సబ్ ఫీచర్

శక్తి కేంద్రాలు.. శబ్ద తరంగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు
7-8-51,్ఫ్లట్ నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2
హైదరాబాద్- 500079

సనాతనమైన వేద మంత్ర వాఙ్మయమంతా సంస్కృత భాషా మాధ్యమంగా నిక్షిప్తమై వుంది. మంత్రం యొక్క శక్తి దాని శబ్దమందు నిక్షిప్తమైవుంది. ధ్వని లేక శబ్ద ప్రకంపనల ప్రభావాన్ని ఆధునిక శాస్త్ర ప్రపంచం గుర్తించింది. అందువల్లనే పాశ్చత్య దేశాలు ఈ విషయంలో అనేక పరిశోధనలు చేస్తున్నాయి. ధ్వని ప్రకంపనాల విస్తృతి ప్రతి అణువులోని శక్తిని ప్రచోదనం చేస్తుందని చెప్తున్నారు. తద్వారా విశ్వ వ్యవస్థలో ఎంతో కొంత ప్రభావం వుంటుంది. నిర్దిష్టమైన, ఉదాత్త అనుదాత్త స్వరాలు నిబిడీతమైన సంస్కృత భాష వేదమంత్రములకే కాక, కంప్యూటర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్‌గా కూడా విశిష్టతను సంతరించుకున్నది. దేవభాష, వేదభాషయైన సంస్కృతంవేల సంవత్సరాలు గడచినా జవసత్వాలను కోల్పోకుండా, భారతదేశంలో ప్రాభావం తగ్గినా పాశ్చాత్య దేశాలలో ప్రాభవాన్ని పెంచుకుంటోంది. ప్రపంచానికి ప్రశాంతిని, నిజమైన ప్రగతిని అందించగల శక్తివంతమైన మాధ్యమం సంస్కృతమని ప్రఖ్యాత నాసా శాస్తవ్రేత్త రిక్‌బ్రిగ్స్ అన్నారు. అందుకే మన పెద్దలు ‘జనని సంస్కృతంబు సకల భాషలకును’ అని చెప్పారేమో! ఇపుడు విశ్వవిద్యాలయాలలో సంస్కృత విద్యాపీఠాలేర్పడ్డాయి. యజ్ఞ సంబంధ మంత్ర ధ్వని ప్రభావాన్ని ఆధునిక సాంకేతిక ప్రక్రియలద్వారా అధ్యయనాలు చేస్తున్నారు.
వేదమంత్రాలు సాధారణ శబ్దాలు కావు. అవి తత్ సంబంధమైన విశ్వశక్తి కేంద్రాలనుండి వెలువడుతున్న జీవ పోషకమైన ధ్వని లేక నాద తరంగాలతో నిండియున్న విధంగా ఆయా మంత్రాలు ఏర్పడివున్నాయి. ఉదాహరణకు గాయత్రీ మంత్రం చూడండి- ఈ మంత్రానికి సంబంధించిన విశ్వశక్తి కేంద్రం సూర్యమండలం. ఈ మంత్రోచ్ఛారణ వల్ల వెలువడే శబ్ద తరంగాలు కేవలం మానవ బుద్ధికేకాక, పశు పక్ష్యాదులకు, మొక్కలకు కూడా ఉత్తేజాన్ని, ప్రశాంతతని ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. పరిసర వాతావరణంలో నిర్దిష్ట శక్తి తరంగాలను నింపుతున్నాయి. అట్లాగే ఋత్విక్కులు యజ్ఞ యాగాది క్రతువులలో, నిర్దిష్టమైన పద్ధతిలో, నియమానుసారంగా వేద మంత్రాలను గానం చేస్తారు. దీనివల్ల పరిసరాలకు పరిపుష్టిని కలిగించి సంబంధిత వ్యక్తులకు సమాజానికి మేలు చేస్తుంది. మంత్రోచ్ఛారణ లేకుండా హవిస్సును అగ్నిహోత్రంలో సమర్పించడవంల్ల పరిమిత ప్రయోజనమే కలుగుతుంది. యజ్ఞ ద్రవ్యాలను హవిస్సును సమంత్రపూర్వకంగా అగ్నిహోత్రానికి సమర్పిస్తే ఆయా పదార్థ నిహితమైన శక్తి బహుముఖంగా విస్తరించి ఔషధులకంటే అధికమైన ఫలితాన్నివ్వడమే కాక వాతవారణాన్ని పరిశుభ్రంచేస్తుంది. యజ్ఞ సమయంలో ఎక్కువమంది వేదపండితులొకేసారి లయబద్ధంగా స్వర యుక్తగా మంత్రోచ్ఛారణ చేయడంవల్ల మంత్రశక్తి తరంగాలు మరింతగా విస్తరించి ఎక్కువ ఫలితాన్నిస్తాయి. మంత్ర ధ్వని తరంగాల సంఖ్య పెరగడంవల్ల తత్సంబంధమైన మంత్ర విశ్వశక్తి కేంద్రం నుండి ప్రసరణమయ్యే శక్తి తరంగాలతో సంలీనం చెంది ఎక్కవ ప్రభావం కలుగుతుంది. యజ్ఞ మంత్ర ధ్వని తరంగాలు ఊర్థ్వముఖంగా, వృత్తాకారంగా విస్తరించడంవల్ల అంతరిక్ష క్షాళన జరిగి విశ్వానికి ప్రశాంతత ఏర్పడుతుంది. నేడు మనం ఉత్పత్తిచేసే ఉద్గారాలు, విషవాయువులవల్ల మొత్తం వాతవారణం కలుషితమవడంవల్ల కలిగే దుష్ప్రభావాలను మనం అనుభవిస్తున్నాం కదా! హోమద్రవ్య ధూమం, పరిసరాల కాలుష్యాన్ని నివారించి, పరిశుభ్రం చేయగలగడం మనమెరిగినదే. ఈ సందర్భంగా పాఠకులు, భోపాల్‌లో జరిగిన విషవాయు సంఘటన ఉదంతం. అచ్చట నిత్యాగ్నిహోత్రుల కుటుంబాలు రక్షించబడటం గమనించవచ్చు.
జపమనునది వాక్కుకు సంబంధించిన నిష్టతో చేయవలసిన ఉపాసన. మానవుడికి మనస్సు, వాక్కు, చేష్ట అను మూడు కరణములున్నాయి. వీటిని ఒకే త్రాటిమీద నిలపడాన్ని త్రికరణశుద్ధి అంటున్నాము. వీనిని ఉద్దీపింపజేయుటలో ఎక్కువగా ఉపయోగపడేది జపం. ఇట్టి జపంవల్ల రెండు రకాల ఫలితాలుంటాయి. ఒకటి ధ్యానించదలచిన వస్తువును లేక విషయాన్ని వాక్కుచేత పట్టుకుని ప్రయోజనం పొందడం కాగా, రెండవది వ్యర్థమైన ప్రమాదకరమైన మాటలను ప్రసంగములను పరిహరించడం తద్వారా పొందదలచిన ఫలితాన్ని శ్రీఘ్రంగా పొందగలగటం.

- ఇంకాఉంది

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9849560014