సబ్ ఫీచర్

అతి వద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలంకరణ విషయంలో తెలిసీ తెలియక పొరపాట్లు చేస్తుంటారు చాలామంది. ఈ పొరపాట్లు చర్మ సమస్యలను పెంచుతాయి. సాధారణంగా మనం చేసే పొరపాట్లు ఏంటో, వాటిని ఎలా దిద్దుకోవాలో చూద్దాం..
* కొంతమంది అదేపనిగా కనుబొమల్ని తీర్చిదిద్దుకుంటుంటారు. అందుకోసం అదేపనిగా బ్యూటీపార్లర్లకు వెళుతుంటారు. ఒకవేళ పార్లర్లకి వెళ్లే సమయం లేకపోతే ప్లక్కర్ వంటి చిన్న పరికరంతో వాటిని లాగేసే ప్రయత్నం చేస్తుంటారు. కనుబొమలు పలుచగా ఉన్నట్లయితే ఆ రోమాలను కొద్దిగా తీసేసినా అవి పలుచగా కనిపిస్తాయి. దాంతో ముఖం పెద్దగా వయసు పైబడినట్లుగా మారుతుంది. ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. కాబట్టి వీటికోసం ప్రత్యేకంగా ఉండే జెల్‌ను రాసుకోవాలి. దాంతో కనుబొమలు దట్టంగానే కాదు, ప్రత్యేక ఆకృతిలో కూడా కనిపిస్తాయి.
* కళ్లు ఎర్రగా మారినప్పుడు కంట్లో ఏదో పడిందని అనుకుంటాం. నీళ్లతో కళ్లను శుభ్రం చేసుకుని వదిలేస్తాం. కానీ అన్నిసార్లూ దుమ్మూ ధూళే కారణం కాదు. మనం కళ్ల అలంకరణకు ఉపయోగించే బ్రష్‌లని సరిగా శుభ్రం చేయకపోవడం కూడా ఈ సమస్యల్ని తెచ్చిపెడుతుంది. వాడిన ప్రతిసారీ కాకపోయినా వారానికి ఒకసారైనా వాటిని షాంపూతో కడగాలి. లేకపోతే వాటిపై వృద్ధి చెందే క్రిముల వల్ల కళ్ల దురద, ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
* మనం చేతివేళ్లతో కంప్యూటర్ కీ బోర్డును ఉపయోగిస్తుంటాం. అంట్లు తోముతాం, బట్టలుతుకుతాం.. ఇలా చేతులతో ఎన్నో పనులను చేస్తుంటాం. కానీ ఆ చేతుల్నే యథాలాపంగా ముఖంపై పెట్టేస్తుంటాం. దీనివల్ల వేళ్లపై ఉన్న క్రిములు ముఖంలోకి చేరి చర్మరంధ్రాలను మూసేసాయి. దాంతో మొటిమలు వస్తాయి. కాబట్టి ముఖంపై పదే పదే చేతులు పెట్టుకునే అలవాటుని మానుకోవడం మంచిది. అలాగే అలంకరణకు ముందూ చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి.
* ఎంతో ఖరీదు పెట్టి కొన్నాం కదా అని అయిపోయేవరకూ అలంకరణ వస్తువులని వాడుకోవాలని అనుకోవద్దు. ఎందుకంటే మస్కారా, ఫౌండేషన్, కాటుక వంటి ఉత్పత్తుల జీవితకాలం ఆరునెలలు మాత్రమే. కాబట్టి వీటిని ఆరునెలల కాలం మించి వాడకపోవడం మంచిది.
* రాత్రి పడుకునేముందు ఎటువంటి పరిస్థితుల్లో అయినా మేకప్ తీసేసి పడుకోవడం అలవాటుగా మార్చుకోవాలి. ఇంకాస్త ఓపిక ఉంటే తప్పనిసరిగా మాయిశ్చరైజర్ పూసుకోవడం వల్ల ముఖ చర్మం దెబ్బతినకుండా ఉంటుంది.
* కొంతమంది గోర్ల రంగులను కూడా ఎప్పటెప్పటివో వాడుతుంటారు. ఇవి కూడా ఆరు లేదా ఎనిమిది నెలలకు ఒకసారి పడేయాలి. అంతకుమించి వాడకూడదు. ఎక్కువ సంవత్సరాలు వాడటం వల్ల వీటిలోని కెమికల్ గోర్లను దెబ్బతీస్తుంది.