సబ్ ఫీచర్

వర్షాల్లో చర్మ సంరక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్షాకాలంలో ఒళ్లు తడవకుండా ఇంటికి వెళ్లడం అసాధ్యం. ఇలా రోజూ వర్షాల్లో తడవడం వల్ల చర్మం దెబ్బతింటుంది. ఈ సీజన్‌లో చర్మం పాడవకుండా సంరక్షణకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే..
* వర్షాల వల్ల వాతావరణంలో తేమ పెరిగి చర్మం పొడిబారినట్లవుతుంది. అలా అవకుండా పోషక విలువలతో కూడిన నాణ్యమైన మాయిశ్చరైజర్‌ని చర్మంపై ప్రతిరోజూ క్రమం తప్పకుండా పూసుకోవాలి. ఫలితంగా చర్మం మృదువుగా, ఆరోగ్యంగా ఉంటుంది.
* రోజుకు కనీసం మూడుసార్లు చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మ రంధ్రాల్లో పేరుకుని ఉన్న మురికి, నూనె జిడ్డు పోతాయి.
* నాన్ ఆల్కహాలిక్ వెరైటీతో చర్మాన్ని టోనింగ్ చేసుకుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
* మంచి ఎస్‌పిఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్ లోషన్‌ని వర్షాకాలంలో కూడా వాడాలి. ఎండ లేదు కదా అనుకుంటే పొరబాటుపడ్డారన్నమాటే.. ఎందుకంటే ఆకాశం మబ్బులతో కమ్మి ఉన్నా అతినీలలోహిత కిరణాల ప్రభావం మాత్రం చర్మంపై పడుతూనే ఉంటుంది. దీంతో పలురకాల చర్మ సమస్యలు తలెత్తుతాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
* చర్మంపై ఉండే మృతకణాలను ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలి.
* వర్షాకాలంలో కూడా ప్రతిరోజూ ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగుతూ చర్మం తేమగా ఉండేలా జాగ్రత్తపడాలి.
* వాతావరణంలోని తేమ వల్ల ఈ సీజన్‌లో చెమట బాగా కారుస్తాం. అందువల్ల చర్మం రఫ్‌గా, కాంతివిహీనంగా తయారవుతుంది. కాబట్టి చర్మానికి తగినంత మాయిశ్చరైజర్‌ను రాస్తూ ఉండాలి.
* వర్షాకాలంలో పండ్లతో మాస్కులను తయారుచేసుకుని రాసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇవి ప్రకృతి సిద్ధమైనవి.. పైగా చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.