ఉత్తరాయణం

స్ఫూర్తి నింపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుబడులకోసం విదేశాల్లో విపరీతంగా పర్యటిస్తు న్నారు. ఇప్పటికే ఆయన సింగపూర్‌ను చాలా సార్లు సందర్శించారు. జపాన్, చైనా, రష్యాలతో పాటు సెంట్రల్ ఆసియా రిపబ్లిక్‌లైన కజకిస్తాన్, కిర్జిస్తాన్, ఉజ్బెకిస్తాన్, టుర్క్‌మెనిస్తాన్, తజకిస్తాన్ వంటి పేద దేశాల్లో కూడా పర్యటించారు. కజకిస్తాన్ జనాభా కోటీ డెబ్బయ లక్షలు. ఇది ఆంధ్ర ప్రదేశ్ జనాభాలో 1/3వ వంతు కంటె కొద్దిగా ఎక్కువ. మరి అటువంటి చిన్నదేశం, ఆంధ్ర ప్రదేశ్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు వీలైన అతిపెద్ద కంపె నీలను, అంత పెద్ద మొత్తంలో ఆదాయం కలిగి వున్నదా అనేది ప్రశ్న. దీనికంటే యుఎస్‌లో ఉన్న తెలుగువారిలో స్ఫూర్తి కలిగించి, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించవచ్చుకదా. చైనా ఇదేవిధంగా చేసి అద్భుతమైన ప్రగతి సాధించింది. కష్టించి పనిచేయడం, దేశభక్తి అనేవి చైనా అభివృద్ధికి ప్రధాన చోదకాలు. మనం కూడా అటువంటి విధానాన్ని ఎందుకు అనుసరించకూడదు?
- డాక్టర్ హనుమాన్ చౌదరి, సికింద్రాబాద్

పిల్లలతో అశ్లీల నృత్యాలా?
టీ.వి ఛానెళ్ళలో వస్తున్న డాన్స్ పోటీలలో భాగంగా చిన్న పిల్లలతో అశ్లీల నృత్యాలు చేయించడం శోచనీయం. మరీ చిన్న పిల్లలకు వేసే దుస్తులేమిటి? వారితో డ్యుయెట్ డాన్సులు వేయించడమేమిటి? మనం భారతదేశంలో ఉన్నామా? విదేశాలలో ఉన్నామా అనిపిస్తుంది. ఈ దుష్ప్రభావం సమాజంలోని చిన్నపిల్లలపై పడుతుంది. కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లోనూ స్కూల్‌డే సందర్భంగా పిల్లలచే డ్యుయెట్ డాన్సులు వేయించడం సమాజపు పతనానికి నిదర్శనం. టి.వి నృత్య పోటీలలో భాగంగా భారతీయ నృత్యరీతులను పిల్లలచే ప్రదర్శింపజేస్తే బాగుంటుంది. ఈ పద్ధతిని ఆయా పాఠశాలలూ అనుసరిస్తే మరీ మంచిది. ఒకవేళ పిల్లలతో ఆధునిక డాన్సులు వేయించినా ఫాస్ట్‌బీట్‌తో ఉన్నా మంచి సాహిత్యం ఉన్న పాటలకు ‘సోలో డాన్సులు’ వేయించాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
నిరర్థక ఆస్తులు
దేశంలో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు అప్పు ఎగవేతదారులవల్ల ఏటా వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నాయ. అప్పులు తీసుకున్నవారు హామీగా కుదువబెట్టిన స్థిర చరాస్తులను వేలంలో అమ్మి నష్టాలను పూడ్చుకోవచ్చుననే రూలు ఉన్నదిగా. మరి అలా జరుగుతున్నదా? ఎగవేతదారులవల్ల యిప్పటికే వేలాది కోట్ల రూపాయలు బ్యాంకులు నష్టపోయాయని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఎమ్‌డి రాజీవ్‌రుషి ఓ సదస్సులో ఆవేదనను వెలిబుచ్చారు. ఈ ఒక్క బ్యాంకులోనే ఇరవై ఆరువేల కోట్ల రూపాయల నిరర్ధక ఆస్తులవల్ల పధ్నాలుగువందల కోట్ల నష్టం ఒక్క ఏడాదిలో వాటిల్లిందని చెప్పారు. ఈ ఎగవేతదారులకు దేశ విదేశాలలో దాచిన నల్లధనదారులకు తేడా ఏమీ లేదు. కఠిన చర్యలుతీసుకోకపోవడమే ఇందుకు కారణం. విజయమాల్యా ఓ ఉదాహరణ. ముఖ్యంగా మన చట్టాల్లో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని అప్పులను ఎగ్గొట్టడం వంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
విధ్వంసాలతో ఒరిగేదేమిటి?
హిందూత్వాన్ని ఇతర మతాలు అస్థిరపరచేందుకు కుట్రలు పన్నుతున్నాయి. అందులో భాగంగానే ఉగ్రవాదులు మత కల్లోలాలను, విధ్వంసాలను సృష్టించటానికి పాల్పడుతున్నారు. దీనివల్ల వారు సాధించేది ఏమిటి? అలాగే కొన్ని మత సంస్థలు మతమార్పిడులను ప్రోత్సహిస్తూ బలవంతంగా తమవైపు తిప్పుకుంటున్నారు. ప్రతి దానికి మతానికి ముడిపెడుతూ దేశాన్ని అస్థిరపరచే విధంగా చూస్తున్నారు. భారతదేశం అభివృద్ధిపథంలో ముందుకుపోవటాన్ని సహించని కొన్ని మత సంస్థలు ఇలా వాతావరణాన్ని కలుషితం చేస్తూ, లౌకిక తత్వానికి నిదర్శనమైన మన మనుగడను భంగపరచడానికి యత్ని స్తున్నారు. హిందూయిజం మతం కాదు మార్గదర్శకత్వం దాన్ని మతంతో ముడిపెట్టటం తప్ప ఇకనైనా మారండి. ఏ మతమైనా శాంతిని ప్రేరేపిస్తుంది తప్ప విధ్వంసాన్ని కాదు. సహనం, శాంతి, సహజీవనం వంటి నైతికమైన విలువలకు హైందవం ప్రాధాన్యతనిస్తుంది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది హిందూమతం.
- ఎ.ఆర్.ఆర్.ఆర్.గౌడ్, ఖమ్మం