సబ్ ఫీచర్

ఆ వేదనకు ఇదీ మందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల నెలా ఆడవాళ్లను పలుకరించే నెలసరి నొప్పి వాళ్లను విపరీతంగా బాధపెడుతోంది. ముఖ్యంగా పెళ్లికాని అమ్మాయిలకు నరకమే. ఎందుకంటే హాయిగా సీతాకోక చిలుకల్లా ఎగరాలని ఆరాటపడే వయసులో ఈ నెల నెలా వచ్చే ఈ బాధ వారిని నిలువనీయదు. కొందరికి జీవిత పర్యంతం కొనసాగి సంబంధ బాంధవ్యాలను దెబ్బతీసే పరిస్థితులు ఏర్పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పొత్తికడుపులో వచ్చే ఈ నొప్పి కొందరికి ఒకరోజంతా ఉంటుంది. మరకొందరికి కొన్నిరోజులు పాటు వుంటుంది. కాని దీర్ఘకాలంగా వేధిస్తుంటే మాత్రం వైద్యులు సైతం కారణాలను అనే్వషిస్తారు. నెలసరి వచ్చినపుడు వచ్చే ఈ నొప్పిని, కాళ్లల్లో తిమ్మిరిని తట్టుకుని రోజూవారీ పనులు చేసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. అవేమిటో తెలుసుకుందాం.
ప్రతిరోజూ నిద్రలేవగానే నిమ్మరసం నీరు తాగితే మంచిది. ఇది శరీరాన్ని వేడిగా ఉంచుతుంది.
మీరు తీసుకునే ఆహారంలో విటమిన్ డి3 ఉండేటట్లు చూసుకోండి. చలికాలంలోశరీరాన్ని చురుకుగా ఉంచుతుంది.
ఆహారంలో ఆకుకూరలు ఉండేటట్లు చూసుకోవాలి. దీనివల్ల విటమిన్ బి, ఫైబర్, మినరల్స్ శరీరానికి అందుతాయి. అలాగే శరీరానికి అవసరమైన కాల్షియం, మేగ్నిషియం, ఐరన్ అందుతాయి. పాలకూర, బచ్చలకూర, నువ్వులు, గుమ్మడి గింజలు తదితరవాటిని ఆహారంలో తీసుకుంటే ఎంతో మంచిది.
కొవ్వునిచ్చే చేపలను, ఆయిల్‌ను తీసుకోవద్దు. ఈ సమయంలో వీటిని తీసుకోవటం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది.
ఇంటిలో తయారుచేసుకున్న దాల్చినచెక్క, అల్లం రసం తీసుకుంటే కూడా మంచిది. పావుటీ స్పూన్ దాల్చినచెక్క, చిటికెడు అల్లాని కప్పు వేడినీటిలో వేసుకుని తాగితే ఎంతో మంచిది. వీటితో టీ కూడా తయారుచేసుకుని తాగవచ్చు.
రేగుపండ్లు తింటే కాళ్ల తిమ్మర్లను తగ్గించుకోవచ్చు.
ప్రతిరోజూ సాయంత్రం ప్రింరోజ్ ఆయిల్‌ను రాసుకుంటే యాసిడ్స్ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆ ఆయిల్ ఛాతి నొప్పి, పిఎంఎస్ లక్షణాల నుంచి శరీరాన్ని కాపాడుతోంది.
ఆహారంలో కాల్షియం, మేగ్నిషియం ఉండేటట్లు చూసుకోండి. వీటిని ప్రతిరోజూ తీసుకోవటం వల్ల హార్మోన్లను సమతుల్యంలో ఉంచుతాయి.
నొప్పి వచ్చే ప్రాంతంలో వేడికాపడం పెట్టుకోవటం కాస్తంత ఉపశమనం కలిగిస్తోంది. కీళ్ల నొప్పులు లేకుండా చేసి ఆక్సిజన్ అందేటట్లు చేస్తోంది.
హాయిగా నిద్రపోవటంతో పాటు వ్యాయామాన్ని ప్రతిరోజూ చేయండి. ఒత్తిడిని అధిగమించాలంటే ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు శబ్ధకాలుష్యం లేకుండా ప్రశాంతంగా నిద్రపోండి. ప్రాణాయామం చేస్తే మరీ మంచిది.
తృణధాన్యాలను, నట్స్, గింజలను తింటే తప్పనిసరిగా ఎరోబిక్ ఎక్స్‌ర్‌సైజ్‌లు చేస్తే ఎంతో మంచిది. ఈ వ్యాయామం వల్ల ఎండ్రాఫిన్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి సహజ నొప్పి నివారణ మందులుగా ఉపయోగపడతాయి.
నెలసరి ప్రారంభానికి వారం రోజులు ముందుగా ప్రొజెస్టెరాన్ క్రీమ్ లేదా వైల్డ్ యామ్ క్రీమ్‌ను పొట్ట, పొత్తికడుపు, పిరుదులు, తొడలు, రొమ్ములు, చేతులకు రాసుకుంటే నొప్పి నివారణకు ఉపకరిస్తోంది.