సబ్ ఫీచర్

తెలంగాణ తత్వకవి, కాలజ్ఞాని సిద్దప్ప వరకవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణ భారతానికి చెందిన వరకవులలో కవి యోగ వంద్యులు సిద్దప్ప వరకవి తెలుగు సాహిత్య చరిత్రలో ఉన్నత స్థానంగా చెప్పవచ్చు. తెలంగాణలో ఇతని పద్యాలు ప్రజల నాలుకలపై నాట్యం చేస్తాయి. సంవత్సరాలు ఎన్నో గడిచిపోయినా, తరాలెన్నో పుట్టి గిట్టుతున్నా, కాలము భూతకాలంలో కలిసిపోయినా కాని ప్రజల మనోఫలకాలపై రూపుదిద్దుకున్న సిద్దప్ప వరకవి అనే మహనీయుని రూపం ఎన్నటికీ చెరిగిపోదు. కుల మత భేదాలు, సాంఘిక మూఢ నమ్మకాలు, మానవ నైతిక విలువలు కనుమరుగవుతున్న దశలో కలాన్ని ఆయుధంగా ఎంచుకొని సాహిత్య యుద్ధం ప్రకటించి సిద్దప్ప వరకవి ప్రజాహితం కోసం తాత్విక సాహిత్యం సృజించి బోధించిన ఘనుడు. ఆధునిక నాగరికత శాస్త్ర విజ్ఞానాభివృద్ధికి మూలం కుమ్మరి చక్రం రసాయన శాస్త్రానికి మూలం బంకమన్ను. చక్రమే యాంత్రిక యుగాన్ని నడిపిస్తుంది. మానవ విలువలను, శ్రమ, సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పి తరతరాల వృత్తినైపుణ్యం గొప్ప సాంస్కృతిక వైభవం కలబోసుకుని మట్టిని నమ్ముకొనే మట్టికి మానవునికి అవినాభావ సంబంధాన్ని చాటిన కుమ్మరకుల నిరుపేద కుటుంబంలో కోహెడ మండలం గుండారెడ్డిపల్లెలో పెద్దరాజయ్య-లక్ష్మి దంపతులకు 9 జూలై, 1903న జన్మించారు. సిద్దప్ప వరకవి బహుముఖ ప్రజ్ఞాశాలి. పామరులను, పండితులను సహితం తన కవిత్వం ద్వారా రంజింపజేశారు. ఆశ్చర్యపరిచారు.
‘‘గొప్పవాడను కాదు కోవిదుడను కాను / తప్పులున్నను దిద్దుడు తండ్రులారా’’ అంటూ వినయంగా చెప్పుకున్నారు. తెలుగు సాహిత్య చరిత్రలో ఓ ఆణిముత్యం. తనగూర్చి తేట తెలుగులో ఒక పద్యంలో చెప్పుకున్నారు.
‘‘నైజాము రాష్టమ్రు నదిపునుస్మనలీ / పాదుషాగారి పట్టణము క్రింద / సూబె వరంగల్లు సొంపైన గ్రామము / జిల్లా కరీంనగర్ చెలిగి వినుడి / శాలివాహన వంశ సమహితుండు / జనకుండు రాజయ్య జనని లక్ష్మమ్మకు / తనయుడు సిద్దప్ప తగిన మతుడు’’.
నిజాం పాలనలో శూద్రులకు చదువు అంతంత మాత్రమే. సిద్దప్ప ఉర్దూ మీడియంలో 7వ తరగతి వరకు చదివారు. తెలుగు, హిందీ, ఉర్దూ, పార్శీ, ఇంగ్లీష్, సంస్కృత భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. ఉపాధ్యాయునిగా పనిచేశారు. సిద్దప్ప వరకవి పదిహేనవ యేటనే రామాయణము, అమరశాస్తమ్రులను పుక్కిట పట్టారు. సరస్వతీదేవి ఇష్టదేవత కటాక్షంవల్ల స్వతహాగా సాహిత్య రచన చేసి సిద్దప్ప వరకవిగా ప్రసిద్ధిచెందారు. సాహిత్యంతోపాటు జ్యోతిష్యం, వాస్తు, ఆయుర్వేద సేవలు కొనసాగిస్తూ మానసిక రుగ్మతలకు సలహాలు ఇస్తుండేవారు. తన స్వగ్రామంలోగల ప్రసిద్ధ ఆశ్రమానికి వచ్చిపోయే వారివద్ద చిల్లిగవ్వ తీసుకునేవారు కారు. నిరాడంబర జీవితాన్ని గడిపారు. తన కలం ద్వారా శ్రామికుల కండ్లు తెరిపించారు. తన సాహిత్యంలో కులాలకు, మతాలకు అతీతంగా మానవత్వానికి ప్రాధాన్యమిచ్చారు. మంచికి ప్రాధాన్యమిస్తూ కుల వ్యవస్థ, మూఢ నమ్మకాలను ఖండించారు. పామరుల నోళ్లలో సహితం ‘‘యేకులంబని’’ పద్యం నాట్యం చేస్తుంది.
‘‘యేకులంబని నను యెరుకతో నడిగేరు / నా కులంబును జెప్ప నాకు సిగ్గు / మా తాత మాలోడు మరియు వినుడు / మా యత్త మాదిగది మామ ఎరుకలవాడు / మా బావ బల్డతడు మానవతుడు / కాపువారి పడుచు కాంత దొమ్మరి వేశ్య / భార్యగావలె నాకు ప్రణయకాంత’’అంటూ మానవత చాటారు. ఈ పద్యంలో ‘యెరుక’ అడిగేరు మానవతుడు, పడుచులాంటి ఎన్నో తెలుగు పదాలను వాడి సామాన్యులకు సహితం అర్థమయ్యే విధంగా రాశారు.
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారు. గాంధీజీ అహింస సిద్ధాంతాలను నమ్మి ఆనాడు గాంధీజీ సమావేశాలకు హాజరైన ఆయన ప్రభావంతో స్వదేశీ వస్త్రాలను వాడాలని సూచించారు. స్వయంగా ఖద్దరు వస్త్రాలను ధరించి అదే విధంగా నిజాం నిరంకుశ పాలననుండి తెలంగాణ విముక్తిచేయాలని తలిచారు. సిద్దప్ప వరకవి ఒకవైపు ప్రజలకు బోధన చేస్తూనే మరొకవైపు 50 గ్రంథాలు రచించారు. 1. సిద్దప్ప వరకవి జ్ఞాన బోధిని (నాలుగు భాగాలు) 2) వర్ణమాల కందార్థములు, 3) కాలజ్ఞాన వర్థమాన కందార్థములు, 4) యాదగిరి నరసింహస్వామి వర్ణమాల, 5) విష్ణు భజనావళి, 6) శివభజనావళి, 7) నీతిమంతుడు, 8) గోవ్యాఘ్ర సంభాషణ, 9) కాకి హంసోపాఖ్యానం, 10) అర్చకుల సుబోధిని, 11) అశోక సామ్రాజ్యము యక్షగానము, 12) జీవ నరేంద్ర నాటకము, 13) నక్షత్రకుల ప్రభావంతో చార్మినార్ చెరిగిపోతుంది.’’అని పరోక్షంగా తన కలం ద్వారా నిజాం ప్రభుత్వం గద్దె కూలిపోతుంది. తెలంగాణ విముక్తి అవుతుందని సూచించారు. ఆనాడు నాణాలపై చార్మినార్ బొమ్మను ముద్రించేవారు. ప్రభుత్వం కూలిపోయి నాణాలు మరుగున పడిపోతాయని తెలిపారు. దీంతో కోపోద్రిక్తులయిన నైజాం రాజులు సిద్దప్ప వరకవి ఉపాధ్యాయ ఉద్యోగాన్ని ఊడబెరికారు. అయినా బెదరలేదు ముందుకు సాగారు.
అలాగే బుద్ధిమంతుల గూర్చి చెపుతూ... ‘‘బుద్ధిమంతులు పుణ్యపురుషార్తులైనవారు. పదిమందిలో ప్రజ్ఞ పలుకబోరు’’ అంటారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ గొప్పది బతుకమ్మ గూర్చి చక్కగా తెలిపారు. ‘‘ఆశ్వయుజ శుద్దమనగా స్ర్తిలంత తిరిగి పువ్వులు తెచ్చి తేగల మలర నా సందు నీ సందు నానాడె పాసెనని కంటె రంగనివుండు గూసెననుచు వైనమను సిబ్బులన్ వదుల బదులుండుకొని యెవరెవ్వరి చద్దివారుగుడాబి’’ అనినారు. అదే విధంగా మహనీయుల గురించి యేమరెడ్డివంటి యోగ గురుడులేడని, కాళిదాసు వంటి కవిలేడని, తల్లిదండ్రుల వంటి ధనము లేదని అంటూనే..
‘‘ఘటముకంటె వేరైన మఠము లేదు / ఆత్మకంటె వేరైన హరియు లేడు’’ అని చెప్పారు. సిద్దప్ప వరకవి బహుముఖ ‘‘శ్రీప్రతాప సింగరాయ నృసింహస్వామి వర్ణమాల’’ పుస్తకంలో ఆ నుండి క్ష వరకు సీస పద్యాలలో స్తుతించారు. ఈయన కీర్తన మంగళ హారతులు, పద్యాలు వివిధ ప్రక్రియలలో రచించారు.
సిద్దప్ప వరకవి కాలజ్ఞాని. నైజాం ప్రభుత్వం కూలుతుందని, కరీంనగర్‌కు దక్షిణాన పెద్ద జలాశయం (మానేరు) ఏర్పడుతుందని ముందే ఊహించి చెప్పారు. సిద్దప్ప వరకవి 23 మార్చి, 1984లో పరమ పదించినారు. ఆయన జ్ఞాన బోధనలతో మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలో కూడ భక్త్భామానులు తయారయ్యారు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి గురుపూజోత్సవం సందర్భంగా గుండారెడ్డిపల్లెలో సమారదనోత్సవం జరుపుతారు. ఈయన సమాధివద్ద సాహితి గౌతమీ కవి సమ్మేళనం నిర్వహించింది. పరిశోధకుడు జయధీర్ తిరుమలరావు సిద్దప్పను వేమనతో పోల్చాడు. బిరుదు రామరాజు యోగుల పుస్తకంలో సిద్దప్ప గూర్చి సమీక్షించారు. సురవరం ప్రతాపరెడ్డి వేమనతో పోల్చాడు. బిరుదు రామరాజు యోగుల పుస్తకంలో సిద్దప్ప గూర్చి సమీక్షించారు. సురవరం ప్రతాపరెడ్డి ‘‘గోలుకొండ కవులు’’ సంచికలో 108వ స్థానం కల్పించారు. 2012 కార్తీక పౌర్ణమి రోజున తెలంగాణ వివేక రచయితల సంఘం ఆధ్వర్యంలో ‘‘సిద్దప్ప వరకవి జీవితం- సాహిత్యం’’ అను అంశంపై సదస్సు నిర్వహించారు. తెవిరసం వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి వాసరవేణి పరశురాం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పెద్దింటి అశోక్‌కుమార్, జనపాల శంకరయ్య, తైదల అంజయ్య, వెంగళి నాగరాజు, సిద్దెంకి, పొన్నాలలు సాహిత్యాన్ని సమీక్షించారు. ప్రపంచ తెలుగు మహాసభలలో సిద్దప్ప వరకవి పేరున తెలంగాణ ప్రభుత్వం తోరణం ఏర్పాటుచేసింది. పెందోట వెంకటేశ్వర్లు సిద్దప్ప వరకవి పేరున పురస్కారాన్ని అందజేస్తున్నారు. సిద్దప్ప వరకవి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ప్రజాకవి.. మట్టిలో మాణిక్యం.

- డా.వాసరవేణి పరశురాం, 9492193437