సబ్ ఫీచర్

ఒంటరితనంతో రోగాల బెడద!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటరి జీవితాన్ని అనుభవించేవారు మా నసిక సమస్యల్నే కాదు, అనేక వ్యాధులను ఎదుర్కొంటున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. షికాగో విశ్వవిద్యాలయం పరిశోధకులు 2002 నుంచి జరిపిన సుదీర్ఘ పరిశోధనల్లో ఆసక్తికరమైన పలు అంశాలు వెలుగు చూశాయి. ఏళ్ల తరబడి ఒంటరిగా ఉంటున్నవారు పలురకాల అనారోగ్యాలను భరిస్తున్నారని, వృద్ధులైతే తొందరగా మరణిస్తున్నారని అధ్యయనంలో కనుగొన్నారు. ఒంటరితనం ప్రభావం మనసుపైనే కాదు, శరీరంపైనా తప్పక పడుతుందని వారు బలంగా వాదిస్తున్నారు. అధ్యయనం సందర్భంగా 50-68 ఏళ్ల వయసు కలిగిన వారిలో ఒంటరితనం ప్రభావం గురించి శాస్ర్తియ పద్ధతుల్లో విశే్లషించారు. జన్యుసంబంధ మార్పుల ఫలితంగా ఒంటరిగా ఉంటున్న వారిలో తెల్లరక్తకణాల ఉత్పత్తి మందగించినట్లు పరిశోధకులు గుర్తించారు. తెల్లరక్త కణాల ఉత్పత్తికి ఆటంకం కలగడంతో చాలామందిలో రోగ నిరోధక శక్తి సన్నగిల్లుతోంది. దీంతో వారు అనేక అనారోగ్యాలకు లోనవుతున్నారు. ఒంటరితనాన్ని జయిస్తే మానసిక సమస్యలతో పాటు అనారోగ్యాల నుంచి దూరంగా ఉండొచ్చని వారు సూచిస్తున్నారు.
మానసిక ఒత్తిడితో చర్మానికి చేటు...
మానసిక ఒత్తిళ్ల ఫలితంగా చర్మసంబంధ సమస్యలు తలెత్తుతున్నట్లు ఫిలడెల్ఫియాలోని టెంపుల్ యూనివర్సిటీ, లూరుూస్‌కాట్జ్ వైద్య కళాశాలకు చెందిన పరిశోధకులు సూత్రీకరిస్తున్నారు. ‘మానసిక ఒత్తిడి- చర్మ లక్షణాలు’ అనే అంశంపై అధ్యయనం సందర్భంగా వారు 422 మంది విద్యార్థుల ఆరోగ్య సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఒత్తిడిని అధిక స్థాయిలో ఎదుర్కొంటున్న విద్యార్థుల్లో దురదలు, జిడ్డు, చర్మంపై పొలుసులు, దద్దుర్లు, మచ్చలు, మొటిమలు, వెంట్రుకలు రాలడం, గోళ్లు కొరుక్కోవడం, చర్మం కాంతి విహీనం కావడం వంటి లక్షణాలను పరిశోధకులు కనుగొన్నారు. మానసిక ఒత్తిడితో కొందరు విద్యార్థులు అదేపనిగా జుట్టు లాక్కోవడం, చర్మాన్ని గోక్కోవడం వంటి అలవాట్లకు లోనవుతున్నారని తేలింది. చర్మ సంబంధ సమస్యలున్న వారికి సాధారణ వైద్య చికిత్సతో పాటు మానసిక నిపుణుల సలహాలు కూడా అవసరం అని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
బాగా నిద్రపోతే జ్ఞాపకశక్తి వృద్ధి...
రోజూ కనీసం ఎనిమిది గంటల సేపు నిద్రపోయే వారిలో జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుందని బోస్టన్ (ఆస్ట్రేలియా)లోని ఓ మహిళా ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణులు చెబుతున్నారు. తగినంతగా నిద్రపోయేవారు ఒక్కసారి చూసిన ముఖాన్నయినా తడుముకోకుండా గుర్తు చేసుకుంటారట! ప్రదేశాలు, వ్యక్తుల పేర్లకు సంబంధించి కూడా వారు ఎలాంటి తత్తరపాటుకు గురికాకుండా అన్నీ క్షణంలో గుర్తు చేసుకుంటారట! ఎప్పుడో చూసిన ఫొటోలను, వ్యక్తులను వెంటనే గుర్తుపట్టడంలో వీరి జ్ఞాపకశక్తి అమోఘంగా ఉందని నిపుణులు అంటున్నారు. వేళకు తగినంతగా నిద్ర ఉంటే మెదడు వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటుందని, ఫలితంగా జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుందని వారు సెలవిస్తున్నారు.
*