సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుచే మనస్సు ఆహార నిద్రాదికములగు సామాన్య పశుధర్మములతో సంతుష్టినొందుచుండును. కాని యది హృదయమున కెదురుగా నుండు ననాహతమును జేరినంతనే మానవునకు దివ్యజ్యోతి యొక్క దర్శనము గలుగును. ఐనను ఈ స్థితినుండి సాధకుడు తఱచు పతనము చెంది దిగువ (మూడు) చక్రముల వ్యాపారములలో బడుచుండును. కాని హృదయమున కెదురుగా నుండు విశుద్ధచక్రమును జేరునపుడిక సాధకుడు భగవదన్య విషయములను గూర్చి మాటలాడజాలడు.
నేనీ స్థితిలో నుండినప్పుడెవ్వరైనను ప్రాపంచికపు గొడవలను గూర్చి ఏకరువుపెట్టిన పక్షమున, నెత్తిపై నెవ్వరో అమాంతముగా గొట్టినట్లుండెడిది. ఈ బాధలేకుండ నేనపుడు పంచవటికి బోయి ఏకాంతమైనచోట దాగియుండెడివాడను. లౌకికులు గాన్పించినంతనే పాఱిపోవువాడను; బంధువులు నా దృష్టికి- అందు బడినచో మఱల వెలువడుటకు వీలులేని- పాతాళమువలె గాన్పించువారు. వారి యెదుట నాకు ఊపిరి సలుపకుండెడిది- ప్రాణము పోవుచున్నట్లుండెడిది: వారి బారినుండి తప్పించుకొని పాఱిపోయినప్పుడే నాకు మనశ్శాంతి గలిగెడిది. ఈ స్థితి బొందినను గూడ సాధకుడు (దిగువ మూడు చక్రములలోనికిని) పతనము నొందవచ్చును.
కాబట్టి యాతడు సదా జాగరూకుడై యుండవలయును. కాని భ్రూమధ్యమున కెదుటనుండు ఆజ్ఞా చక్రమును మనస్సు జేరిన పక్షమున సాధకుడు ఇక నిర్భయుడగును. అపుడాతడు పరమాత్మ దర్శనమునొంది సదా సమాధి స్థితుడై యుండును. ఈ స్థానమునకును అత్యున్నతమగు సహస్రారమునకును నడుమ పలుచని పొర మాత్రముండునని చెప్పవచ్చును. పరమాత్మకు అపుడాతడు అత్యంత సన్నిహితుడై యుండుటచే వానియందాతడు లీనమైనట్లు భావించుచుండును, కాని యాతడు ఇంకను లీనము కాలేదు, ఐక్యమునొందలేదు. ఈ స్థితినుండి మనస్సు ఐదవదియగు విశుద్ధ చక్రమునకు, లేదా, అంత పుట్టిమునుక వచ్చినచో, నాల్గవదియగు అనాహత చక్రమునకు దిగవచ్చును- కని యంతకంటె క్రిందికి మాత్రము దిగదు. జీవుల తరగతిలోని వారగు సామాన్య సాధకులు ఈ స్థితిని బొందినచో మఱల క్రిందికి- అనగా బహిఃప్రజ్ఞకు- రాజాలరు. ఇరువది యొక దినములు నిరంతర సమాధి స్థితులై యుండి అటుపిమ్మట ఆ పలుచని పొరను భేదించుకొని పరమాత్మతో శాశ్వతముగా నైక్యము నొందుదురు. సహస్రారమున జీవాత్మ పరమాత్మలయొక్క రుూ శాశ్వత సంయోగమే సప్తమ భూమికను బొందుటయని చెప్పబడును.
కృత్రిమావేశము
908. పైకి సమాధివలె గాన్పించునొక విధమైన భావావేశమును బొందునొకని సూచించుచు, శ్రీగురుదేవుడిట్లు పల్కెను: ‘‘నిజమైన దివ్యావేశమున జీవుడు హృదయాంతరాళమున బ్రవేశించి పరిపూర్ణ ప్రశాంతి నొందును; కాని యిచట మనకు గానవచ్చునదేమి! ఓరుూ, శాంతింపుము- సముదాయించుకొనుము. (ఎదుటనున్న భక్తుల నుద్దేశించుచు) ఈ యావేశమెట్టిదో మీకు తెలియునా? అరగిద్దెడు పాలను పెద్ద బూరెల మూకుడులో బోసి మఱగబెట్టుట వంటిది. పైకి మూకుడు నిండ పాలున్నట్లు గాన్పించును, కాని పొయ్యినుండి క్రిందకు దింపినంతనే ఒక చుక్కయైనను అందుండదు. ఇదివఱకు అందుండిన అరగిద్దెడు పాలు గూడ అడుగంటి పోవును.
దివ్య దర్శనము, దివ్య శ్రవణము
909. జీవాత్మపరమాత్మల యైక్యమనియు సగుణబ్రహ్మ దర్శనమనియు బ్రహ్మసాక్షాత్కారము రెండు విధములు, ఇందు మొదటిది జ్ఞానమనియును, రెండవది భక్తియనియు జెప్పబడును.
910. నాయనలారా! నిజముగా భగవంతుని జూడవచ్చును. మనమిచట గూర్చుండి మాటలాడుకొనుచున్నట్లే సరిగా ఇదేవిధముగా- భగవంతుని జూచి వానితో మాటలాడవచ్చును. నిజముగా- మనఃపూర్వకముగా- జెప్పుచున్నాను.
- ఇంకాఉంది