సబ్ ఫీచర్

మనసు మాట విందాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచీ రకరకాల పనులతో ఉరుకులు పరుగులు పెడతాం. దాంతో అలసట, చిరాకు, ఒత్తిడి వంటివి తప్పవు. వాటన్నిటి నుంచీ బయటపడాలంటే అప్పుడప్పుడూ మనసు మాట వినాల్సిందే.. అప్పుడు నిత్యం.. సంతోషంగా ఉండగలం.
* నిత్యం బిజీగా ఉండటం వల్ల అలసట, ఒత్తిడి తప్పవు. వాటినుంచి బయటపడాలంటే కుదిరినప్పుడల్లా స్నేహితులతో గడిపేలా చూసుకోవాలి. వారితో కాసేపు ఆహ్లాదకరంగా మాట్లాడితే చాలు.. అవి మీలో ఎంతో మార్పును తీసుకువస్తుంది.
* ప్రతిరోజూ మీకోసం మీరు కచ్చితంగా కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ముఖ్యంగా నచ్చిన పని చేసేందుకు ప్రయత్నించాలి. వ్యక్తిగత ఆరోగ్యం, అందం, ఆహార్యం.. ఇలా అన్నింటిపైనా దృష్టి పెట్టాలి.
* వ్యాయామం మానసిక ఒత్తిడిని, అలసటను తగ్గించి శారీరక దృఢత్వాన్ని పెంచుతుంది. వ్యాయామం చేయాలని మనకు ఉన్నా.. ఇతర పనుల కారణంగా మానేస్తుంటాం. కానీ తప్పనిసరిగా వ్యాయామం చేసేలా చూడండి. వారమంతా, రోజూ అరగంటపాటు చేయాలనేం లేదు. కనీసం అయిదు రోజుల పాటు వ్యాయామం చేసినా చాలు. అలాగే రోజంతా పది నిముషాల చొప్పున అరగంటపాటు పూర్తయ్యేలా ఏదో ఒక వ్యాయామం చేయొచ్చు.
* కొన్నిసార్లు చిన్న చిన్న పనులే ఆనందాన్ని కలిగిస్తాయి. తీరిక ఉన్నప్పుడల్లా చేసే ఓ సేవ, ఒకప్పటి స్నేహితులతో మాట్లాడటం, సహోద్యోగులతో కలిపి ఓ కప్పు కాఫీ తాగండి.. మనసులో ఒత్తిడి, ఉద్యోగం ద్వారా వచ్చిన ఒత్తిడి దూరమై సంతోషం కలుగుతుంది.
* శరీరానికి కాస్తంత విశ్రాంతి కావాలని మనసు కోరుకుంటే, తప్పనిసరిగా పనుల నుండి విరామం తీసుకోవాలి. ఆ సమయంలో మనసుకు నచ్చిన పనులను చేయాలి. తోటపని, పుస్తక పఠనం, వంటలు.. వంటివన్నీ ప్రశాంతతను అందిస్తాయి.
* రోజువారీ ఎదురయ్యే ఉద్వేగాలు, ఆలోచనలు కుదిరినప్పుడల్లా ఒక చోట రాయాలి. ఉద్వేగాలు, ప్రతికూల ఆలోచనలు అయితే ఎలా అధిగమించాలి అనేది చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల అప్పటికప్పుడు కాకపోయినా క్రమంగా మార్పు వస్తుంది.
* బజార్లోకి కొత్తగా వచ్చే రకరకాల దుస్తులు, ఇతర యాక్సెసిరీస్‌ల కోసం తరచూ తెలుసుకోవడం, విండోషాపింగ్‌లు కూడా కొంతమందికి మానసిక సంతోషాన్ని కలిగిస్తాయి.
* పుస్తక పఠనంపై దృష్టి పెట్టాలి. రోజుకు కనీసం అరగంట చదివినా చాలు.. మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న గందరగోళ ఆలోచనలన్నీ దూరమవుతాయి. ఒత్తిడి కూడా పోయి మానసిక స్వాంతన కలుగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
* నచ్చిన పని చేసినా ఆనందం సొంతమవుతుంది.
* ఏదైనా పనిలో విజయం సాధించినా.. అది చిన్నదైనా కానీ దాన్ని మనసుకే పరిమితం చేసుకోకూడదు. నలుగురికీ చెప్పే ప్రయత్నం చేయాలి. కొందరు దాన్ని ప్రచారం అనుకోవచ్చు. కానీ అది కూడా ఒక్కోసారి ఆనందాన్ని కలిగిస్తుంది.
ఇలా తెలియకుండానే వేసే చిన్న చిన్న అడుగులు ఆరోగ్యాన్ని, మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి.