సబ్ ఫీచర్

ఇక లాభం లేదు- పేరు మార్చాలి!:దీదీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పశ్చిమ బెంగాల్‌ని అకారాది క్రమంలో వెస్ట్‌బెంగాల్ గానే వ్యవహరించి- వెనక్కి నెట్టేశారు. ఇది తన పరువు ప్రతిష్ఠలకే భంగం అనుకున్న వెస్ట్‌బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీమతి మమతా బెనర్జీ- రాష్ట్రం పేరు మార్చాలని- ఏర్పాట్లు ముమ్మరం చేసింది.
మొన్న డిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రులను అందర్నీ పిలిచి- ఆయా రాష్ట్రాల సమస్యలని తాపీగా తమకు చెప్పుకోమని ప్రధానమంత్రి కోరినప్పుడు దీదీ కలకత్తా నుంచి అమితోత్సాహంతో ఢిల్లీకి, రాష్టప్రతి భవన్‌కి చేరుకుంది. ముఖ్యమంత్రులతో శ్రీ మోదీ భేటి సాగుతూనే వుంది. ఎంతకీ దీదీకి పిలుపు రావటంలేదు. ఆమెకు వొళ్లు మండిపోయింది. 12 గంటలు పడిగాపులు పడవల్సి వచ్చింది. అటు తర్వాత ‘రావొచ్చును’ అన్న పిలుపు రానే వచ్చింది. ‘అమ్మయ్య’ ఈ ‘డిలే’కి కారణం మమతాజీని కించపరచాలని కాదు, ముఖ్యమంత్రుల్ని రాష్ట్రాల పేర్లు ప్రకారం అకారాది క్రమంలో పిలిచారు. ‘వె’ అనేసరికి క్యూలో బాగా వెనకబడిపోయింది. తీరా, అర్థదినం వేచియున్నాకా- అక్కడ శ్రీమాన్ నరేంద్ర మోదీ పనె్నండు అంటే పనె్నండు నిముషాలు మాత్రమే తన గోడు వినిపించుకోడానికి అనుమతినిచ్చారు. ‘దారుణం’ కదా.
ఢిల్లీలోనే ఆమె ‘కథక్కళి’ నృత్యం చేసేదేగానీ ఓ పద్ధతికి తలవొగ్గి వూరుకుంది. తిరిగి కలకత్తాకి పోతూనే ‘‘మన రాష్ట్రం పేరుని పశ్చిమ బంగగా మార్చేసే ఏర్పాట్లు చూడండి’’ అంటూ సిబ్బందికి పురమాయించింది.
వాస్తవానికి ఈ సమస్య 2011 నుంచీ నలుగుతూనే వుంది. రాష్ట్ర, ప్రతిపక్షాలు సహా అంతా ‘పశ్చిమ బంగ’కి ఒప్పేసుకున్నారు గానీ ‘‘కేంద్రం పార్లమెంటులో ఓ ‘బిల్లు’ పెట్టి ఆమోదం పొందాలి. అందాకా నిరీక్షించాలి’’ అంటూ కాలం వెళ్లబుచ్చింది.
అయితే దీనికి కొన్ని కోట్ల రూపాయల ఖర్చవుతుంది? అది ఒక సమస్య. కానీ రుూసారి ఆమె ప్రతిష్ఠ ఢిల్లీలో సాటి ముఖ్యమంత్రులముందు దెబ్బతిన్నది. ఇక ఆగదు. ఆరు నూరయినా వెస్ట్ బెంగాల్ వేదిక ఇండియా మ్యాప్‌లో ‘పశ్చిమ బంగ’యే వుంటుంది’ అన్నది దీదీ పంతం.
‘బంగ్లాదేశం’ అంటే యింకా ముందుకి వస్తుందిగా? క్యూలో! కాని తూర్పు బెంగాల్ అనే బంగ్లాదేశ్ ఒకటి వున్నదే- అంచేత రుూమెకు పడమర దిక్కు తప్పదు. పైగా అంతా యిప్పుడు ‘వేస్ట్ బెంగాల్’ అని ఉచ్ఛరిస్తున్నారు. వాళ్లకి నోరు తిరగదు అంతకన్నా పాపం!