సబ్ ఫీచర్

అణుబాంబు విలయం.. వెంటాడే చేదు జ్ఞాపకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వితీయ ప్రపంచ సంగ్రామం నాటి కాలంలో- 1945 జూలై 16వ తేదీ అణుబాంబు ఆవిర్భవించిన న్యూక్లియర్ శకావిష్కరణకు గుర్తుగా ప్రపంచ చరిత్రలో మిగిలిపోయంది. అమెరికాలోని న్యూ మెక్సికోలో లాస్ ఆలమ్స్ ప్రాంతానికి 200 మైళ్ల దూరంలో ఉత్తర ఎడారిలో- ప్రప్రథమంగా అణుబాంబు పరీక్షకు ఆనాటి ఉదయం 5.30 గంటల ముహూర్తం నిర్ణయమైంది. రెండవ ప్రపంచ యుద్ధ మారణహోమ రాజ్యాధిపత్య అహంకార నియంతల ఉన్మాదం మానవ విధ్వంసనానికి భీకర సమర జ్వాలలతో మానవాళిని క్రూరంగా దహిస్తున్న రోజులవి. జపాన్ తలవంచి దిగిరాక పోవటంతో అమెరికా అత్యంత రహస్యంగా అణుబాంబు పరీక్షను జూలై 16న విజయవంతంగా నిర్వహించింది. ఆగస్టు 6న జపాన్‌లోని హిరోషిమా, ఆగస్టు 9న నాగసాకి నగరాలపై బాంబులు వేసి ప్రపంచ చరిత్రలో అత్యంత క్రూరంగా అమెరికా మృత్యు బీభత్స విలయం సృష్టించింది.
ఆరోజు ప్రపంచం గుర్తుంచుకోదగిన మూడు సంఘటనలను నాటి ప్రపంచ నేతలు నిర్వర్తించారు. జర్మనీ పరాజయ సందర్భంలో స్వాధీనమైన పాట్స్‌డమ్‌లో అమెరికా అధ్యక్షుడు హారీట్రూమన్, సోవియట్ అధినేత జోసెఫ్ స్టాలిన్, బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్, లేబర్ పార్టీ అధినేత క్లిమెంట్ అట్లీల శిఖరాగ్ర సమావేశంలో జపాన్‌కు గుణపాఠం నేర్పాలని నిర్ణయించారు. అదేరోజు బాంబ్ టెస్టింగ్ అనంతరం శాన్‌ఫ్రాన్నిస్కో నుండి, సౌత్ పసిఫిక్ టినియన్ ద్వీపానికి అక్కడి నుంచి బాంబర్ ప్లేన్‌లలో జపాన్ నగర విధ్వంసానికి ఉపక్రమణ కార్యాచరణ కొనసాగింది.
1933లో హిట్లర్ నియంతృత్వ పాలన కారణంగా జర్మనీ దుర్భర స్థితిగతులతో అతలాకుతలమైన రోజుల్లో, ప్రపంచ ప్రఖ్యాత అణుభౌతిక శాస్తవ్రేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్- హిట్లర్ నియంతృత్వ వ్యతిరేకిగా అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్‌కు, శత్రువుకంటే ముందుగా భయంకర సమరాయుధంగా అణుబాంబును తయారుచేసే కార్యక్రమాన్ని ఆరంభించవలసినదిగా ఉత్తరం రాశారు. అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్, ఐన్‌స్టీన్ సూచన మేరకు అణుబాంబు తయారీని అత్యంత రహస్యంగా మన్‌హట్టన్ ప్రాజెక్టుగా రూపకల్పనకు, రెండు బిలియన్ డాలర్లు వినియోగించి మూడేళ్లలో విజయవంతం చేసారు. ఆ విధంగా ఆవిర్భవించిన తొలి అణుబాంబు మారణహోమంతో జపాన్‌పై విరుచుకుపడి విషాద చరిత్ర సృష్టించింది. ఆ తరువాత ఐన్‌స్టీన్ 1955లో మరణించేంత వరకు శాంతి కాముకునిగా విశేష కృషి చేసారు.
ఘోర విస్ఫోటనం...
అణుబాంబు ఆవిర్భావంలో ఒట్టొహాన్, కాంప్టన్, ఫెర్మి, జిలార్డ్, ఐన్‌స్టీన్ వంటి ఎందరో మేధావుల అణుపరిశోధనల నిరంతర మేధా సంపన్నత నిక్షిప్తమై వుంది. అమెరికా న్యూక్లియర్ ఫిజిక్స్ శాస్తజ్ఞ్రుడు జె.రాబర్ట్ ఒపెన్ హైమర్, ఆటంబాంబు ఆవిర్భావ ప్రాజెక్టు సమన్వయాధికారిగా, మన్‌హట్టన్ బృందానికి 1942లో లాస్ అలమోస్, చీఫ్ సైన్స్ డైరెక్టరుగా వ్యవహరించాడు. బాంబు నిర్మాణ ఫార్ములాకు సంబంధం లేకపోయినా, ‘్ఫదర్ ఆఫ్ ది ఆటంబాంబ్’గా బృంద సారధ్యంతో రాత్రింబవళ్ళు శ్రమతో 1945 జూలై 16నాటికి పరీక్ష విజయవంతంగా ప్రయోగించి, భవిష్య ప్రపంచానికి అత్యంత శక్తివంతమైన భయంకర మారణాయుధాన్ని ప్రవేశపెట్టాడు. ఆరోజు 100 అడుగుల ఎతె్తైన 32 టన్నుల బరువున్న మెటల్ టవర్‌పై ఒక కొండమీద అణుబాంబు వుంచారు.
సురక్షిత ప్రదేశంలో సుమారు వేయి మంది చూస్తుండగా నిర్ణీత సమయంలో భయంకర శబ్దం తీవ్రమైన కాంతితో బాంబు పేల్చిన వెంటనే 40,000 అడుగుల ఎత్తున ఆకాశంలో కుక్కగొడుగులా మృత్యుమేఘం ఏర్పడింది. 9 మైళ్ళ దూరంలో ఉన్న కంట్రోల్ రూమ్‌లో ఓపెన్ హైమర్ వున్నాడు. అణువిస్ఫోటనం కాంతి తీవ్రత 450 మైళ్ల దూరం వరకు కనిపించింది. ఆ ప్రదేశంలోని 30 మైళ్లదూరం మేర జంతు, వృక్ష, జీవజాలం మాడి మసి అయ్యాయి. ప్రపంచం ఒక్కసారి షాక్ అయింది. కొద్ది రోజుల తరువాత 1800 అడుగుల ఎత్తునుండి హిరోషిమా నగరంపై ప్రయోగించిన బాంబు దాడిలో 80,000 మంది మాడి మసికాగా, నాగసాకి నగర విధ్వంసంలో 40,000 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాదిగా క్షతగాత్రులయ్యారు. ఈ రెండు నగరాలు సర్వస్వం విధ్వంసం ధాటికి నేలమట్టమయ్యాయి.
న్యూక్లియర్ శకారంభం..
1938లో నోబుల్ బహుమతి విజేత ఎన్‌రికో ఫెర్మి’ 1933లో న్యూట్రినో కనిపెట్టడం, 1942లో చికాగోలో ప్రప్రథమ న్యూక్లియర్ రియాక్టర్ డిజైన్ చేయటంతో ప్రపంచంలో అణుశక్తి ఆవిర్భావం ఆరంభమైంది. అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ అనుమతితో ఫెర్మి నాయకత్వంలో మన్‌హట్టన్ ప్రాజెక్టు, 1942 డిసెంబర్ 2న తెల్లవారుఝామున 3-45 గం.లకు ఫిజన్ రియాక్షన్ ఆవిష్కృతమైంది. తరువాత రెండున్నర సంవత్సరాల శాస్ర్తియ పరిశోధనలలో అణుబాంబు పరీక్ష విజయం కావటంతో, ప్రస్తుత 21వ శతాబ్దం నాటికి క్రమేపీ న్యూక్లియర్ యుగం అధునాతనమైంది.
1953లో అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్ ప్రపంచ మేధావులు, శాంతి ప్రవక్త జవహర్‌లాల్ నెహ్రూ వంటి నేతలు నిరాయుధీకరణ, అణుశక్తి శాంతి ప్రయోజనాల లక్ష్యాలను నిర్దేశించినా, అగ్రరాజ్యాల అణ్వాయుధ ఆధిపత్యం ఉత్తర కొరియా వంటి దేశాలు మరింత శక్తివంతమైన మారణహోమాన్ని సృష్టించగల హైడ్రోజన్ బాంబును నేడు తమ అమ్ముల పొదిలో చేర్చుకొన్నాయి. న్యూక్లియర్ సాంకేతికాభివృద్ధిని మానవ కల్యాణానికి, భూమి ప్రగతి, రక్షణ, శాంతి, సుస్థిర ప్రయోజనాలను ఆకాంక్షిస్తున్నా, ప్రపంచంలో అగ్రసనాధిపత్య యుద్ధోన్మాదం అణు విలయ విధ్వంస విపత్కర పరిస్థితి పొంచి వుంది.
శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ప్రబోధించిన విశ్వవిలయ ఉపదేశ మహత్మ్యసారం నన్ను నడిపించిందని, అణుబాంబు ప్రయోగ విజేత జె.రాబర్ట్ ఒపెన్ హైమర్ ప్రస్తావించటం విశేషం. భగవద్గీత 11వ అధ్యాయ విశ్వరూప దర్శనయోగంలో శ్రీకృష్ణ్భగవానుడు ‘‘కాలోస్మి లోక క్షయాకృత్ ప్రవృద్ధో’’ 32వ శ్లోకంలో తనను మహాకాలునిగా అర్జునునికి వివరిస్తారు. భగవద్గీత 12వ శ్లోకం ‘‘దివి సూర్య సహస్రస్య భవేత్ యుగ పద్ ఉత్థిదా’’ పరిశీలిస్తే వేయి సూర్యుల ప్రచండ విస్ఫోటనం, పోలికన అణుబాంబు విధ్వంసన జ్వల మృత్యు ప్రజ్వలనం ‘‘ఐయామ్ బికం డెత్’’ నేను విశ్వవిలయాన్ని సృష్టించగల మృత్యువును అయ్యానని అంటోంది. సృష్టి, స్థితి, లయ విశ్వరహస్య గీతాచార్యుని ఆధ్యాత్మిక మహత్త్వ దివ్యతత్త్వంలో నాటి అణుబాంబు ఒక శక శకలం.

-జయసూర్య