సబ్ ఫీచర్

బదిలీతో కంగారొద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్యోగులకు ట్రాన్స్‌ఫర్ అనేది తప్పదు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రైవేటు ఉద్యోగులు కూడా బదిలీ కావాల్సి వస్తోంది. ఇది తప్పనిసరి పరిస్థితి కాబట్టి మానసికంగా సిద్ధమవుతారు. కానీ ఈ పరిస్థితులకు పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అందుకే ట్రాన్స్‌ఫర్ విషయం పిల్లలకు అర్థమయ్యేలా వివరించి వారిని మానసికంగా సిద్ధం చేయాలి. బదిలీ అంశంలో భార్యాభర్తలే భయపడుతూ తరచుగా వాదించుకుంటుంటే, పిల్లల మనసు మరింత ఇబ్బందికి గురవుతుంటుంది.
ఈ మార్పు పిల్లలను వారి తాత, నాయనమ్మ, అమ్మమ్మలు ఇతర బంధువులనుండి దూరంగా తీసుకువెళ్లొచ్చు. అలా మానసికంగా బలమైన బంధం కలిగిన వారినుండి దూరంగా వెళ్ళటమనేది చిన్నారుల తట్టుకోలేని విషయం.
బదిలీ విషయం, మార్పుగురించి పిల్లలువేసే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పండి. మానసికంగా వారిని సిద్ధం చేస్తూ సామాన్లు సర్దటం దగ్గర్నుంచి ప్రతి ఒక్క అంశం పిల్లల బాధ్యతగా తల్లిదండ్రులకు సహకరిస్తారు.
కొత్త ఊరికి వెళ్లిముందుగా ఇంట్లో సామాన్లు అవీ సర్దుకుని ఆ తర్వాత తీరిగ్గా పిల్లల స్కూల్ గురించి ఆలోచిద్దామనుకోవటం తప్పు.. ట్రాన్స్‌ఫర్ గురించి తెలియగానే ముందుగా చూడాల్సింది పిల్లల చదువులు, వారి స్కూల్స్ గురించే. ప్రస్తుతమున్న ఊరిలో సాగుతున్న చదువుకు పూర్తిగా భిన్నమైన స్కూల్లో చేర్పిస్తే పిల్లల చదువులో వెనుకబడిపోతారు. కొత్త భాష, కొత్త వాతావరణానికి అందరూ పిల్లలూ అదే వేగంతో సర్దుకుపోలేరు. కాబట్టి పిల్లలకు తగిన స్కూలు, అక్కడి సౌకర్యాలు, టీచింగ్ పద్ధతి వగైరాలను కనుక్కుని, అనుకూలమైన స్కూల్‌ని ఎంపిక చేసి అక్కడ అడ్మిషన్ తీసుకున్న తర్వాతే ఆ స్కూల్ దగ్గరలో ఇంటిని చూసుకోవటం మంచిది. పిల్లలు పగటిపూట అత్యధిక సమయం గడిపేది స్కూల్‌లోనే.
అక్కడి టీచర్స్ బోధించే అంశాలు వాటిలో మీరు సేకరించిన సమాచారాన్ని పిల్లలకు అనుగుణంగా మార్చి చెప్పండి. అలా పిల్లలను కొత్త స్కూల్‌కి మానసికంగా సిద్ధం చేయకపోతే కొత్త టీచర్ బోధించే పద్ధతిని హర్షించరు. గత స్కూల్‌తో పోల్చుకుని చదువుమీద తగినంత దృష్టి పెట్టక ఇబ్బంది పడతారు.
ట్రాన్స్‌ఫర్ తర్వాత పిల్లల్లో వచ్చిన మార్పులను కొందరు తల్లిదండ్రులు గమనించే వుంటారు. బదిలీ కొంతమంది పిల్లల చదువును మెరుగుపరిస్తే, మరికొంతమందిని చదువుల్లో వెనుకబడేలా చేస్తుంది. టీనేజ్ పిల్లలు కొత్తచోటులో గాడితప్పి ప్రవర్తించటం జరుగుతుంది. ఈ మార్పులన్నీ వారి మానసిక స్థితిమీద ఆధారపడుతుంది. కొంతమంది పిల్లలు సున్నిత మనస్కులు వారి స్నేహబంధాలు బలంగా ఏర్పడతాయి. ఆ స్నేహాలను త్వరగా వదులుకోలేరు. కోల్పోయిన స్నేహం వారిని కలవరపెడుతూనే వుంటుంది.
కొత్త ప్రదేశంలో మనది కాని కొత్త భాష అయితే సమస్య మరింత జటిలమవుతుంది. రాని భాషల్లో మాట్లాడలేక, పైగా కొత్త స్నేహితులతో పిల్లలు సర్దుకుపోవటం చాలా కష్టం. వచ్చిన భాషలో మాట్లాడలేక, రాని భాషలో కుదరక స్కూల్లో ఒంటరిగా మిగిలిపోతారు. అది వారిని ఒకరకమైన డిప్రెషన్‌లోకి నెడుతుంది. తమకు అలాంటి కష్టం రావడానికి కారణం తల్లిదండ్రులేనని, వారిమీద కోపం పెంచుకుంటే, అది మరింత పెద్ద సమస్య అవుతుంది.
కొత్తచోటుకి వెళ్ళటంతో పెద్దలకీ కొన్ని సమస్యలు వస్తాయి. కొత్త పరిచయాలను చేసుకోవాలి. పిల్లలు ఒకచోట స్నేహాలు వదిలి కొత్త చోటుకు వచ్చినపుడు సరైన స్నేహితులను ఎంచుకోవటంలో ఎంతో ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బందినుండి వారిని బయటపడేయాలంటే, పాత స్నేహితులతో పరిచయాలు కొనసాగేలా చేయండి. ఫోన్లు అందరికీ అందుబాటులో వున్నాయి. ఈమెయిల్స్ చేసుకోవచ్చు. మార్పు మంచికేనని, మార్పును పాజిటివ్‌గా తీసుకుంటే రిలాక్సేషన్ నుండి తల్లిదండ్రులే కాదు పిల్లలు కూడా మేలు పొందుతారు.

- పి.ఎం. సుందరరావు 94906 57416