సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

783. ప్రేమభక్తిలో ‘నేను, నాది’అనగా నేను భక్తుడను, భగవంతుడు పూర్తిగా నావాడు అను రెండు భావములునుగలవు. యశోద తానుదక్క మఱెవ్వరును తన గోపాలుని సంరక్షింపలేరనియు తన పోషణ లేనిచో వాని యారోగ్యము చెడుననియు భావించెడిది. కృష్ణుడు జగన్నాథుడని భావింపనామె యెన్నడును ఇష్టపడలేదు. ‘‘్భగవంతుడు నావాడు, నా సొంతము; నా గోపాలుడు!’’ భక్తుని మమత యిట్టిది. ఉద్ధవుడు యశోదతో నిట్లనియెను: ‘‘అమ్మా! నీ కృష్ణుడు సాక్షాత్తు జగదీశ్వరుడు, లోకైక చింతామణి, కృష్ణుడు మానవమాత్రుడు కాడు.’’ ఆ పలుకులు విని యశోద యిట్లనియెను: ‘‘నీ చింతామణిని గూర్చి నే నడుగుట లేదయ్యా! నా గోపాలుడు ఎట్లున్నాడని యడుగుచున్నాను, చింతామణి కేమి లెమ్ము, నా గోపాలుని క్షేమ సమాచారము చెప్పుము.’’
784. ‘ప్రేమ’(పరభక్తి)యేకొలదిమందికో లభించును. వారు ఈశ్వరాదేశముకలవారు, అలౌకిక మహిమాన్వితులు, ఈశ్వర మహిమమునకును ఈశ్వర సంపదకును ‘వారసులగు’వారు ప్రత్యేక వర్గముగ నేర్పడియుందురు. చైతన్య దేవునివంటి అవతారమూర్తులును వీరి యుత్తమ భక్తులగు భగవదంశ సంభూతులును ఈ వర్గములోనివారు.
785. స్వతస్సిద్ధముగా బాల్యమునుండియు ఈ యఖండ ప్రేమతో నొప్పు మహనీయులు గొందఱుందురు. ఔను, ప్రహ్లాదునివలె వారు చిన్ననాటనే భగవంతునికొఱకు పరితపింతురు, విలపింతురు, వారే నిత్యసిద్ధులు, ఆజన్మసిద్ధులు.
785. స్వతస్సిద్ధముగా బాల్యమునుండియు ఈ యఖండ ప్రేమతో నొప్పు మహనీయులు గొందఱుందురు. ఔను, ప్రహ్లాదునివలె వారు చిన్ననాటనే భగవంతునికొఱకు పరితపింతురు, విలపింతురు, వారే నిత్యసిద్ధులు, ఆజన్మసిద్ధులు.

గోపికల ప్రేమ
786. రాధాకృష్ణులు భగవదవతార మూర్తులని మీరు నమ్మకపోయినను సరియే. భగవదవతారములు యథార్థములని కొందఱు (హిందువులవలెను, క్రైస్తవుల వలెను) నమ్మవచ్చును, లేదా మానవ రూపమున గాని మఱియే రూపమున గాని భగవంతుడు అవతరించునని (బ్రాహ్మ సామాజికులవలె) నమ్మకపోయిన పోవచ్చును. కాని (్భగవంతుని యందలి) రుూ యనురాగమునకై ఎల్లరును పరితపింపవలయును. వలయునదీగాఢానురక్తి యొక్కటియే.
787. గోపికల ప్రేమనుగూర్చి ముచ్చటించుచు శ్రీగురుదేవుడు ‘మ’అను నొక శిష్యునకిట్లు తెల్పెను: ‘‘ఆహా! గోపికల ప్రేమయెంత గాఢమైనదో! తమాల వృక్షమును జూచినంతనే వారు ప్రేమోన్మత్తలైరి! (ఏలన తమాల వృక్షముయొక్క శ్యామల వర్ణము వారికి శ్యాముసందరుడగు కృష్ణుని తలపునకు దెచ్చెను.) గారాంగుని (చైతన్యుని) విషయము కూడ నిట్టిదే. ఎదుటనున్న వనమునుగాంచి యాతడు బృందావనమని భావించెను! ఆహా! ఈ ప్రేమయందణుమాత్రము లభించినవాడెంతటి ధన్యుడోకదా! ఏమి ప్రేమపారవశ్యము! ఈ దివ్యప్రేమ వారియందు పరిపూర్ణమై యుండుటయేగాక, నిరంతరము వారి హృదయ సరోవరమునుండి పొరలి ప్రవహించెను.
788. గోపికల నిష్ఠయేమియద్భుతము! శ్రీకృష్ణుడు మధురా నగరముననుండగా గోపికలు ద్వారపాలకులను బతిమాలుకొని సభామందిరమును జేరిరి. అచట కిరీటధారియైయున్న కృష్ణునిగాంచి నేల చూపులు చూచుచు, ‘‘ఈ కిరీటధారి యెవడు? మనము వీనితో మాటలాడతగదు. మాటలాడినయెడ కృష్ణుని యెడ అపచారము చేసినవార మగుదుము. అయ్యో! మనస్వామి యేడి? పీతాంబరమును నెమలి పింఛమును దాల్చు మన ప్రియుడేడి?’’అని తమలోతాము గొణుగుకొనసాగిరి.

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి
- ఇంకాఉంది