సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వవస్తువులును నారాయణుని వివిధ రూపములు, వాని యనంత విభూతులు.
892. భగవానుడిట్లనును: ‘‘కాటువేయు పాము నేనే. విషము తొలగించు మాంత్రికుడను నేనే; శిక్షల విధించు దండనాధికారిని నేనే, ఆ శిక్షలను నెఱపు కింకరుడను నేనే.’’.
893. వివిధ జంతువులలో దివ్యశక్తి వివిధముగా వ్యక్తమగుచున్నది; ఏలన ఏకత్వముగాదు, భిన్నత్వమే సృష్ట్ధిర్మము; భగవంతుడు సర్వాంతర్యామి. చిన్న చీమయందును భగవంతుడు కలడు. భేదమంతయు ప్రకాశమున మాత్రమే.
894. ఎవ్వరిని అనేకులు గౌరవింతురో పూజింతురో, అనుసరింతురో- వారియందే దివ్యశక్తి విశేషముగా ప్రకాశించుచుండును. అట్టి ప్రతిభ లేనివారియందు తక్కువగానుండును.
895. భగవంతుడీ స్థూల శరీరమున నెటులుండును? చిమ్మనగొట్టములోని కాడవలెనుండును. శరీరమున నుండియు భగవంతుడు దాని నంటకుండును.
బ్రహ్మము: మానవుని ధార్మిక బాధ్యత
896. ప్రశ్న: సర్వము భగవంతుడే ఐనయెడల ఇక పుణ్యపాపములనునవి లేవా?
ఉ. ఉండను ఉన్నవి, లేను లేవు. మనలోని అహంకారము నాతడు నిలిపియుంచునంతవఱకు ద్వైతభావమును పుణ్యపాప విచక్షణనుగూడ నిలిపియుంచును. కాని యొక్కొక్కప్పుడాతడు కొందఱి యహంకారమును నిర్మూలించును; అట్టివారు సమస్త పుణ్యపాపములకును అతీతులగుదురు. నరునకు బ్రహ్మసాక్షాత్కారము కానంతవఱకు ద్వైతభావమును పుణ్యపాప విచక్షణము ఉండి తీరవలయును. పుణ్యపాపములును కీడుమేళ్లును సర్వము నీకు సమానమేయనియు భగవంతుడేమి చేయించిన, అది చేయుచున్నాననియు నీవు చెప్పవచ్చును. కాని ఇవన్నియు వట్టి చిలుకపలుకులని నీ యంతరంగమున నెఱిగియే యుందువు. నీవే దేని దుష్కార్యమును జేయగనే నీ యంతరాత్మ నిన్ను బాధించుచునే యుండును.
897. ప్రశ్న: ఏ పని చేయుటకైనను భగవంతుడే ప్రేరేపించుచున్న పక్షమున నా పాపమునకు నేనుత్తర వాదిని కాదుకదా?
ఉ. దుర్యోధనుడును ఇట్లే చెప్పినాడు: ‘ఓ సర్వేశ్వరా! నీవే నా హృదయాంతర్వర్తివి. నీవేమి చేయించిన నే నది చేయుచున్నాను.’’ కాని భగవంతుడే కర్తయనియు తాను నిమిత్తమాత్రుడననియు నిజముగా నమ్మువాడెట్టి పాపమున జేయజాలడు. పరిపూర్ణుడైన నర్తకుడెప్పుడును తప్పుటడుగువేయడు. నిజమునకు హృదయము పరిశుద్ధమైననే కాని భగవంతుడున్నాడని కూడ నమ్మజాలడు.
898. ఒక భక్తుడు: స్వామీ, నాకొక సందేహమున్నది. మనకు స్వేచ్ఛ కలదందురు, అనగా ధర్మముగాని, అధర్మముగాని, మఱేది గాని మన యిష్టానుసారము చేయగలమందురు. నిజమా? మనకు నిజముగా స్వాతంత్య్రము కలదా!
శ్రీగురుదేవుడు: సర్వము భగవత్సంకల్పముననుసరించి నడుచును. ఇదంతయు వానిలీల! ఆతడు మనచేత అనేకవిధముల అనేక కార్యములను- మంచివి, చెడ్డవి, ఉత్తమమైనవి, నీచమైనవి- చేయించుచున్నాడు. వీని కన్నిటికిని మూలమాతడే. యోగ్యులు, అయోగ్యులును- ఎల్లరును వాని మాయయే; వాని లీలయే. ఉదాహరణమునకు చూడుడు: తోటలోని చెట్లన్నియు ఔన్నత్యమునగాని, రామణీయకమున గాని, వైభవమున గాని ఒండొంటితో సమానము కావుగదా?
బ్రహ్మసాక్షాత్కారము కానంతవఱకు నరుడు తాను స్వతంత్రుడ ననుకొనుచుండును. కాని భగవంతుడే రుూ భ్రాంతిని వానియందుంచువాడు. లేని పక్షమున పాపకార్యములు అపారముగా హెచ్చిపోవును; అపుడికజనులకు పాపభీతియే లేకుండును, మఱియు పాపములకును దోషములకును శిక్షయనునదియే లేకుండును. కాని బ్రహ్మసాక్షాత్కారము బడసినవాని భావము యెట్లుండునో తెలియునా? ఆతడు మనఃపూర్వకముగా నిట్లు భావించును: ‘‘దేవా! నేను యంత్రమను, నీవు యంత్ర రధికుడవు; నేను గృహమను, నీవు గృహాధిపతివి: నేను రథమును, నీవు రథికుడవు; నీవు ననె్నట్లు నడపిన నేనట్లు నడతును; ఎట్లు పలికించిన అట్లు పలుకుదును!’’
- ఇంకాఉంది