సబ్ ఫీచర్

ఇంటర్నెట్ ‘ఇరుసు’పై..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటర్నెట్ వినియోగంలో భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానంలో నిలిచింది. మేరీ మీకర్ అనే అధ్యయన సంస్థ జరిపిన సర్వేలో ఇది నిరూపితమైంది. అభివృద్ధికి ఇంటర్నెట్ ఇరుసుగా మారింది. భారత్‌లో ఈ ఘన విజయానికి రిలయన్స్ ‘జియో’ కారణమని తేటతెల్లమైంది. ఎక్కువ వేగం (4జీ)తో తక్కువ ధరకు సమాచార బట్వాడా కారణంగా మన దేశంలో జియో గొప్ప అంతర్జాల విప్లవాన్ని తీసుకొచ్చింది. ప్రపంచంలో ఈ రకంగా ఒకే ఊపులో ఇంటర్నెట్ విప్లవం రావడం భారతదేశంలో జియోవల్ల సాధ్యమైందని ఆ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. మిగతా టెలికాం కంపెనీల భాగస్వామ్యమూ ఇందులో ఉంది.
ప్రపంచ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది అంటే 380 కోట్ల మంది ప్రస్తుతం ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు. ఇది క్రమంగా పెరుగుతోంది. అమెరికాలో 8 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తే, భారతదేశంలో 12 శాతం మంది వినియోగిస్తూ ఉండటం గొప్ప విషయం. దేశంలో జియోకు 30 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. ఉచిత కాల్స్, డేటాను తక్కువ టారిఫ్‌కు అందించడం వల్ల సంవత్సర కాలంలోనే వారి చందాదారుల సంఖ్య రెండింతలు కావడం చారిత్రాత్మక అంశం.
ఈ డేటాబేస్‌ను ఉపయోగించుకుని రిలయన్స్ ఇప్పుడు ఈ-కామర్స్ రంగంలోకి ప్రవేశిస్తోంది. రిలయన్స్ రిటైల్ వ్యవస్థతో జియో చందాదారులను అనుసంధానం చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఆ విధంగా 3 కోట్ల మంది చిన్న వ్యాపారులకు మేలు జరగగలదని, వినియోగదారులకు మెరుగైన సేవలు అందుతాయని భావిస్తున్నారు. గరిష్ట జనాభాను చేరుకునేందుకు రిలయన్స్ పథక రచన చేస్తోంది. ప్రజల జీవన విధానంలో ఇది విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చే ప్రక్రియ. ఇప్పటికే అనేక ఈ-కామర్స్ సంస్థలు మార్కెట్లో క్రియాశీలకంగా ఉన్నప్పటికీ జియో-రిలయన్స్ రిటైల్ సంయుక్త కార్యాచరణ కారణంగా ఈ కొత్త ఆన్‌లైన్ వ్యాపారం కొత్తపుంతలు తొక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
వాల్‌మార్ట్ సంస్థ విస్తృతి అందరికీ తెలిసిందే! దాని అధీనంలోని ఈ-కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్. దీని ద్వారా వస్తువుల అమ్మకం జోరుగా సాగుతోంది. దిగుమతి సుంకాలు ఆదా చేసుకునేందుకు వీలుగా అనేక వస్తువులను భారత్‌లో తయారుచేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇటీవలి కాలం వరకు చైనా తదితర దేశాల వస్తువులను దిగుమతి చేసుకుని స్థానిక మార్కెట్లో వాటిని విక్రయించేవారు. ఇప్పుడు కొంత శాతమైనా దేశీ తయారీకి నడుం బిగుస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతిపై అధిక సుంకాలు ఉండటంవల్ల సుంకం ఆదాచేసుకునేందుకు వీలుగా దేశీయంగా ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నారు. యాపిల్ లాంటి దిగ్గజ సంస్థ సైతం భారత్‌లో తయారీ లేబుల్‌ను వేసి తన ఉత్పత్తులను అమ్మేందుకు సిద్ధమవుతోంది. విశాలమైన మార్కెట్ ఉండటం, వినియోగదారుల సంఖ్య పెరుగుతూ ఉండటం కారణంగా అనేక దిగ్గజ సంస్థలు దేశీయంగా ఉత్పత్తికి ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఎన్‌డిఏ ప్రభుత్వం ‘మేకిన్ ఇండియా’నినాదం కూడా వీరికి కలిసొస్తోంది. రాయితీలు విరివిగా లభిస్తున్నాయి. ఈ వాతావరణంలో ఈ-కామర్స్ నానాటికీ పెరుగుతోంది. అమెజాన్ సైతం దూసుకుపోతోంది.
వాస్తవానికిది ఈ-కామర్స్ యుగం. కిరాణా సరుకులు సైతం ఆన్‌లైన్‌లో ‘బుక్’చేసే సంస్కృతి క్రమంగా పెరుగుతోంది. దీన్ని అందుకోవాలంటే ఇంటర్నెట్ వేగం ముఖ్యం. దాని అవసరాన్ని 5జీ టెక్నాలజీ తీరుస్తోంది. ఇంటర్నెట్‌ను సమర్ధవంతంగా ఉపయోగించుకుందుకు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంపై ఆధారపడేందుకు కాలానుగుణమైన వేగవంతంగా ఇంటర్నెట్ సర్వీసులను అందించే వ్యవస్థ కీలకంగా నిలిచింది.
ఇటీవల వాషింగ్టన్‌లో యూఎస్, ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ‘ఇండియా ఐడియాస్ సమ్మిట్’జరిగింది. భారతదేశ మార్కెట్ పరిణామం పెద్దది, దేశంలో కొత్త ఉత్పత్తులను తయారుచేసి వాటిని ప్రపంచానికి అందించాలన్న ఆలోచనలో ఉన్నామని గూగుల్ సంస్థ సిఈఓ సుందర్ పిచాయ్ ఆ సదస్సులో చెప్పారు. గూగుల్ నిర్ణయం వల్ల ఎలక్ట్రానిక్, మొబైల్ ఫోన్ల తయారీ భారతదేశంలో పెరగనున్నది. ఇక్కడ అభివృద్ధి చేసిన వస్తువులను ప్రపంచవ్యాప్తం చేసే ఆలోచన వల్ల దేశ అభివృద్ధి వేగం పెరగనున్నది. భారతదేశంలో స్మార్ట్ఫోన్ల వాడకం పెరుగుతున్న దృష్ట్యా వాటి తయారీకి, వాటి అనుబంధ పరికరాల తయారీకి చాలా సంస్థలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. వీలయినంత చౌకగా ఫోన్లను వినియోగదారులకు అందించాలన్న ఆలోచనతో అనేక సంస్థలు భారత్‌లో తయారీ- పరిశోధన-అభివృద్ధి (రీసెర్చ్-డెవలప్‌మెంట్)పై శ్రద్ధపెడుతున్నాయి. దీనికంతటికీ తిరిగి ‘ఇంటర్నెట్ వేగం’కొలమానంగా నిలుస్తోంది. ఇవి పరస్పర ఆధారితాలు కావడం గమనార్హం. డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్న రీత్యా కూడా ఇంటర్నెట్ అవసరం. దాని వేగం అత్యంత కీలకంగా మారింది.
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల జరిగిన సదస్సులో ‘గ్లోబల్ లీడర్‌షిప్’ అవార్డును అందుకున్నారు. ఆయన మన పొరుగు రాష్ట్రం తమిళనాడుకు చెందిన సాంకేతిక నిపుణుడన్న విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్ సిఈఓ నాదెళ్ళ తెలుగువాడు కావడం మనకు గర్వకారణం. ఇలా అనేక దిగ్గజ కంపెనీల సీఈఓలిప్పుడు భారత మూలాలు ఉన్నవారే. వారి నేతృత్వంలో భారతదేశానికి సరికొత్త టెక్నాలజీ వేగంగా రాబోతోంది. అనేక ఆవిష్కరణలకు ఊతం ఇస్తున్నారు. స్టార్టప్‌లకు చేయూతనిస్తున్నారు.
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ను గుర్తించారు. అందులో భాగంగానే వచ్చే అక్టోబర్ 3,4 తేదీల్లో ప్రపంచ ఆర్థిక వేదిక (ఇండియా) అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తోంది. ‘‘అందరికి ఉపయోగపడే సాంకేతిక’’ అన్న అంశంపై ఆ సదస్సులో నిపుణులు పత్రాలు సమర్పిస్తారు, ప్రసంగాలు చేస్తారు. ఈ సదస్సులో పాల్గొన వలసిందిగా తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ ప్రయాణమంతా దేన్ని సూచిస్తోంది? అన్న ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకుని సమాధానం చెప్పుకునే సందర్భం ఇది.

-వుప్పల నరసింహం