సబ్ ఫీచర్

కాలం చెక్కుతున్న నైపుణ్యం ‘కృత్రిమ మేధ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృత్రిమ మేధకు ఆహ్వానం పలికే కాలమిది. కృత్రిమ మేధ అంతటా పరివ్యాప్తమవుతున్న సందర్భమిది. మానవ మేధకు ‘ప్రచ్ఛన్నం’గా కృత్రిమ మేధను అభివృద్ధి పరుస్తున్న సమయమిది. ఈ విషయం అందరి అనుభవంలోకి వస్తోంది. తదనుగుణంగా తమను తాము మలచుకుంటున్న వైనాన్ని సైతం చూస్తున్నాం.
ఈ కృత్రిమ మేధను మరింత మెరుగుపరిచేందుకు గాను నిత్యం కృషి జరుగుతోంది. ఈ నిరంతర కృషి వనె్నకెక్కుతోంది. ఇందులో భాగంగా ‘మైక్రోసాఫ్ట్’ సంస్థ కృత్రిమ మేధ వారోత్సవాన్ని జరుపుతోంది. ఈ సందర్భంగా ఎన్నో సదస్సులు-సమావేశాలు జరుగుతున్నాయి.
కృత్రిమ మేధను ‘డిస్ప్ట్రివ్’ (కల్లోల పరిచే) టెక్నాలజీగా భావిస్తున్నారు. వ్యాపార-వాణిజ్య రంగాల తీరుతెన్నులేగాక మానవ జీవన విధానాన్ని సంపూర్ణంగా మార్చే సాంకేతిక పరిజ్ఞానంగా దీన్ని పరిగణిస్తున్నారు. ఇంత ప్రభావశీలమైన ఈ టెక్నాలజీని- సమాజంపై సానుకూల ప్రభావం చూపేందుకు వీలుగా తీర్చిదిద్దేందుకు ఎన్నో సంస్థలు నడుం బిగించాయి. అందులో మైక్రోసాఫ్ట్ ఒకటి.
హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ విద్యాసంస్థ ఇప్పటికే కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, బ్లాక్‌చైన్, డిజిటల్ లెడ్జర్ టెక్నాలజీలపై ప్రత్యేక కార్యక్రమాల్ని రూపొందిస్తోంది. ఐఐటీ- హైదరాబాద్ కృత్రిమ మేధ ప్రధానాంశంగా బీటెక్‌ను ప్రవేశపెడుతోంది. ఈ విషయమై పరిశ్రమలతో కలిసి పనిచేసేందుకు వివిధ విద్యాసంస్థలు ముందుకొస్తున్నాయి. ఐటీ పరిశ్రమ సైతం ప్రముఖ విద్యాసంస్థలతో అనుసంధానమై తమకు అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టేలా, తమకు అవసరమైన మానవ వనరులను అందుకునేలా ప్రయత్నిస్తోంది. అటు విద్యాసంస్థలు-ఇటు ఐటీ పరిశ్రమ పరస్పరం ఆధారపడి పనిచేసే సంస్కృతి విస్తృతమవుతోంది.
ఇప్పుడు కేవలం ఐటీపైనే పూర్తి ‘్ఫకస్’ పెట్టేవారుగాక జీవితంలోని వివిధ అంశాలను సరైన దృష్టికోణంలో అర్థం చేసుకుని, సృజనాత్మక ఆలోచనలు చేయగల వారికోసం, కృత్రిమ మేధను అభివృద్ధి పరిచే వారికోసం చూస్తున్నారు. ప్రతి రంగంలో కృత్రిమమేధను ఎలా అన్వయించుకోవాలో మార్గదర్శనం వహించేవారి అవసరాన్ని ఐటీ పరిశ్రమ గుర్తించింది. అందులో భాగంగానే అనేక ప్రధాన విద్యాసంస్థల్లో ఆమేరకు మార్పులు చేస్తున్నారు. ఐటీ పరిశ్రమకు ఏది అవసరమో ఆ సబ్జెక్టును విద్యార్థులకు బోధించే, అందించే పనిలో ఆయా విద్యాసంస్థలున్నాయి. ఈ విధానం విద్యార్థులకు సైతం గొప్ప అవకాశాలను తెచ్చిపెడుతోంది. డిమాండ్ గల ‘స్ట్రీమ్’ను ఎంపిక చేసుకోవడం వల్ల ఉద్యోగాలు సులువుగా దొరికే వీలు కనిపిస్తోంది.
ఆ విధంగా కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ రంగంలో ఐటీ పరిశ్రమ విద్యాసంస్థల మధ్యగల అగాధాన్ని- దూరాన్ని తొలగించేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ విషయమై వివిధ విద్యాసంస్థలు వినూత్న కోర్సులకు శ్రీకారం చుట్టాయి.
అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ సమాజంలో ‘మార్పునకు మార్గాలు’అన్న థీమ్‌తో కేసు స్టడీలను ఆహ్వానిస్తోంది. సామాజిక మార్పు కోసం కృషిచేస్తున్నవారిని గుర్తించి గౌరవించేందుకు ఆ విశ్వవిద్యాలయం సిద్ధమైంది. అజీమ్‌ప్రేమ్‌జీ స్వయంగా తన ఫౌండేషన్ తరఫున ఎన్నో విద్య- వైద్య-అభివృద్ధి కార్యక్రమాల్ని చేపడుతున్నారు. సమకాలీన సమాజ అభివృద్ధికి అవసరమైన రీతిలో ప్రాథమిక విద్యాగంధం పేద పిల్లలకు అందాలన్న సమున్నత లక్ష్యంతో ఆయన ఫౌండేషన్ విశేష కృషిచేస్తోంది. అలాగే ఆయన విశ్వవిద్యాలయం ఈతరం విద్యార్థులకు, యువకులకు అవసరమైన ‘విద్య’ను అందించేందుకు, రేపటి సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని సిలబస్‌ను రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విద్యాబోధనలో, సబ్జెక్టుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్న విషయాన్ని పసిగట్టి తదనుగుణంగా ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు స్పందిస్తున్నాయి. నూతన ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తున్నాయి. టెక్నాలజీ ఆధారిత, డిజిటల్ టెక్నాలజీ కేంద్రంగా ‘అధ్యయనం’ కనిపిస్తోంది. విద్యలో స్పష్టమైన మార్పు (పారడిగమ్ షిఫ్ట్) కనిపిస్తోంది.
ప్రాథమిక విద్యనుంచే ఈ దృష్టికోణంలో బోధన ఉన్నప్పుడే సరైన ఫలితాలు లభిస్తాయన్న అవగాహన అందరిలో ఏర్పడింది. తదనుగుణంగానే ఆయా విద్యాసంస్థలు స్పందిస్తున్నాయి. దీని అత్యున్నత రూపమే ‘కృత్రిమమేధ వారోత్సవమ’ని చెప్పుకోవాలి. మనిషి ప్రదర్శించే తెలివిని, బుద్ధిని, జ్ఞానాన్ని కంప్యూటర్లు, యంత్రాలు ప్రదర్శించడానే్న కృత్రిమమేధగా పిలుస్తున్నారు. మనిషి తన జ్ఞానాన్ని-బుద్ధిని, ప్రవర్తనాతీరును ఎలా మలచుకుంటాడో అలాగే కంప్యూటర్లు- యంత్రాలు సైతం తమను తాము సంస్కరించుకుని మెదిలేలా చేసే ప్రయత్నం ఇప్పుడు ముమ్మరంగా జరుగుతోంది. దీనే్న ఒక రకంగా ‘మెషిన్ లెర్నింగ్’అనొచ్చు. ఈ ‘సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్’ ప్రక్రియపై నిపుణులు ప్రాణం పెడుతున్నారు. ఈ ప్రక్రియ ఉన్నతస్థాయికి చేరుకుంటే సమాజంలోని చాలా సమస్యలకు పరిష్కారం సూచించవచ్చని నిపుణుల అభిప్రాయం.
1955 సంవత్సరంలో శ్రీకారం చుట్టుకున్న ఈ కృత్రిమ మేధ ఈ 64 సంవత్సరాల్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. ‘ఆటోమేషన్’కు ‘తావి’లా పనిచేస్తోంది. కొత్త భాషను ఆవిష్కృతం చేసింది. ఓ సరికొత్త సంస్కృతి, పని విధానం పురుడు పోసుకోవడానికి దోహదపడింది.
చురుకైన, తెలివైన, చతురుడైన, బుద్ధికుశలత గల, ఏక సంతాగ్రాహి ప్రదర్శించే జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని, నాజూకుతనాన్ని తదితర మేలైన అంశాలనన్నింటిని సాఫ్ట్‌వేర్ ఆధారంగా కంప్యూటర్లు ప్రదర్శించడమే ఈ కృత్రిమ మేధ.
గతంలో ఐబీఎం సంస్థ మానవ మేధను చదరంగంలో చిత్తుచేసే (చేసిన) సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన విషయాన్ని విస్మరించరాదు. గూగుల్ సంస్థ ‘‘డీప్ మైండ్’’ పేర మరో కార్యక్రమంతో తలమునకలై ఉంది. ఈ విశ్వవ్యాప్త ప్రయత్నంలో హైదరాబాద్ సాంకేతిక నిపుణులకూ స్థానముంది.
క్లౌడ్ కంప్యూటింగ్, డేటా ఇంజినీరింగ్, బిగ్‌డేటా, మెషిన్ లెర్నింగ్, బ్లాక్‌చైన్ తదితర వర్తమాన టెక్నాలజీలపై హైదరాబాద్‌లో అధ్యయనం జరుగుతోంది. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ సర్వీస్ కంపెనీస్ (నాస్‌కామ్) సైతం ఈ రంగంలో మార్గదర్శనం వహిస్తోంది. ఇంకా ఇతర సంస్థలు తమతమ నైపుణ్యాలను అందిస్తున్నాయి.
పెద్ద దృశ్యంలోని చిన్న శకలం మాత్రమే ఇది. ఈ మహాద్భుత ఆవిష్కరణల-ఉద్దీపనల, ఉజ్వల, దేదీప్యమానమైన వెలుగులో ‘నూతన మానవుడి’ ఆవిర్భావం కృత్రిమమేధ నేపధ్యంలో జరుగుతోంది. దీన్ని ఏ కొద్ది పరిజ్ఞానం ఉన్నవారైనా వీక్షించవచ్చు. అనునిత్యం.. అంతటా దాని ఆనవాలు కనిపిస్తోంది కూడా.

-వుప్పల నరసింహం 99857 81799