సబ్ ఫీచర్

దోమల నివారణ ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చినుకులు పడితే చాలు దోమలు పెరుగుతాయి. దోమల నుంచి రక్షించుకోలేకపోతే డెంగీ, చికెన్‌గున్యా, మలేరియా.. ఇలా ఎన్నో ప్రాణాంతక వ్యాధులు మనల్ని బాధిస్తాయి. అందుకే దోమల నియంత్రణ చాలా ముఖ్యం. చిన్నపిల్లలు వున్న ఇంట్లో క్రిమిసంహారకాల ద్వారా దోమల్ని పారద్రోలలేం. అందుకని సహజ పద్ధతుల ద్వారా దోమల్ని వదిలించుకోవడం మంచిది. అదెలాగంటే..
* వేపనూనెతో దోమల నియంత్రించవచ్చు. గుట్‌నైట్లు, ఆల్‌అవుట్లు, మార్టన్లు ఇలా ఎన్నో ఉన్నా వీటిన్నింటి వల్లా దీర్ఘకాలంలో శ్వాసకోస వ్యాధులు , మానసిక వ్యాధులు రావచ్చు. అందుకే వేపనూనెతో దోమల నియంత్రణ చేస్తే ఏ ఇతర వ్యాధులకు గురి కానక్కర్లేదు.
* వేపనూనె, కొబ్బరి నూనెలను సమానపాళ్లల్లో తీసుకోవాలి. ఈ నూనెను శరీరానికంతా అప్లై చేయాలి. ఇలాచేస్తే దాదాపు ఎనిమిది గంటల పాటు శరీరా భాగాలను తాకడానికి దోమలు సాహసించవు. ఈ నూనె వాసన వచ్చే ప్రదేశానికి రావడానికి కూడా దోమలు భయపడుతాయి. ఈ ఫార్ములాను జర్నల్ ఆఫ్ అమెరికన్ మస్క్విటో కంట్రోల్ అసోసియేషన్ తన సంచికలో ప్రచురించింది.
* వేపనూనెలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాండీ ప్రోటోజోల్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. చర్మ సౌందర్య రక్షణకు కొబ్బరి నూనె దోహదం చేస్తుంది. కాస్త పత్తిని ఉండగా చేసి వేపనూనెలో తడిపి ఇంట్లోని ప్రతి గదిలో నాలుగు మూలలా పెడితే దోమలు ఆ గదిలోకే రావు.
* అంతేకాక మురుగు నీరు నిలువ ఉన్న చోట కూడా ఈ వేపనూనెను నాలుగు చుక్కలు వేస్తే దోమ గుడ్లు పిల్లలు చేయకుండా ఉంటాయి.
* సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తరువాత ఇంటి తలుపులు తెరిచి ఉంచకండి. బాగా సూర్యుడు వచ్చినపుడు కిటికీ తలుపులు తెరిచి ఉంచండి.
* ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఇంటి పైన ఉండే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు మూతలు బిగించి ఉంచాలి.
* ఆరోమా ఆయిల్స్ మార్కెట్లో లభిస్తాయి. వీటిల్లో సిట్రోవెల్లా, లెమన్ గ్రాస్ ఆయిల్.. ఇలా ఎన్నో రకాల నూనెలు లభిస్తాయి. వీటిని మండించడం వల్ల కూడా దోమలు దరికి రావు.
* వెడల్పాటి పాత్రల్లో సబ్బునీరు ఉంచడం వల్ల ఈ నీటికి ఆకర్షితమైన దోమలు.. దీనిపై వాలి ప్రాణాలు కోల్పోతాయి.
* నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి, అందులో లవంగాలను చెక్కి వుంచినా కూడా దోమలు ఇంట్లోకి రావు.
* దోమల నివారణకు సోడియం లాంప్స్ వాడాలి.
* మస్కిటో ట్రాపింగ్ మెషన్సు ఇపుడు విరివిగా మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిని పెట్టుకోవడం వల్ల కూడా దోమల నుంచి మనలను మనం కాపాడుకోవచ్చు.