సబ్ ఫీచర్

మూల్యం చెల్లిస్తున్న బాల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో రోజురోజుకీ బాల కార్మికులు వేలు, లక్షల్లో పెరిగిపోతున్నారు. హోటల్స్, ఇటుకబట్టీల్లో, సినిమా థియేటర్లలో, కిరాణా దుకాణాల్లో, బ్రాందీ షాపుల్లో.. ఎక్కడ చూసినా బాలకార్మికులు కనిపిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బాల కార్మికులు 24.6 కోట్లమంది ఉన్నారు. వారంతా 2003వ సం. వరకు లెక్కల్లోనివారే. మరి 2003 నుండి 2019 సం. వరకు దాదాపు 16 సంవత్సరాల్లో ఇంకెందరు పిల్లలు బాల కార్మికులుగా మారారో ఊహించలేము. 24.6 కోట్లమంది బాల కార్మికులంటే అప్పటి అమెరికా జనాభాకు సమానం. అంటే ఈ బాల కార్మిక సమస్య అనేది ఎంతటి తీవ్రమైందో ఊహకు కూడా అందనిది. ఏ ఒక్క దేశంలోనో, రాష్ట్రంలోనో కాదు ప్రపంచం మొత్తంమీద ఈ బాల కార్మికులు, వారి సమస్యలు ఉన్నాయి. కొన్ని దేశాల్లోనైతే పిల్లల అక్రమ రవాణా ద్వారా వేరే దేశాలకు తరలించి నానా హింసలు పెడుతూ వారి ద్వారా డబ్బు సంపాదించుకునే ముఠాలకు అమ్మేస్తున్నారు. ఇలాంటి వ్యాపారాలు కోట్లలో జరుగుతున్నాయి. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినంగా పాటించాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ 2002 సంవత్సరంలో ప్రతి సంవత్సరం జూన్ 12గా నిర్ణయించింది.
అదేవిధంగా 2003వ సం.లో పిల్లలయొక్క అక్రమ రవాణా అరికట్టడంపై దృష్టి కేంద్రీకరించాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కరువు పరిస్థితులవల్ల కన్న తల్లిదండ్రులకే ఏవో మాయమాటలు చెప్పి పిల్లలను చదివిస్తామని చెప్పి, డబ్బు ఆశ చూపి వారిని కొని విదేశాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. ఇక ఆడపిల్లలనైతే వ్యభిచార రొంపిలోకి దింపి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. అభివృద్ధి చెందని దేశాల్లోనే కాదు.. అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఇలాంటి బాలకార్మికులు ఉన్నారు. బాల కార్మికులతో పనిచేయించుకునే దుకాణదారులను, యజమానులను శిక్షించేందుకు జరిమానాలే కాకుండా బాల కార్మికులను ఆశ్రయించే శరణాలయాలకు భారీ ఎత్తున విరాళాలు ఇచ్చేవిధంగా చేసినట్లయితే కొంతమేరకు బాల కార్మిక వ్యవస్థను అరికట్టవచ్చు.
బాలకార్మికులతో పనిచేయించుకోవడంలో ముఖ్య ఉద్దేశ్యం తక్కువ జీతానికి ఎక్కువ పనిచేయించుకోవచ్చనేదే. ఇదంతా శ్రోమ దోపిడీ అవుతుంది. అభివృద్ధి చెందిన దేశాలు కూడా వీధిబాలలను, బాల కార్మికులను లేకుండా చేయలేకపోతున్నాయి. ఇలాగే ఇంకొంతకాలం గడిచినట్లయితే బాలకార్మికుల జనాభా వృద్ధిరేటు సగటున పెరిగిపోయే అవకాశముంది.
బాల కార్మికులు పెరిగిపోవడానికి ముఖ్యకారణం ప్రభుత్వాలే కాదు తల్లిదండ్రుల పాత్రే ఎక్కువగా వుంటోంది. పిల్లలను క్రమశిక్షణతో పెంచక, చదువు చెప్పించే ప్రయత్నం చేయకపోవడం, వారిని పనుల్లో పెట్టించి వారి ద్వారా వచ్చే డబ్బులను కూడా కుటుంబ అవసరాలకు వాడుకుంటున్నారు. కాబట్టి బాలకార్మిక వ్యవస్థను రూపుమాపే ప్రయత్నాలతోపాటు దానికన్నా ముందు పేదరిక నిర్మూలన చెయ్యాలి. పేదరికం పెరిగిపోవడంవల్లనే బాల కార్మికులు వయస్సు పెరిగే కొద్దీ సంఘ విద్రోహ శక్తులుగా మారే అవకాశం వుంది. ఈ వ్యవస్థను రూపుమాపాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వాటితోపాటు సమాజంలో ప్రతి ఒక్కరిమీదా వుంది. దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడాల్సిన పసిహృదయాల మేధస్సు బాల్యంలోనే త్రుంచివేయబడుతోంది. వారిని మంచి చదువుతో గొప్ప శాస్తవ్రేత్తలుగా, అధికారులుగా, సంఘ సేవకులుగా తయారుచేయాలి.
ప్రపంచ దేశాలు బాల కార్మిక వ్యవస్థపై దృష్టి సారించి బాల కార్మిక చట్టాలను పటిష్టం చేస్తే కొంతవరకైనా నిర్మూలించవచ్చు.

- శ్రీనివాస్ పర్వతాల 85001 22910