సబ్ ఫీచర్

ఆలోచనలు మార్చుకుంటే అంతా ఆనందమే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాణానికి బొమ్మ, బొరుసు వున్నట్లే మనలో కూడా మంచి చెడులు పెనవేసుకుని వుంటున్నాయనడంలో సందేహం లేదు.
ప్రతీ పట్టణంలో పల్లెలలో కూడా సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలు ముందుకు దూసుకెళ్తుంటే కొందరు ఇంకా ఏవేవో మూఢ నమ్మకాలు పట్టుకు వ్రేలాడుతున్నారు. వీరు ‘తామునిగింది గంగ, తావలచింది రంభ’ అనే రకం. వీరు తాము మారరు. మారుతున్న వారిని మారనివ్వరు.
పైగా వీరి నమ్మకాలని ‘శాస్త్రం’ ఇలా చెప్పిందంటూ శాస్త్రంమీద తోసేస్తారు. అది ఏ శాస్తమ్రో! అసలువారికే తెలియదనుకుంటాను. మనకు రామాయణ, భారత, భాగవతాలు ప్రామాణికాలు. భగవద్గీత ప్రామాణికం. మాద్రిలాంటివారు కొందరు తమకి తాముగా విరక్తి చెంది భర్త శరీరంతోపాటు తామూ సహగమనం చేశారు. అంతమాత్రం చేత అది శాస్త్రంగా చెప్పి బలవంతంగా దహనం చేసే హక్కు ఎవరికీ లేదని నిరూపించి చట్టం తేబడింది.
ఇప్పటికీ స్ర్తిలు భర్త పోతే సమాజం నించీ ఎన్నో అవమానాలని ఎదుర్కోవలసి వస్తోంది. పొద్దునే్న ఆమెని చూస్తే (తల్లయినా) కీడు జరుగుతుందని, ఆమె ఎదురు వస్తే కీడని నమ్మేవాళ్ళు వున్నారు. కొడుకు, కోడలు మనవడి ఒడుగో, మనవరాలి పెళ్ళో చేసుకుంటూంటే ఆమె ఎక్కడో మూలన కూర్చోవలసిందే! నూతన దంపతులచేత కూడా అందరికీ దండాలు పెట్టి ఆశీర్వచనాలు పొందాక అప్పుడు ఆవిడకి పెట్టిస్తారు. ఇంటికి పెద్ద అయిన ఆవిడకి ముందుగా ఆశీర్వదించే అర్హత లేదని కదా! వారి భావన. బట్టలిచ్చేటప్పుడు కూడా అందరికీ ఇచ్చేశాక ముఖ్యమైన ఈవిడకి ఆఖర్న ఇస్తారు. ఇది ఆవిడని అవమానించినట్లు కాదా? ఆవిడ భర్త పరమపదించడం ఆవిడ తప్పా?
కొందరు చెప్పే మాటలు ‘‘ఏవో పాపాలు చేసింది, అందుకే ఈ రాత వచ్చింది’’ అని. ఈ చెప్పేవాళ్ళు ఏ పాపాలు చెయ్యకుండానే వున్నారా? వీరి జీవితాలు ఎలా వుంటాయో! ముందుగా చెప్పగలరా? రేపు ఇదే పరిస్థితి తమకి వస్తే తమనీ ఇతరులు ఇలాగే అంటరాని ఆలోచన వుంటే ఇలాంటి మాటలు మాట్లాడతారా?
మరొక విషయమేమంటే, పోయినవారి వస్తువులు చూస్తుంటే వారి జ్ఞాపకాలు చుట్టుముడుతూ ఆవేదన వస్తూ వుంటుందని, దానివల్ల ఆరోగ్యం దెబ్బతినడమేగాని ప్రయోజనం లేదు కనుక ఆ వస్తువులని ఎవరికైనా ఇచ్చేయాలన్నారు.
అసలు విషయం గ్రహించక మనవారు వారు వాడిన వస్తువులని ఇంట్లో వుంచుకోకూడదని ఏదో కీడు అనీ మంచాలు, పరుపులు వగైరాలన్నీ పడేస్తారు. పూర్వకాలంలో ఇంట్లోనే రోగాలు (ఏ రోగమో తెలియక)తో తీసుకుని మల మూత్రాలతో పాడయి, సూక్ష్మక్రిములు ఇల్లంతా వ్యాపిస్తాయి కనుకనూ, దగ్గిర వుండి సేవ చేసే వారికీ అవి అంటుతాయి కనుకనూ ఆ వస్తువులు పడెయ్యడం, వారికి మైల సోకిందంటూ పది రోజులు వారిని లోపలకి రానియ్యకుండా కూర్చోమనడం జరిగేది. ఇప్పుడు కొందరు ఆసుపత్రులలోనే పోతున్నారు. ఇంట్లోనే వున్నా శుచి శుభ్రాలు పాటిస్తున్నారు. ఏ రోగమో ముందే తెలుసుకుని తగిన మందులు వాడుతున్నారు. కనుక మైలంటూ కూర్చోవాల్సిన పనిలేదు. మనవారి నమ్మకాలెలా వున్నాయంటే ఆ యింటి పేరుగలవారు అమెరికాలో వున్నా సరే మైల పాటించాల్సిందేనని.
ఆ సమయంలో దగ్గిర బంధువులకి నిన్నటివరకూ వున్న మనిషి ఈ రోజు లేకపోయారే అనే బాధతో బుర్ర సరిగా పనిచేయక ఏ పనీ చేయబుద్ధి కాక అస్తవ్యస్తంగా బాధపడుతూ వుంటారు కనుక బైటవారు వచ్చి ఆదుకుని వంట పనులూ అవీ చేస్తారు. అంతేకాని, అదో ఆచారమంటూ సంప్రదాయమంటూ బలవంతంగా కూర్చోబెట్టి పిల్లల్ని స్కూళ్ళకి, పెద్దవాళ్ళని ఆఫీసులకీ వెళ్ళద్దనడం, ముట్టుకుంటే ఏదో అంటుకుందంటూ స్నానాలు చెయ్యమనడం అవివేకం.
దీనికితోడు ‘మైల మారుగోరుతుంది’ అనే నానుడి ఒకటి. ఇది ఇటువంటివారు సృష్టించిందే! పొరపాటున ఎవరైనా మైలవారిని ముట్టుకుని స్నానం చెయ్యకుండా వెళ్లిపోయారంటే, ఖర్మకాలి మరో నెల, రెండు నెలలకో, ఎప్పుడో వారింట్లో ఏవరైనా పోతే-
‘‘అదిగో! నేనప్పుడు అనుకున్నాను. వీళ్ళు ఆ రోజు ఆ మైల ఇంట్లోం చీ వచ్చి స్నానం చెయ్యలేదు. అందుకే ఇలా మారు కోరింది’’ అం టూ తీర్మానిస్తారు. అలా ఎవరూ పోక ఏమీ జరగకపోతే ఆ ప్రస్తావన తప్పని ఒప్పుకోరు. ఏ పెళ్లిలోనైనా ఓ భర్త పోయినావిడ కనబడితే తాము అంతకుముం దు ఆవిడని భర్త చనిపోయాక చూడకపోతే సరినెల అనో, బేసి నెల అనో, మం గళవారమనో, శుక్రవారం అనో ఎంతదగ్గిర వాళ్ళైనా పలకరించకుండా మొహం చాటేసి వెళ్లిపోతారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మూఢ నమ్మకాలు. ఇవన్నీ మళ్లీ భార్య పోయిన భర్తకి వర్తించవు. ఆయన ఎంత పెద్దవాడైనా పెళ్లి సంబంధాలు కూడా తెచ్చి చూపిస్తారు. ఆయన వద్దన్నా ఒప్పించే ప్రయత్నాలు చేస్తారు. ఇదండీ! మనస మాజం. ముందుకి మూరెడు, వెనక్కి బారెడు. ఆలోచనలు మార్చుకుంటే మంచిది.
**
ఈనాడు జనాల్లో చాలా చోట్ల చాలా మందిలో వేళ్లూనుకున్న మూఢ నమ్మకాలు ఏ గ్రంథంలోనూ లేవు. ప్రామాణికంగాని గ్రంథాల్లో ఏ కవో తన స్వంత అభిప్రాయాలు శాస్త్రం చెప్తోందంటూ రాసినవాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి ఒకప్పుడు శాస్త్రం చెప్తోందంటూ భర్త పోయిన స్ర్తిని ఆయన శరీరంతో పాటు చితిమీద కూర్చోపెట్టి బలవంతంగా నిప్పు పెట్టేవారు. ఇది అమానుషం అని నిరసించి ఆపడానికి ఎందరో నిరసనలని ఎదుర్కోవాల్సి వచ్చింది.

- ఎస్. హైమవతి