నిర్ణయాన్ని మట్టుకు బహిరంగంగా ప్రకటించలేదు. దానికి కారణంగా 2003 నాటి కోర్టు తీర్పు తమకు ఆధారమన్నారు.
దీనిపై సంపాదకీయం వ్రాసిన ప్రముఖ ఆంగ్ల పత్రిక ఈ విధంగా వ్యాఖ్యానించింది- Ffor the sake of fairness, the committee, should have suspended its proceedings, the moment the complainant withdrew.
...ఈ మాటలు అంధరి కన్నా న్యాయమూర్తులకే బాగా తెలుసు. ‘న్యాయం జరపటమే కాదు, న్యాయం జరపబడిందని చూచేవారికే అర్థం కావాలి, అన్ని పక్షాలవారికీ వారి వాదనలను వినిపించగలగాలి’.
ఇక్కడ అది జరగలేదు. ‘నాకు న్యాయవాది సహాయం లేదు కాబట్టి, నేనీ విచారణలో పాల్గొనడం లేదు..’ అని ఆ ఉద్యోగిని విచారణకు హాజరుకాకుండానే నిష్క్రమించింది!
కాబట్టి ఒక్కరి పక్షానే్న విని లేదా చూచి- ఈ తీర్పు వెలువడిందని అర్ధమవుతుంది కదా!
ఈ విచారణలో ఒక్కటి తథ్యం. ఆరోపణలు చేసిన ఉద్యోగిని విచారణలో పాల్గొనాలా? వద్దా? ‘ఇన్ హౌస్ కమిటీ’ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గొగోయ్‌ని విచారించిందో లేదో తెలియదు. ముగ్గురు సభ్యుల ధర్మాసనం తీర్పు ప్రకారం గొగోయ్ పూర్తిగా నిర్దోషులు... కాని ఆ తీర్పు ఎవరికీ లభ్యం కాదు.
‘మహిళా ఉద్యోగి ప్రమాణ పత్రాన్ని అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశంగా’ పలు పత్రికలు సంపాదకీయాలు రాశాయి. సెలవురోజున ప్రధాన న్యాయమూర్తి సహా కొలువుతీరిన త్రిసభ్య ధర్మాసనం నుంచి జస్టిస్ గొగోయ్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం లేపాయి. ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని నిర్వీర్యం చేయటమే దీని వెనుక ఉన్న అతి పెద్దశక్తి ఉద్దేశం అంటూ జస్టిస్ గొగోయ్, ఎట్టి పరిస్థితులలోనూ అలా జరగనివ్వనని ప్రకటించిన నేపథ్యంలో- ‘అంతర్గత కమిటీ’ విచారణ జరిపిన విధానం సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా లేదన్న విమర్శలు మీడియాలో హెచ్చు శ్రుతిలోనే వినిపించాయి.
‘చట్టబద్ధ అధికారంతో కాకుండా, నైతికాధిక పరిధిలోనే అంతర్గత విచారణ సాగినందున, ఏ విధంగానూ నివేదిక పొందే వీల్లేదంటున్నారు. పౌరుల చట్టబద్ధ హక్కులకు, కాపలాదారు కావాల్సిన న్యాయ పాలికే నైతిక విచారణలకు పరిమితమైపోతే, ఎవరికి మొరపెట్టుకోవాలిప్పుడు?.. అనే వ్యాఖ్యానాలు వినిపించాయి.
భిన్నాభిప్రాయాలు..
లైంగిక వేధింపులకు ఆధారాలు లేవని చెప్పటం సరైన నిర్ణయమేనని న్యాయ కోవిదుడు సోలీ సొరాబ్జీ అన్నారు. ఫిర్యాదుదారు సాక్ష్యం ఇవ్వకుండా తప్పించుకోవటం సరైంది కాదని అన్నారు. కాని సీల్డ్‌కవరులో ఛీఫ్ జస్టిస్‌కు క్లీన్ చిట్ ఇవ్వటం ఆశ్చర్యం కలిగిస్తోందని ఇంకో న్యాయవాది ప్రశాంతి భూషణ్ వ్యాఖ్యానించారు. ఈ ఉదంతంపై ఆ తరువాత ఇక విమర్శల పరంపర ప్రారంభమైంది. మే 7న మహిళా న్యాయవాదులంతా నిరసనలు తెలిపారు. ‘మీరెంత గొప్పవారైనా చట్టం మీకంటె గొప్పది. ‘నో క్లీన్‌చిట్’ అనే ప్లకార్డులతో దేశ రాజధానిలో ప్రదర్శనలు జరిగాయి.
కేంద్ర సమాచార మాజీ కమీషనర్ మాడభూషి శ్రీ్ధరాచార్యులు ఈ ఉదంతంపై స్పందిస్తూ- సుప్రీం కోర్టు అంతర్గత విచారణ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రఖ్యాత న్యాయవేత్తగా అటార్నీ జనరల్ వేణుగోపాల్‌ను జడ్జిలంతా గౌరవిస్తారు. ఆయన వయస్సు 88 ఏళ్లు. వేధింపుల విచారణకు ఏర్పాటుచేసిన, అంతర్గత కమిటీలో బయటివారు కూడా ఉండాలని ఎ.జి. ప్రతిపాదించారని సమాచారం. ‘పారదర్శకత, నిష్పాక్షికత అనే సూత్రాలను అనుసరించేందుకు కమిటీలో బయటి వ్యక్తులు, ముఖ్యంగా విశ్రాంత న్యాయమూర్తులుండాలని, అప్పుడే ఈ విచారణకు విశ్వసనీయత ఏర్పడుతుందని పేర్కొంటూ ఆయన 22మంది సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు ఒక లేఖ వ్రాశారు.
కాని ఎ.జి. వాదనతో కేంద్రం విభేదించటమే కాకుండా అసంతృప్తి వెల్లడి చేసినట్లు సమాచారం. ‘ఆ లేఖ నా వ్యక్తిగత అభిప్రాయమే కాని ప్రభుత్వ వైఖరి కాదు’ అని పేర్కొంటూ పంపాలని ఆయనపై న్యాయమంత్రిత్వశాఖ ఒత్తిడి తెచ్చిందనీ, దీనితో మరునాడు ఇంకో లేఖ పంపుతూ, ఆ అభిప్రాయాలు తన వ్యక్తిగతమని ఏజీ వేణుగోపాల్ వివరించాల్సి వచ్చింది.
సుప్రీం కోర్టు న్యాయమూర్తులందరికీ తాను లేఖ వ్రాసిన మాట నిజమేనని, అయితే ఏర్పాటు చేయబడిన అంతర్గత కమిటీ న్యాయమూర్తులకు తాను వ్రాయలేదనీ ఆయన వివరించారు. తాను 2 ఉత్తరాలు వ్రాశాననీ, అంటే ఏప్రిల్ 23నే అంతర్గత కమిటీ ఏర్పాటయిందనీ, అంటే తాను తొలి లేఖ వ్రాసిన మరుసటిరోజునే అని వివరించారు. అంటే ఇటు ఉత్తరం వెళ్లటం, అప్పటికే అంతర్గత కమిటీ ఏర్పాటుకావటం జరిగిందన్నమాట.
ఈ ‘బాక్‌గ్రౌండ్’లో వేణుగోపాల్ ఏజీ పదవికి రాజీనామా చేస్తారేమో అనే వార్తలు ప్రచారమవుతున్నాయి!
మొత్తానికి న్యాయవ్యవస్థలో గందరగోళం ఏర్పడింది. మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన- 1950 జనవరి 26 తర్వాత ఇంతటి దుస్థితి ఏర్పడలేదు. అంటే ఏర్పడి 69 సంవత్సరాల తర్వాత మనకీస్థితి ఏర్పడింది. అదీ న్యాయమూర్తుల ప్రవర్తన వల్లనే సుమా! దీనిని ఏమనగలం?
ఇంకో షాకిచ్చే వార్త..
3562 మంది న్యాయవాదులు 31 జిల్లాజడ్జి పదవులకు పరీక్షలు వ్రాశారు తమిళనాడులో. వ్రాసిన వారిలో మున్సిఫ్‌లుగా, సబ్ జడ్జిలుగా పనిచేస్తున్నవారూ ఉన్నారు. నియామకాల సందర్భంగా 8000పైగా దరఖాస్తులు వస్తే, అందులో 3562 మందిని పరీక్షకు అనుమతించారు. కాని వీరిలో ఒక్కరూ పరీక్షలో ఉత్తీర్ణులు కాలేదు. దీనిని ఏమందాం? ఏమిటి మన న్యాయవ్యవస్థ భవిష్యత్!

- చాణక్య