సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

928. సంగీతమున స్వరములు ఆరోహణక్రమమున ఉచ్చస్థాయిని బొంది, అవరోహణక్రమమున మఱల నీచస్థాయిని బొందునట్లు సమాధి స్థితిలో అద్వైతానుభవమును బొందిన పిమ్మట బాహ్య లోకమునకు దిగివచ్చి, ‘అహంస్ఫురణ’తో నుండవచ్చును. ఒకదాని తర్వాత నొకటిగా దొప్పలనన్నిటిని ఒలిచివేసి, అరటి దూటను గైకొని, దానినే యందలి ముఖ్య భాగముగా భావింతుము. కాని తరువాత మఱల దొప్పలు అరటి చెట్టువే యని గణింతుము. బోదెను సంపూర్ణమైన దానినిగాజేయుటకు దొప్పలును దూటయును గూడ సమానముగనే ఆవశ్యకములుగదా?
929. మారేడుపండు భాగములను పరిశీలించునపుడు చిప్ప, గింజలు, గుంజు- అని విభజింతుము గదా? ఇపుడు వీనిలో ఏది మారేడుపండు? మొట్టమొదట మనము చిప్పను తరువాత గింజలను అప్రధానములని విడిచిపెట్టి తుదకు గుంజును వేఱుగా గైకొని అదియే నిజముగా పండనుకొందుము. కాని దేనికి గుంజు కలదో దానికే గింజలును చిప్పయును గూడ కలవను భావన తరువాత గలుగును. ఇవన్నియు గలిసియే పండగుచున్నవి. ఇట్లే భగవంతుని నిర్గుణావస్థయందు సందర్శించిన పిమ్మట నెవ్వడు (ఏ భగవంతుని) స్వతస్సిద్ధముగానిత్యుడో వాడే లీలామయుడై జగద్రూపమును దాల్చియున్నాడని బోధపడును.
930. ఒకప్పుడు శ్రీ గురుదేవుడు నరేంద్రు (వివేకానందస్వామి)ని ‘‘నీ జీవితాదర్శమేమి?’’ అని ప్రశ్నించెను. ‘‘సమాధినిమగ్నుడనై యుండుటచే’’యని నరేంద్రుడు సమాధానముచెప్పెను. అంత శ్రీ గురుదేవుడిట్లు హెచ్చరించెను: ‘‘నీవంత సంకుచిత బుద్ధివై యుండుట తగదు. సమాధి స్థితి నతిక్రమింపుము. సమాధి నీకు తృణప్రాయము!’’
వేఱొకనితో శ్రీ గురుదేవుడిట్లు పలికెను: ‘‘భావము (దివ్యభావపారవశ్యము), భక్తి- ఇవియే పరమావధి యనుకొనకుము.’’
931. మఱియొక సందర్భమున శ్రీగురుదేవుడు నరేంద్రునదియే ప్రశ్నవైచి యదియే సమాధానముపొందెను. అంత శ్రీగురుదేవుడిట్లు హెచ్చరించెను: ‘‘ఏమేమి! నీకింత కంటె ఉత్తమాశయము కలదనుకొంటిని, ఇట్టి సాక్షి కాశయముతో- ఇట్టి యసంపూర్ణాశయముతో- నీవెట్లు సంతుష్టుడవు కాగలవు? సర్వావలోకనమే నా బలము. నాకిష్టమగు నొకకూర గలదనుకొనుము: దానిని నేను వేపుడు కూరగా, ముద్ద కూరగా, పులుసుగా, పచ్చడిగా- నానావిధములుగా భుజించి యానందింప గోరెదను. భగవానుని నేను సమాధి స్థితిలో అవ్యయాద్వితీయ బ్రహ్మముగా మాత్రమేకాక, సఖ్యభావము, దాస్య భావము మొదలగు వివిధ మనోహర భావముల మూలమున వానిని నానావిధ దివ్య రూపములందును సందర్శించి యానందింతును. నీవు నిట్లే చేయుము. ఒక్కుమ్మడి జ్ఞానివిని భక్తుడవునుగూడ గమ్ము.’’

- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి