సబ్ ఫీచర్

రూపు మారిన యజ్ఞాలే హోమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యజ్ఞం లేదా యాగం అనేది వేదకాలంలో విస్తృతంగా ఆచరించిన క్రతువు. మనదేశంలో పురాణకాలం నుండి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. దేవతలకు తృప్తి కలిగించడం యజ్ఞం లక్ష్యం. సాధారణంగా యజ్ఞం అనేది అగ్ని (హోమం) వద్ద వేద మంత్రాల సహితంగా జరుగుతున్నది. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో వేసిన ఆహుతులన్నీ (నెయ్యి, వెన్న, వనస్పతులు వగైరా) దేవతలకు అగ్ని ద్వారా చేరుతాయని, వాటిని వారు స్వీకరించి తమ కోరికలు తీరుస్తాయన్న విశ్వాసం ఈ యోగ కర్మల వెనుక ఉంది. ఈ వైదిక కర్మకాండ పశుపోషక గణ వ్యవస్థకు చెందినది. పశుపోషకులైన ఆనాటి ప్రజలు తమకు పశు సంపద ఇమ్మని, శత్రువులతో జరిగే యుద్ధాలలో విజయం చేకూర్చమని, జలవనరులను పుష్కరంగా ప్రసాదించమని వివిధ రకాల పేర్లతో యజ్ఞాలు చేసేవారు. యజ్ఞబలి పేరుతో జంతువులను వధించేవారు. కొండకచో పురుషమేధ యాగం పేరుతో నరబలి కూడా ఇచ్చేవారు.. ప్రకృతికి ప్రాతినిధ్యం వహించే ఇంద్రాది దేవతలుగా బలులను స్వీకరించి తమకు మేలు చేస్తారని గుడ్డిగా నమ్మారు. రోజుల తరబడి యాగాలు చేస్తూ వేలాది జంతువులను బలిచ్చి వాటి మాంసాన్ని యదేచ్ఛగా భుజించేవారు. యజ్ఞం చేయడం, యజ్ఞానంతరం భారీగా బ్రాహ్మణులకు దానధర్మాలు చేయడం ఒక కార్యంగా రూపుదిద్దుకుంది.
కాలక్రమేణా పశుపోషణతోపాటు వ్యవసాయం కూడా ప్రజల జీవనోపాధికి ఒక ప్రధానమార్గంగా రూపొందింది. పురాణకాలం నాటికి పశువులను ముఖ్యంగా ఆవులను ఆహారం కొరకు కాకుండా వాటినుంచి లభించే పాలు, పెరుగు, నెయ్యిని ఆహారంగా, ఎద్దులను వ్యవసాయానికి ఉపయోగించుకుంటూ బతికే వర్గం లబ్దిపొందడం మొదలైంది. వీరు ఆనాడే యజ్ఞయాగాదుల పేరుతో జరిగే గోవధను, దాన ధర్మాలను నిరసించారు. ప్రజల హితం కోరే లోకాయతులు, చార్వాకులు, యజ్ఞాలను తద్వారా జంతు హింసలను తీవ్రంగా వ్యతిరేకించారు.
‘‘నాస్తిదత్తం, నాస్తిహతం, నాస్తిపరలోకం అంటే దానానికి పరమార్ధం లేదు. యజ్ఞనైవేద్యాలకు విలువ లేదు. పరలోకమనేది లేనేలేదు’’ అని ప్రచారం చేశారు. యజ్ఞాలలో వాడే శమి, దర్భ వంటి వృక్షాలను, గడ్డిని తినే ఇంద్రుడు దేవుడైతే ఆకులను, అలములను తినే జంతువు అతనికంటే చాలా గొప్పది. ఉన్నతమైనది. అలాగే యజ్ఞంలో బలి ఇచ్చిన జంతువు నిజంగా స్వర్గానికి చేరుతున్నట్లయితే యజ్ఞం చేసేవాడు వాడి తండ్రినే యజ్ఞపశువుగా బలియివ్వలేదు?’’ అని ప్రశ్నించారు. అదే సమయంలో బౌద్ధం, జైనం జీవహింసకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ బలపడ్డాయి.
తర్వాతికాలంలో క్రమంగా యజ్ఞయాగాదుల స్థానాన్ని పూజలు, హోమాలు ఆక్రమించాయి. దేవతల రాజు యజ్ఞపురుషుడు ఇంద్రుడు స్థాయి దిగజారిపోయింది. ఈయనతో పాటు అగ్ని, వాయువు, పూషా, రోగా, అశ్వినీ దేవతల వంటి వేదకాలం నాటి ఋజ్ఞదేవతలు అందరూ కాలగర్భంలో కలిసిపోయారు. గోవు పరమ పవిత్రమైన ప్రాణిగా, గోమాతగా కీర్తించబడింది. గోహత్య మహాపాతకంగా చెప్పబడింది. వైదిక మతాచారాల స్థానంలో వైష్ణవ, శైవ, భక్తిమతాలు పుట్టుకు వచ్చి ఆయా మత సంబంధ యాగాలు, పూజలు పుట్టుకొచ్చాయి. ఇవి ఈనాడు వివిధ పేర్లతో చెలామణి అవుతున్నాయి. జంతుబలుల స్థానంలో గుమ్మడికాయ, ఎర్రనీళ్లు, కొబ్బరికాయ, నిమ్మకాయ వంటివి ప్రవేశించాయి. ఇలా పుట్టుకువచ్చినదే అయుత చండీయాగం.

-చెన్న మాధవుని రామరాజు, జనవిజ్ఞానవేదిక సెల్: 9441967100