సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక నా స్వాధీనత తప్పిపోవును. కుండలిని కంఠమును దాటి వెడలునప్పుడు నాకుగలుగు ననుభవమును మీకు దెలుపవలయునని నిశ్చయించుకొందునుగనే చెంగువ మనస్సు (శిరస్సువైపునకు) పైకి పోవును- ఇక నంతటితోసరి!’’ గురదేవుడనేక పర్యాయములు ఈ స్థితిని వర్ణింపబ్రయత్నించెను, కాని యెన్నడును కృతార్థుడు కాలేదు. ఒకనాడు తన యెదుటనున్న వారికి ఈ యనుభవములను వర్ణింప నిశ్చయించుకొని కుండలినీ శక్తి కంఠమును జేరువఱకును గురుదేవుడు తన వర్ణనను సాగించెను. భ్రూమధ్య భాగమున కవ్వలివైపున నుండు ఆజ్ఞా చక్రమును జూపుచు నిట్లు వించెను: ‘‘మనస్సు ఇచ్చటికి వచ్చినంతనే పరమాత్మదర్శనము లభింప సమాధి స్థితి గలుగును. అపుడు జీవునకును పరమాత్మకును నడుమ పలుచని పొర మాత్రముండునని చెప్పనగును. అందుండి సర్వము గోచరించు చుండును. అపుడాతని యనుభూతి యిటులుండును...’’ సవివరముగా ఆ స్థితిని వర్ణింప బ్రయత్నించినంతనే గురుదేవుడు సమాధి స్థిడుతయ్యెను! మనస్సు కొంచెము క్రిందికి దిగివచ్చినంతనే- అనగా బ్రహిఃప్రజ్ఞ కలుగనారంభించినంతనే- మఱల బ్రయత్నించెను, కాని మఱల సమాధి నిమగ్నుడయ్యెను! ఇట్లు అనేక పర్యాయములు విఫలమనోరథుడై తుదకు గురుదేవుడు కండ్ల నీరు పెట్టుకొని యిట్లు వచించెను: ‘‘ఏమున్నది?- కొంచెమైనను దాపరికము లేకుండ అంతయు మీకు జెప్పుటకై నేనెంత మనఃపూర్వకముగా ప్రయత్నించినను అమ్మ నన్ను ఎంత మాత్రము అటుల జేయనీయకున్నది. ఆమె నా నోరు మూసివేయుచున్నది!’’
906. కుండలినీశక్తి బయల్వెడలి మెదటిని జేరు వివిధ మార్గములను సూచించుచు శ్రీగురుదేవుడు తఱచుగా నిట్లు వచించువాడు: ‘‘ఒడల జల్లుమన మెదటిని జేరునట్టి యాశక్తి యెప్పుడును ఒకే గమనము ననుసరింపదు. శాస్తమ్రులు ఆ శక్తి ఐదు విధములైన గమనములను గలిగి యుండునని తెల్పును. మొదటిది పిపీలికాగమనము: నోటిలో ఆహారము నిడుకొని చీమల బారుపైకి ప్రాకుచున్న రీతిని పాదములనుండి యేదియో మెల్లగా పైకి ప్రాకిపోవుచున్నట్లు తోచును. అది శిరస్సును జేరినంతనే సాధకుడు సమాధిస్థితి నొందును. రెండవది మండూక గమనము: కప్ప వడివడిగా చిన్న చిన్న రెండు మూడు దూకులు దూకి కొంచెము సేపాగి, మఱల గమనము ప్రారంభించునటుల పాదములనుండి యేదియో మెదటి వైపునకు బోవుచున్నటుల దోచును. ఇయ్యది మెదటిని జేరినంతనే సమాధి స్థితి లభించును. మూడవది సర్పగమనము: తిన్నగా గాని, చుట్టచుట్టుకొని గాని పాము పడియుండి ఎదుట తన యాహారము గాన్పించినంతనే, లేదా, ఏ దేని భయము తోచినంతనే వంకర టింకరగా ప్రాకిపోవునటుల కుండలినీ శక్తి మెదటివైపునకు బరుగిడును, అంతట సమాధి గలుగును. నాలవది విహంగగమనము: పక్షి యొక చోటినుండి మఱియొక చోటికి ఎగురునపుడు రెక్కలనల్లార్చుచు, ఒకప్పుడు ఎగువగను మఱియొకప్పుడు దిగువగను బోవుచు, ఏమైనను గమ్యస్థానము జేరువఱకు ఆగకుండునటుల ఆశక్తి బయల్వెడలి మెదటిని జేరును, అంత సమాధి స్థితి గలుగును. ఐదవది (కడపటిది) మర్కట గమనము: చెట్టునుండి చెట్టునకు బోవునపుడు కోతి యొక కొమ్మనుండి మఱియొక కొమ్మకు చెంగున దూకి రెండుమూడు దూకులలో గమ్యమును జేరునటుల కుండలిని మెదటిని జేరుచున్నట్లు యోగికి అనుభూతమగును. అంతట సమాధి స్థితి లభించును.’’
907. శ్రీగురుదేవుడీయనుభవములను వేదాంత దృష్టిననుసరించి రుూ విధముగా వివరించువాడు: ‘‘వేదాంతము సప్త్భూమికలను గూర్చి తెలుపును: ప్రతి భూమికయందును సాధకునకు ప్రత్యేకమగు దివ్యదర్శనము, లేక దివ్యానుభూతి లభించును. మానవుని మనో వ్యాపారము సహజముగా మూలాధారము, స్వాధిష్ఠానము, మణిపూరకమునను దిగువ మూడు చక్రములందు మాత్రమే బద్ధమైయుండ బ్రవర్తించుచుండును. వీనిలో గొప్పది నాభి కెదురుగా నుండు మణి పూరకము.
- ఇంకాఉంది