సబ్ ఫీచర్

జనాభా నియంత్రణ సామాజిక బాధ్యత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ జనాభా మొత్తంగా అడ్డూ అదుపూ లేకుండా కాలం కంటే వేగంగా విపరీతంగా పెరిగిపోంతోంది. ప్రజల అవసరాలు తీర్చే వనరులు జనాభా పెరుగుదలకు తగ్గట్లుగా సమకూరడంలేదు. ప్రజల అవసరాలు తీర్చగలిగే సంపద, సేవలు, సరుకులు లభించడంలేదు. జానెడు కడుపుకోసమే, నేను గొప్పగా జీవించాలనే ఆలోచనలో ప్రజలలో ఒకరికి మరొకరి మధ్య వైషమ్యాలు పెరిగి రాష్ట్రాలమధ్య, దేశాలమధ్య జల యుద్ధాలు, ఆధిపత్య పోరాటాలు, భూమి, సహజ సంపదలను దోచుకోవడాలు, దాచుకోవడాలు జరుగుతున్నాయి. పెరుగుతున్న జనాభాకు ఆవాసం కల్పించాలంటే మరో గ్రహాన్ని వెతుక్కోవాల్సిందేనా.
11 జూలై 1987న జన్మించిన శిశువుతో ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరింది. అందుకే ఆనాటి నుండి జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ప్రపంచ జనాభాలో 40 శాతం ఇండియా, చైనాలలోనే ఉన్నారు. ప్రపంచ జనాభా ప్రతి సంవత్సరం 9 కోట్ల 20లక్షలు అదనంగా పెరుగుతోంది.
దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. జనం జనం ప్రభంజనం.. ఇవి ఒకప్పటి నానుడిలు. ప్రస్తుతం జనాభా ధరణిపై భారంగా మారింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఈ భూమీద 100 కోట్లమందికి ఆహారం దొరకడం ఒక పెద్ద సమస్యగా మారింది. ప్రతి సంవత్సరం కోటిమందికిపైగా ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. జనాభా పెరుగుదలతో ఇలాంటి కష్టాలు ఎన్నో కాలే కడుపులతో జీవనాన్ని వెళ్లదీస్తున్నవారు మరెందరో.. ఈ సమస్యలకు ముగింపు పలికేదెప్పుడు..?
మానవజాతి సాధించిన విజయాలతో మనిషి జీవిత ప్రమాణకాలం పెరిగింది. అదుపులేని జనాభా, కుటుంబంలో వంశోద్ధారకుడికోసం ఇష్టారీతిగా పిల్లలను కనడంతో జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. ఆకలి మరణాలు, నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోతూంది. జనాభా పెరుగుదల సమస్య తగ్గించడానికి ప్రతిఒక్కరూ సన్నద్ధం కావాలి. అవనిపై కోట్ల జనాభా పెరిగిపోతుంది. భూభారంగా మారిన జనాభా పెరుగులను నియంత్రించాల్సిన అవసరం పెరిగిపోతోంది. చేయి చేయి కలుపుదాం, జనాభా పెరుగుదలను నియంత్రించుదాం. జనాభా నియంత్రణను సామాజిక బాధ్యతగా గుర్తించాలి.
ప్రభుత్వ చర్యలేవి?
ప్రపంచంలో ప్రస్తుతం ప్రతి సెకనుకు 4.5 మంది భూమికి మీదకు వస్తున్నారు. ప్రతి 40 సంవత్సరాలకు జనాభా రెట్టింపయ్యే ప్రమాదం ఏర్పడనుంది. ప్రపంచంలోనే కుటుంబ నియంత్రణ పథకాలను 1950లోనే అధికారికంగా ప్రవేశపెట్టిన భారతదేశం ఇప్పటికీ జనాభా నియంత్రణ సాధించలేకపోయింది. ప్రజలలో మూఢ నమ్మకాలను వదిలే విధంగా కుల మతాలకు అతీతంగా గ్రామగ్రామాన చైతన్య కార్యక్రమాల ద్వారా, అవగాహన సదస్సుల ద్వారా జనాభా పెరుగుదల వల్ల ఎదురయ్యే కష్టనష్టాలను కళ్లకు కట్టినట్లుగా వివరించాలి. స్ర్తిని విద్యావంతురాలిని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా వుంది. యువతరంలో వెలుగులు నింపే విధంగా కృషిచేయాలి. జనాభాను అదుపు చేసి, మానవ వనరులను సరైన పద్ధతిలో ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుంది. భూమాత భారాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని గుర్తించాలి. జనాభా నియంత్రణ మనందరి కర్తవ్యం. పెరిగే జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల పెరుగుదల వలన ప్రజలలో చైతన్యం వచ్చినా సహజసిద్ధంగా లభించే వనరులను ఉపయోగించుకోవడంలో విఫలమవుతున్నారు. సహజ వనరులు అంతరించిపోతున్నాయి.
విద్యావకాశాలు, ఉద్యోగ అవకాశాలు
జనాభా పెరుగుదల వలన ప్రతి విషయంలో పోటీతత్వం విపరీతంగా పెరిగిపోతోంది. జనాభా పెరుగుదలకు అనుగుణంగా అవకాశాలు కల్పించకపోవడంతో యువతలో ఒత్తిడి రాజ్యమేలుతోంది. ఉపాధి అవకాశాలు దొరక్క నిరుద్యోగం రాజ్యమేలుతోంది. ఆర్థిక మాంద్యం భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. దేశంలో జనాభాకు అనుగుణంగా వౌలిక సౌకర్యాల కల్పనకు, అభివృద్ధికి పొంతనలేదు. విద్యారంగంలో చూస్తే ఐఐటి, మెడిసిన్, ఫార్మసీ, వ్యవసాయ రంగాలకు సంబంధించిన కోర్సులలో సీట్ సంపాదించాలంటే చాలా కష్టంగా మారింది. పిల్లలు చదువులకు బానిసలుగా మారుతున్నారు. సీటు సాధించలేకపోయినపుడు కుంగుబాటుకు గురవుతున్నారు. ఉద్యోగాలలో కూడా విపరీతమైన పోటీతత్వం పెరిగిపోతోంది. యువత మానసిక ఆందోళనలకు లోనవుతున్నారు.
అవకాశాలు సృష్టించే కృషి చేయాలి
యువతలో మానసిక ఆందోళనలు, ఆకలితో అలమటిస్తున్న పిల్లల భవితవ్యం బంగారుమయం కావాలన్నా జనాభా పెరుగుదలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా గుర్తించాలి. గ్రామంలోని విద్యావంతులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, యువకులు గ్రామ ప్రజలతో మమేకమై జనాభా నియంత్రణపై చైతన్యపరచాలి. కుటుంబ నియంత్రణ పథకాన్ని పకడ్బందీగా నిర్వహించాలి. జనాభా పెరుగుదలకు అనుగుణంగా అవకాశాలు సృష్టించేలా ప్రభుత్వాలు కృషిచేయాలి. మనిషి తలచుకుంటే నల్లరాళ్లనే కాదు ఉక్కు పర్వతాలు సైతం ముక్కలు చెక్కలు అయితీరాల్సిందే. సామాజిక చైతన్యంతో బంగారు భవితవ్యాన్ని సృష్టించుకొందాం. ఒత్తిడిరహిత జీవనాన్ని అనుభవిద్దాం. భవిష్యత్తు మూడు తరాలకు మనం నాందిగా నిలుద్దాం. జనాభా నియంత్రణలో అందరం భాగస్వాములవుదాం.

-డా.అట్ల శ్రీనివాస్‌రెడ్డి 9703935321