సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తామసిక భక్తునకు ప్రచండాగ్నివంటి విశ్వాసముండును. బందిపోటు దొంగలు దోపిడీ చేయునటుల భగవంతునిపై ఈతడు పశుబలము ప్రయోగింపజూచును. ‘‘ఏమి! నేను వాని నామమును ఉచ్చరించియు పాపినై యుండుటయా! నేను దేవుని బిడ్డను! వాని సంపదకు వారసుడను’’. తామసిక భక్తుని ధోరణి యిటుండును.
770.ప్రశ్న: హఠభక్తియనగా నెట్టిది?
ఉ. నిరంతరము ‘జయ! కాళి’ అని భీకరముగా అరచుచు, భక్తిచే ఉన్మత్తుడగుటయే హఠభక్తి లక్షణము. లేదా చేతులు పైకెత్తి ‘హరి బోల్! హరి బోల్!’ అని కేకలు వేయుచు, పిచ్చివానివలె చిందులు ద్రొక్కుట హఠభక్తికి లక్షణము. ఈ కలియుగమునకు హఠభక్తియే యెక్కువ అనుకూలించునది. శాంత రూపములగు ధ్యానాదులకంటె దీనివలననే శీఘ్రముగా ఫలము గలుగును. భగవానుని కోటను బలాత్కారముగా స్వాధీనము చేసికొనవలయును.
771. ఆత్మపరిశుద్ధికి తోడ్పడు సాధనాంగము లివి:
1) సాధుసంగము, 2) శ్రద్ధ (గురువాక్యాదులందు భక్తి విశ్వాసములు), 3) నిష్ఠ, 4) భక్తి, 5) భావము (్భగవద్భావన యందు తన్మయత్వము), 6) మహాభావము: భావము తీవ్రమైనపుడు మహాభావమనబడును. భక్తుడు పిచ్చివానివలె ఒకప్పుడు నవ్వును, మఱియొకప్పుడు ఏడ్చును. అతడు ఇంద్రియములను సంపూర్ణముగా జయించియుండును, శరీర స్పృహయే వానికుండదు. మహాపురుషులకు లేక అవతారమూర్తులకే కాని జీవులకీదశ సాధారణముగా లభించునది కాదు. 7) ప్రేమ (అఖండమైన భగవద్భక్తి): ఇయ్యది మహాభావమునకు సహచారియై యెప్పును. 1) ప్రపంచస్ఫురణ లేకపోవుట, 2) సంపూర్ణమైన శరీర విస్మృతి ఇవిరుూ స్థితికి చిహ్నములు. ఇయ్యది భగవానుని ముఖాముఖిని దర్శింపజేయును- జీవిత పరమావధిని బొందించును.
772. ‘శాస్తమ్రులు ఈ కర్మములను విధించుచున్నవి, కావున నేను చేయుచున్నాను’’- అనుభావనతోగూడినది వైధభక్తి, ప్రహ్లాదునకువలె అఖండమైన భగవత్ప్రేమచే లభించు మరియొక విధమైన భక్తికలదు- అదియే రాగభక్తి. రాగభక్తి కలుగునపుడు ఇక శాస్త్ర విహిత కర్మములను జేయుటనావశ్యకము.
773. శాస్త్ర విధులననుసరించునది ‘వైధభక్తి’. నియమిత విధుల ననుసరించి నామ జపముచేయుట, ఏకాదశ్యాది పుణ్యతిథులందు ఉపవాసముండుట, తీర్థయాత్రలు చేయుట, శాస్త్రోక్తమైన పూజా ద్రవ్యములతో భగవంతునర్చించుట- ఇట్టి నియమములన్నియు వైధభక్తికి లక్షణములు. చాల కాలమిట్లు సాధనచేసిన యెడల ఉత్తమమగు రాగభక్తి లభించును. వలయునది ప్రేమ-అఖండమైన భక్తి. ఐహికవాంఛలు పూర్తిగా నశించి మనస్సును పదునాఱణాలవంతు (అనగా సంపూర్ణముగా) భగవంతునిపై నిలుపవలయును. అపుడే వానిని పొందనగుదు. రాగభక్తి లేనిదే ఎవ్వరును భగవానుని ప్రాపింపజాలరు.
774. భగవద్భక్తి రెండు విధములు: మొదటిది (శాస్త్రోక్తమైన) వైధభక్తి- ‘్భగవంతునిట్లు పూజింపవలయును, భగవన్నామము ఇన్నిసార్లు జపింపవలయును’- అను నియమములతో గూడుకొని యుండునది. ఇయ్యది పరభక్తిని (తన్మూలమున) సమాధిస్థితి యందు బ్రహ్మసాక్షాత్కరమును లభింపజేయగలదు. అపుడు జీవాత్మ పరమాత్మయందు లయముగాంచును. ఇకనందుండి తిరిగిరాదు. సామాన్య భక్తుల విషయమిట్టిది, కాని భగవదవతార మూర్తుల యొక్కయు ఈశ్వరకోటియొక్కయు విషయము వేఱు. వారి భక్తి శాస్తవ్రిధులచే ఏర్పడునది కాదు. అయ్యది అంతరంగమునుండి వెల్లివిరియును.

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి

- ఇంకాఉంది