సబ్ ఫీచర్

శారీ ట్విట్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దం చీరకట్టు. జాతీయత ప్రతిబింబించే అందమైన డ్రెస్. అందుకే సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు ప్రత్యేక సందర్భాల్లో తప్పకుండా చీర కట్టుకుని మురిసిపోతూ మెరిసిపోతుంటారు. అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు? అనుకుంటున్నారు కదూ.. ఇప్పుడు మహిళలందరూ తమ చీర అనుభూతిని సోషల్ మీడియాతో పంచుకుంటూ తెగ సందడి చేస్తున్నారు. నిరంతం ఏదో ఒక హ్యాష్‌ట్యాగ్‌తో సందడి చేసే ట్విట్టర్.. గత రెండు రోజుల నుంచీ మహిళలు శారీమొమెంట్స్‌తో నిండిపోయింది. అందుకు ప్రధాన వేదికలుగా శారీ ట్విట్టర్, శారీస్వాగ్ అనే రెండు హ్యాష్‌టాగ్స్ మారిపోయాయి. ఇందులో ఆరుగజాల చీరకట్టు అందాన్ని వర్ణిస్తూ పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నాయకురాళ్లు, పలువురు విదేశీ సెలబ్రెటీలు.. వారు చీర కట్టుకున్న ఫొటోలను షేర్ చేస్తూ.. వారు ఏ సందర్భంగా చీర కట్టుకున్నారో కూడా వివరిస్తూ.. చీరపై తమకున్న ఇష్టాన్ని చాటుకుంటున్నారు. మొన్నటిదాకా ‘బాటిల్ క్యావ్ ఛాలెంజ్’లో బిజీగా ఉన్న సోషల్‌మీడియా ఇప్పుడు మహిళపై కనే్నసింది. గత రెండు రోజుల నుండి రెండు హ్యాష్‌టాగ్స్ ట్విట్టర్స్ విపరీతమైన ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో మహిళలంతా తమకు నచ్చి.. కొందరు తాజా ఫొటోలను, మరికొందరు పాత ఫొటోలను పంచుకుంటూ ఆనాటి జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటున్నారు. బాగా వైరలవుతోన్న వీరి శారీ అటైర్‌లకు ఫ్యాన్స్ వేలల్లో లైకులు, షేర్లు రావడం విశేషం. శారీ ట్విట్టర్‌లో కొందరు సెలబ్రెటీలు పోస్ట్ చేసిన శారీ ఫొటోల్ని చూద్దాం.
‘ఇరవై రెండు సంవత్సరాల క్రితం పెళ్లి సందర్భంగా పూజలో కూర్చుకున్నప్పుడు తీసిన ఫొటో..’ అంటూ ఫొటోతో పాటు ఆ సందర్భాన్ని కూడా వివరించింది జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా. అలాగే అక్కినేని అమల ఫొటోను పోస్ట్‌చేస్తూ ‘ఎరీనా క్లాతింగ్ స్టోర్ నుంచి అహింసా ఎరి సిల్క్ శారీ’ అని పెట్టింది. ఇంకా శివసేన ఉపనేత ప్రియాంక చతుర్వేది, ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రంలో సోనియా గాంధీ పాత్రలో నటించిన జర్మన్ బ్యూటీ సుజానే బెర్నాట్, ఖుష్బూ, యామీగౌతమ్, షబానా అజ్మీ, నగ్మా, ప్రగ్యాజైశ్వాల్, మీరాచోప్రా.. వంటి తదితరులు తమ ఫొటోలను పోస్ట్ చేశారు. వీరంతా తమ ఫొటోలను ట్విట్టర్‌లో ఉంచి, ఆ చీరతో తమకు ఉన్న అనుబంధాన్ని వివరిస్తున్నారు. అమ్మ చీర అని కొందరు, పెళ్లి చీర అని మరికొందరు సందర్భాలను తెలియజేస్తున్నారు. కేవలం స్ర్తిలే కాదు పురుషులు కూడా తమ భార్య, చెల్లెలు, కూతురు ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేస్తున్నారు. ఎవరైనా సరే.. ట్విట్టర్‌లోకి వెళ్లి ఆ ఫొటోలను చూడవచ్చు.