సబ్ ఫీచర్

చీర.. ఆకట్టుకునేలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరికిణీ జాకెట్టు, పరికిణీ ఓణీ, చీర.. ఇవీ మన సంప్రదాయ వస్తధ్రారణలు. కాలక్రమంలో వీటి స్థానంలో చాలానే వచ్చి చేరాయి. చేసే ఉద్యోగాలకు అనుగుణంగా నేటి వస్తధ్రారణ మారింది. ఎంత మారినా సంప్రదాయ సందర్భాల్లో చీరనే కట్టుకుంటోంది నేటి యువతి. అయితే చీరకు ఆధునికతను అద్దుతోంది ఈ తరం. అందుకే ప్రత్యేక సందర్భం అని కూడా చూడకుండా వీలున్నప్పుడల్లా చీరకట్టును ఎంచుకుంటున్నారు అమ్మాయిలు. ఈ చీరకట్టులో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఎంతగా అంటే.. చీరకట్టు కూడా ఓ వృత్తిలా మారేంతగా.. మునుపు ఇంటిపక్కనవారో, బంధువులో కొత్తగా చీరకట్టుకునే అమ్మాయికి సాయం చేస్తారు. కానీ నేడు అమ్మాయి ఇలా కాకుండా మరింత కొత్తగా కనిపించాలని తాపత్రయపడుతోంది. అందుకే నేడు చీరకట్టును వినూత్నంగా, విభిన్న రకాలుగా కట్టడానికి బోలెడంతమంది నిపుణులు ఉన్నారు. చీరతో విభిన్నంగా కనిపించాలనుకునేవారికి శారీడ్రేపర్స్ మద్దతునిస్తారు. వీరు మన అభిరుచులకు తగినట్లు చీర కడతారు. ప్రముఖుల ఇళ్లలో వివాహాది వేడుకలకు దుస్తుల డిజైనర్లతో పాటు శారీ డ్రేపర్లను కూడా ఆహ్వానిస్తారు. అలాంటివారిలో ముందువరుసలో నిలుస్తుంది కోల్‌కతాకు చెందిన డాలీజైన్. ఈమె చీరకట్టుపై చాలా రకాల ప్రయోగాలు చేసింది. చాలా వేడుకల్లో చీర కట్టుకునేవారికి సాయం చేసింది. అలా చివరికి దానే్న వృత్తిగా ఎంచుకుంది. ఇప్పుడు చీరను 125 రకాలు కట్టి ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు’ను సొంతం చేసుకుంది. అలాగే ఒకేరోజులో 370 రకాల్లో చీరను కట్టి ‘యూనిక్ వరల్డ్ రికార్డు’ను సొంతం చేసుకుంది. లెహెంగాకు చీరకట్టును అనుసంధానించి హిప్‌హాప్, టైట్‌ఫిట్, ఫిష్‌స్టైల్స్‌లో 300 రకాలుగా చేసిన ప్రయోగాలు ఆమెకు ‘ ఇండియా బుక్ ఆఫ్ రికార్డు’ను తెచ్చిపెట్టాయి. ఇప్పుడు డాలీజైన్ దాదాపు 325 రకాల్లో చీరను కట్టగలదు.
ఈ రోజుల్లో దేని మీదకైనా చీరను జత చేయొచ్చు. అంటే జీన్స్ ప్యాంట్, పలానో, ఫ్లోర్ లెంగ్త్ గౌన్, ధోతీ, పటియాలా, లెహెంగా... ఇలా.. దేనిమీదైనా చీరను కట్టొచ్చు. రెండు చీరలు కలిపి, వాటిపై దుపట్టా ధరించి అదనపు హంగు తేవొచ్చు కూడా. లెహెంగాకు జతగా చీరను కట్టుకుని నడుముకు గొలుసును పెట్టుకోవడం నేటి ట్రెండ్. ఆరుగజాల చీరకు ఫ్యాషన్ తోడైతే అది నయా స్టైలే కదా మరి..
సందర్భానుసారంగా చీరలను ఎంచుకోవాలి. కంచి, ధర్మవరం, బెనారస్, ఆర్గంజా, సిల్క్ కాటన్ వంటి చీరల్ని ఇష్టపడనివారు ఎవరుంటారు? అయితే ఎవరు ఎలాంటి చీరలు కట్టుకుంటే బాగుంటుందో చూద్దాం..
* సన్నగా ఉన్నవాళ్లు కాటన్, పట్టు వంటి చీరలను ఎంచుకుంటే బాగుంటుంది.
* లావుగా ఉన్నవారు తేలికైన అంచులున్న బాందినీ, మైసూరు సిల్క్ వంటి చీరలను కట్టుకోవాలి.
* కాటన్, ఆర్గంజా వంటివి లావుగా ఉన్నవారిని మరింత భారీగా కనిపించేలా చేస్తాయి. కాబట్టి సన్నగా కనిపించాలనుకునేవారు తేలిగ్గా ఉండే షిఫాన్, జార్జెట్, సిల్క్, క్రేప్.. వంటివాటిని ఎంచుకోవాలి.
* పెద్ద ప్రింట్లున్న చీరలంటే ఇష్టంగా ఉన్నా చిన్న చిన్న ప్రింట్లు, తక్కువ డిజైన్లు, తక్కువ ఎంబ్రాయిడరీ ఉన్నవాటిని ఎంచుకుంటే సన్నగా కనిపించవచ్చు.
* పెద్దపెద్ద అంచులు చూడటానికి చాలా బాగున్నా కూడా సన్నగా కనిపించాలనుకున్న వాళ్లకి సన్నని అంచులున్న చీరలు బాగుంటాయి.
* సన్నగా కనిపించాలనుకునేవారు ఎక్కువ కుచ్చిళ్లు పోసుకోకుండా చీర కట్టుకోవాలి.
* శరీరాకృతి భిన్నంగా ఉన్నవారు ఆధునిక స్టైల్‌లో చీర కట్టుకోవాలనుకుంటే పొడవైన జాకెట్టుతోపాటు, ఎడమవైపునకు వచ్చేలా కుచ్చిళ్లను అమర్చుకుంటే ట్రెండీగా ఉంటుంది.